Bigg Boss 9 : బుల్లితెరపై ప్రసారమవుతున్న టాప్ రియాల్టీ షోలో బిగ్ బాస్ ఒకటి.. తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో త్వరలోనే తొమ్మిదవ సీజన్ ప్రారంభం కానుంది. గతంలో జరిగిన తప్పులను మళ్లీ రిపీట్ కాకుండా చూసుకునేందుకు బిగ్ బాస్ యాజమాన్యం.. ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్లను అతి జాగ్రత్తగా పరిశీలించి హౌస్ లోకి తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్ అగ్నిపరీక్ష అని డిస్నీ హాట్ స్టార్ లో ఒక షో మొదలైంది. అయితే ఈసారి సామాన్యుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. మరి హౌస్ లోకి ఇంటర్వ్యూ పోతున్న సామాన్యులకు రెమ్యూనరేషన్ ఎంతో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
బిగ్ బాస్ 9 తెలుగు..
10 రోజుల్లో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 9′ షో ప్రారంభం కాబోతుంది. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ కి విపరీతమైన హైప్, క్రేజ్ ఏర్పడింది. అందుకు కారణం ఈసారి సామాన్యులు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు. అందులో కొందరు 6 మందిని సెలెక్ట్ చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. సెలబ్రిటీలు కూడా రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈసారి క్రేజీ సీరియల్ హీరోయిన్లతో పాటుగా హీరోలను కూడా హౌస్ లోకి తీసుకురాబోతున్నారు. మొత్తానికి స్వీట్ పాన్ లాగా బిగ్ బాస్ ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఈ సీజన్ లో ఎన్ని గొడవలు జరుగుతాయో..? ఎవరి మధ్య ప్రేమలు పుడతాయో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..
Also Read : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!
సామాన్యుల రెమ్యూనరేషన్..?
సెలబ్రిటీలకు ఆల్రెడీ ఫెమ్ ఉంటుంది.. తమ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉంటే ఈ హౌస్ లో ఉంటారు లేదంటే సీరియల్స్ ఓ సినిమాలో చేసుకుంటూ బిజీగా గడుపుతారు. కానీ సామాన్యులకు ఇదొక బెస్ట్ ఫ్లాట్ ఫామ్ అని చెప్పాలి. తమలోని టాలెంట్ ని బయటపెట్టడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.. ఈసారి అగ్నిపరీక్ష ద్వారా సెలెక్ట్ చేసి హౌస్ లోకి పంపిస్తున్నాడంతో ప్రేక్షకులకు వారిపై కొంచెం అవగాహన వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సెలబ్రిటీలలో స్టార్లకు వారానికి నాలుగు లేదా ఐదు లక్షల వరకు రెమ్యూనరేషన్ ఉంటే.. సామాన్యులకు మాత్రం వేళల్లోనే ఉంటుందని తెలుస్తుంది. త్వరలోనే దీని గురించి పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా తెలుగు ఇండస్ట్రీలో ఈ షో కి మంచి క్రేజ్ దక్కింది.. ఇక బోనస్ గా ప్రైజ్ మనీ కూడా సామాన్యులు గెలిస్తే ఆ కిక్ వేరే లెవెల్ లో ఉంటుంది, ఎంతో మందికి మనం కూడా ఇలా సాధించవచ్చు అనే నమ్మకాన్ని ఇస్తుంది.. అయితే ఇక్కడ సెలెక్ట్ చేసిన వారిలో కేవలం ఐదు మంది మాత్రమే హౌస్ లో కొనసాగే అవకాశం ఉంది. మరి సెలబ్రిటీలకు సామాన్యులకు మధ్య వార్ నడుస్తుందేమో చూడాలి.. ఈ సీజన్ కోసం ఫాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. మరి ఇది ఏ మాత్రం విమర్శలను మూట కట్టుకుంటుందో చూడాలి..