E-Paper
Advertisement

ఆఫీస్‌కు లేట్‌గా వచ్చారని మానవ ఉద్యోగిని తొలగించిన ఏఐ బాస్.. ఎలా జరిగిందంటే

ఆఫీస్‌కు లేట్‌గా వచ్చారని మానవ ఉద్యోగిని తొలగించిన ఏఐ బాస్.. ఎలా జరిగిందంటే
Advertisement

AI Fires Human Employee| ఏఐ టెక్నాలజీ రాజ్యమేలుతున్న యుగమిది. చాలా బిజినెస్ కంపెనీలు ఇప్పుడు ఏఐ టెక్నాలజీ సాయంతో వ్యాపార నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఫైనాన్స్, హెచ్ ఆర్, ఇన్వెస్ట్‌మెంట్, సేల్స్ అన్ని విభాగాల్లో ఏఐ కీలకంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో ఏఐ తీసుకునే నిర్ణయాలు కొన్ని సార్లు షాకింగ్‌గా అనిపిస్తున్నాయి. అలాంటి ఒక ఆశ్చర్యకర ఘటన తాజాగా అమెరికాలో జరిగింది.

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఉన్న ఒక ప్రయోగాత్మక స్టోర్‌లో ఈ ఆసక్తికరమైన ఘటన జరిగింది. అక్కడ పనిచేస్తున్న ఏఐ మేనేజర్ ఒక మానవ ఉద్యోగిని తొలగించాలని సూచించింది.

Advertisement

ఆండన్ ల్యాబ్స్ కంపెనీకి చెందిన ఆండన్ మార్కెట్ (సూపర్ మార్కెట్ తరహా)లో లూనా (Luna) అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేనేజర్ అనేక వ్యాపార బాధ్యతలను నిర్వహిస్తోంది. ఉద్యోగి తరచుగా ఆలస్యంగా రావడంతో Luna అతడిని తొలగించాలని సిఫారసు చేసింది. ఆ ఉద్యోగి 23 షిఫ్ట్‌లలో 17 సార్లు ఆలస్యంగా వచ్చినట్లు డేటా చూపించింది. అయితే, లూనా చేసిన సూచనను మానవ సిబ్బంది పరిశీలించారు. చివరికి ఉద్యోగిని తొలగించే నిర్ణయాన్ని కంపెనీ అమలు చేసింది.

అటెండెన్స్ పాలసీ స్వయంగా రూపొందించిన లూనా ఏఐ

ఈ ఘటనలో మరో ఆసక్తికరమైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. లూనా కొన్ని నెలల క్రితమే ఉద్యోగుల అటెండెన్స్ సిస్టమ్ (హాజరు విధానాన్ని) రూపొందించింది. అయితే, తర్వాత ఆ ఏఐ తన స్వంత నిబంధనలను సరిగ్గా గుర్తుంచుకోలేకపోయింది. దీంతో ఉద్యోగి చాలా కాలం పాటు ఆలస్యంగా వచ్చినప్పటికీ వెంటనే చర్య తీసుకోలేదు. తర్వాత పరిశోధకులు లూనా రూపొందించిన పాత పాలసీలను గుర్తు చేశారు. ఉద్యోగి పనితీరును మళ్లీ పరిశీలించాలని ఏఐని కోరారు. సమాచారాన్ని పరిశీలించిన తర్వాత ఉద్యోగిని తొలగించాలని లూనా సిఫారసు చేసింది. ఈ ఘటన ప్రస్తుత ఏఐ వ్యవస్థల సామర్థ్యాలతో పాటు వాటి పరిమితులను కూడా చూపించింది.

ఆండన్ మార్కెట్ బిజినెస్ నిర్వహిస్తున్న ఏఐ

Advertisement

ఆండన్ మార్కెట్ (Andon Market) ఒక ప్రత్యేక ప్రయోగంలో భాగంగా పనిచేస్తోంది. ఏఐ కేవలం సూచనలు, ప్లానింగ్ చేయకుండా నిజంగానే వ్యాపారాన్ని ఎలా నిర్వహిస్తుందో పరిశోధకులు పరిశీలిస్తున్నారు. ఈ సర్వీస్ కోసం లూనాకు ఆండన్ ల్యాబ్స్ కంపెనీ.. లూనాకు 1 లక్ష డాలర్లు క్యాష్ పెట్టుబడి (రోజూ వారీ నిర్వహణ కోసం) కూడా ఇచ్చింది. కంపెనీ కార్డు, ఇంటర్నెట్ సదుపాయం, మూడు సంవత్సరాల స్టోర్ లీజ్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత స్టోర్‌ను ప్రారంభించి లాభాలు చూపాలని ఏఐకి సూచించారు.

ఈ ప్రక్రియంలో భాగంగానే లూనా ఏఐ అనేక ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలను తీసుకుంది. ఉత్పత్తులను ఎంచుకోవడం కూడా ఆ బాధ్యతల్లో భాగంగా ఉంది. ఉత్పత్తుల ధరలు, స్టోర్ పని సమయాలను కూడా లూనా నిర్ణయించింది. స్టోర్ బ్రాండింగ్, ఉద్యోగుల నియామకంలో కూడా ఏఐ పాత్ర పోషించింది.

ఆండన్ మార్కెట్‌లో విక్రయించే ఉత్పత్తులు ఇవే

ఈ స్టోర్‌లో పుస్తకాలు, కొవ్వొత్తులు, కళాఖండాలు, గేమ్స్ వంటి అనేక వస్తువులు విక్రయిస్తున్నారు. ఏఐ టెక్నాలజీ, సమాజానికి సంబంధించిన అంశాలపై ఉన్న పుస్తకాలు కూడా స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే స్టోర్‌లో సేల్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఇంత వరకు లాభాలు నమోదు కాలేదు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, గత కొన్ని నెలల్లో స్టోర్ బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా తగ్గింది. మార్చిలో ఉన్న 1,00,000 డాలర్ల బ్యాలెన్స్ ఐదు నెలల్లో 61,186 డాలర్లకు తగ్గింది.

ఈ ఏఐ ప్రయోగం ముఖ్య ఉద్దేశం

ఆండన్ ల్యాబ్స్ సిఈఓ లూకాస్ పీటర్సన్ ప్రకారం.. ఈ ప్రయోగం భవిష్యత్ కార్యాలయాలపై కొత్త అవగాహనను అందించవచ్చు. భవిష్యత్తులో ఏఐ మరింత క్లిష్టమైన వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే అవకాశం ఉంది. అయితే, లూనా ఉద్యోగిని తొలగించిన ఘటన ప్రస్తుతం ఉన్న ఏఐ పరిమితులను కూడా స్పష్టంగా చూపించింది. ఏఐ ఒక విధానాన్ని రూపొందించగలదు కానీ దాన్ని నిరంతరం గుర్తుంచుకుని అమలు చేయడంలో ఇబ్బంది పడుతుంది. ఉద్యోగి తొలగింపు వంటి కీలక నిర్ణయాల్లో మానవుల పర్యవేక్షణ ఇప్పటికీ ముఖ్యమైనదిగా కనిపిస్తోంది. ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్నప్పటికీ జవాబుదారీతనం, మానవ పర్యవేక్షణ వంటి ఆంశాలు ఇప్పటికీ ప్రధానమే.

Also Read: బంగారం, రియల్ ఎస్టేట్, ఎఫ్‌డీలపై తగ్గిపోతున్న ఆసక్తి.. భారతీయులు పెట్టుబడి కోసం ఎంచుకుంటున్న కొత్త మార్గాలివే

Tags

Related News

అయ్య బాబోయ్.. క్రెడిట్ కార్డులపై బ్యాంకులు వసూలు చేసే హిడెన్ చార్జీలు ఇవా?!

పిపిఎఫ్ అకౌంట్‌తో నెలకు రూ.61000 ఆదాయం.. 25 ఏళ్లలో రూ.1 కోటి ఫండ్.. ఇలా చేస్తే

బంగారం, రియల్ ఎస్టేట్, ఎఫ్‌డీలపై తగ్గిపోతున్న ఆసక్తి.. భారతీయులు పెట్టుబడి కోసం ఎంచుకుంటున్న కొత్త మార్గాలివే

దిగొస్తున్న పసిడి-వెండి ధరలు, రూ. 3 వేలు పతనం, మార్కెట్లో రేటు ఎలా ఉంది?

కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌-డీజిల్-ఏటీఎఫ్‌‌లపై ట్యాక్స్ తగ్గింపు, అర్థరాత్రి నుంచి అమలు

దిగొచ్చిన పసిడి ధర.. వినియోగదారుల్లో ఒక్కటే ఆనందం, మార్కెట్లో ధరల మాటేంటి?

ఓలా, ఊబర్‌కు షాక్.. క్యాబ్ బుకింగ్‌ కోసం టిప్స్ చెల్లించాల్సిన అవసరం లేదు..

Big Stories

Advertisement
×