E-Paper
Advertisement

బంగ్లాదేశ్ ను చిన్న‌చూపు చూడ‌ట‌మే ఆస్ట్రేలియా కొంప‌ముంచింది

బంగ్లాదేశ్ ను చిన్న‌చూపు చూడ‌ట‌మే ఆస్ట్రేలియా కొంప‌ముంచింది
Advertisement

Aakash Chopra On AUS VS BAN:  బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన బంగ్లాదేశ్… ఇప్పటికే తొలి టెస్ట్ లో విక్టరీ సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ లో 1-0 తేడాతో ముందంజలోకి వచ్చింది బంగ్లాదేశ్. అంతేకాదు ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా టెస్ట్ విజయం సాధించింది బంగ్లా. ఈ క్రమంలో 23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా పై ప్రతీకారం తీర్చుకుంది.

బంగ్లాదేశ్ ను చిన్న‌చూపు చూడ‌ట‌మే ఆస్ట్రేలియా కొంప‌ముంచింది

ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో కంగారు జట్టుపై తొలి విజయాన్ని నమోదు చేసిన బంగ్లాదేశ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇండియాతో పాటు పాకిస్తాన్ అటు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు కూడా బంగ్లాదేశ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. లేటెస్ట్ గా టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) కూడా స్పందించారు. బంగ్లాదేశ్ ఆటను మెచ్చుకుంటూనే..ఆస్ట్రేలియా తప్పిదాలను బయటపెట్టారు.

Advertisement

ఇండియా, ఇంగ్లాండ్ లాంటి పెద్ద జట్లకు మాత్రమే ఆస్ట్రేలియా గౌరవం ఇచ్చిందని.. బంగ్లాదేశ్ లాంటి ఈ చిన్న జట్లను పట్టించుకోలేదని మండిపడ్డారు. అందుకే బంగ్లాదేశ్ తో సొంత గ‌డ్డ‌పై ఆసీస్ టెస్టులు ఆడ‌లేద‌న్నారు. ఆ అహంకారంతోనే ఇప్పుడు ఆస్ట్రేలియా ఓడిపోయిందని హేళన చేశారు. ఆస్ట్రేలియా ద్వంద్వ నీతిని ఎండగడుతూ, అహంకారాన్ని దించుతూ బంగ్లాదేశ్ విక్టరీ నమోదు చేస్తుందని వెల్లడించారు.

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

చిన్న గ్రౌండ్స్ తో స్కెచ్ వేశారు…ప్లాన్ రివ‌ర్స్ అయి, గోతిలో ప‌డ్డారు

Advertisement

టెస్ట్ క్రికెట్ ను తామే ప్రమోట్ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్న ఆస్ట్రేలియా… ఇప్పుడు జరిగిన అవమానానికి ఎలాంటి సమాధానం చెబుతుందని ఫైర్ అయ్యారుఆకాశ్ చోప్రా (Aakash Chopra). ఆస్ట్రేలియా గడ్డపై ఎన్నో సంవత్సరాలుగా టెస్ట్ సిరీస్ లు ఆడతామని బంగ్లాదేశ్ కోరుతుంటే… వాళ్లు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇక చాలా రోజుల తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును పిలిచి… దిక్కుమాలిన డార్విన్ స్టేడియం లో మ్యాచ్ నిర్వహించారని ఆగ్రహించారు. చిన్న స్టేడియం ఎంపిక చేసి బంగ్లాదేశ్ ను అవమానించే ప్రయత్నం చేశారని ఫైర్ అయ్యారు. బంగ్లాదేశ్ తో మెల్బోర్న్, లేదా సిడ్ని వేదికలలో మ్యాచ్ నిర్వహించి ఉంటే ఆస్ట్రేలియా గెలిచేది అన్నారు. కానీ చిన్న గ్రౌండ్స్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఆస్ట్రేలియా బొక్క బోర్లా పడిందని పరువు తీశారు.

డబ్బు ఉన్న జట్లకు బలుపు ఎక్కువే

ఎక్కువ ఆదాయం వచ్చే క్రికెట్ బోర్డులకు బలుపు ఎక్కువ అంటూ ఆకాశ్ చోప్రా (Aakash Chopra)
మండిపడ్డారు. ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ టీమిండియా ఇలాగే వ్యవహరిస్తున్నాయని సీరియస్ అయ్యారు. చిన్న టీమ్స్ తో కూడా టెస్టులు వాడాలని కోరారు. అందుకే టీమిండియా ఉన్న టి20 లలో ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిందని గుర్తు చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ చేతిలో క్రికెట్ ఆస్ట్రేలియా ఓడిపోవడం దీనికి నిదర్శనం అని చెప్పారు.

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

Related News

టీమిండియా కంటే బంగ్లానే బెట‌ర్‌.. గంభీర్ పై పాకిస్తాన్ ట్రోల్స్‌ !

ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేయండి..వీడియో కాల్ లో బంగ్లాదేశ్ ప్రధాని

Ms Dhoni: ధోనీ హెల్మెట్‌పై జాతీయ జెండా ఎందుకు ఉండ‌దు?

కేఎల్ రాహుల్ పెద్ద సెల్ఫీష్‌.. న‌న్ను కావాల‌నే ర‌నౌట్ చేశాడు ?

బంగ్లాదేశ్ చేతిలో ఆస్ట్రేలియా ఘోర‌ ఓట‌మి..టీమిండియాకు బిగ్ రిలీఫ్‌

23 ఏళ్ల కింద‌ట అవ‌మానం…ఆస్ట్రేలియా గ‌డ్డ‌పైనే ప్ర‌తీకారం తీర్చుకున్న బంగ్లా

మెట్ల‌పైనే కుప్ప‌కూలిన‌ కేఎల్ రాహుల్…బీసీసీఐ చేత‌గానీ త‌న‌మే కార‌ణమంటూ విమ‌ర్శ‌లు !

Big Stories

Advertisement
×