BigTV English

BSNL Cheapest Recharge Plan: BSNL సూపర్ ప్లాన్.. జస్ట్ రూ.107 రీఛార్జ్.. 35 రోజుల వాలిడిటీ.. ఫుల్ ఎంజాయ్!

BSNL Cheapest Recharge Plan: BSNL సూపర్ ప్లాన్.. జస్ట్ రూ.107 రీఛార్జ్.. 35 రోజుల వాలిడిటీ.. ఫుల్ ఎంజాయ్!

BSNL Cheapest Recharge Plan: ఇటీవలే రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌తో సహా దేశంలోని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు రీఛార్జ్ ధరలను భారీగా పెంచాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ సంస్థలకు చుక్కలు చూపిస్తోంది. చవకైన ధరల్లో ప్లాన్‌లను ప్రకటిస్తూ కస్టమర్లను భారీగా పెంచుకుంటుంది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను విస్తరించేందుకు పెద్ద ప్లానే రెడీ చేస్తోంది. తక్కువ ఖర్చుతో రీఛార్జ్‌తో ఉత్తమైన ప్లాన్‌లను అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ రూ. 107 ప్రీపెయిడ్ ప్లాన్‌ ప్రకటించింది. ఇది కస్టమర్లకు అన్‌లిమిటెడ్ కాల్స్, డేటాను ఆఫర్ చేస్తోంది.


BSNL రూ. 107 Plan
BSNL తీసుకొచ్చిన రూ.107 ప్లాన్ 35 రోజుల పాటు సర్వీస్ వాలిడిటీతో వస్తుంది. ఇది కంపెనీ బేస్ ప్రీపెయిడ్ ప్లాన్. ఇది 30 రోజుల కంటే ఎక్కువ వాలిడిటీ అందిస్తోంది. ఈ ప్లాన్ 35 రోజుల సర్వీస్ వాలిడిటీతో వస్తుంది. ఇప్పుడు ఇది వినియోగదారులకు డేటా ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఈ ప్లాన్‌తో పాటు 200 నిమిషాల వాయిస్ కాలింగ్‌తో పాటు 3GB డేటా వస్తుంది. అయితే ఈ BSNL ప్లాన్‌తో బండిల్ చేయబడిన ఎటువంటి ఎస్‌ఎమ్‌ఎస్ బెనిఫిట్స్ లేవు.

Also Read: వామ్మో వామ్మో.. చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లు.. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్..!


మీరు సెకండరీ సిమ్‌ని కలిగి దానిని యాక్టివ్‌గా ఉంచాలనుకుంటే ఇది బెస్ట్ ప్లాన్. బీఎస్‌ఎన్ఎల్ ప్రస్తుతం 4జీ నెట్వర్క్ అందుబాటులో లేదు. కానీ ప్రధాన టెలికాం కంపెనీలన్నీ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే  బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలను ఆగస్టు నాటికి దేశంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా 4జీ సేవలకు సంబంధించిన రీఛార్జ్ ప్లాన్‌లను కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో వివరాలను వెల్లడించారు.

BSNL కొత్త కస్టమర్ల కోసం అందుబాటులోకి తెచ్చిన రూ. 108 ప్లాన్. 28 రోజుల వాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 1GB డేటా ఉంటుంది. మరో రీఛార్జ్ ప్లాన్ రూ. 197. ఇది 70 రోజుల వాలిడిటీతో వస్తోంది. ఈ ప్లాన్ రోజుకు 2GB డేటాను అందిస్తుంది. అదనంగా వినియోగదారులు 18 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలను పొందుతారు.

Also Read: BSNL బంపర్ ఆఫర్.. జస్ట్ ‘హాయ్’ అని మేసేజ్.. మూడు నెలలు అన్‌లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్!

బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 199 ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 70 రోజుల పాటు ప్రతిరోజూ 2GB డేటా వంటి ప్రయోజనాలను అందిస్తోంది. మీరు 150 రోజుల వాలిడిటీ ప్లాన్‌ని ఎంచుకోవాలనుకుంటే మీరు రూ. 397 రిఛార్జ్ చేయాలి. ఇది 4G నెట్‌వర్క్‌లో 2GB డేటాతో పాటు 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్‌లను అందిస్తుంది.

Related News

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

BSNL recharge offer: రూ.61కే ఓటీటీ, లైవ్ ఛానెల్.. ఇంకా ఎన్నో, BSNL బిగ్ ప్లాన్!

FD In Bank: బ్యాంకులో FD చేయాలనుకుంటున్నారా? ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయకండి!

Jio Prepaid Plans: వామ్మో .. ఏమిటి, జియో ఇన్ని రిచార్జ్ ప్లాన్స్ తొలగించిందా?

Foreclosing Loan: బ్యాంక్ లోన్ ఫోర్ క్లోజ్ చేయడం మంచిదా? కాదా? మన క్రెడిట్ స్కోర్ పై దీని ప్రభావం ఉంటుందా?

Jio Recharge Offers: జియో బంపర్ ఆఫర్.. రీచార్జ్ చేసుకుంటే వెంటనే క్యాష్‌బ్యాక్!

BSNL Sim Post Office: పోస్టాఫీసులో BSNL సిమ్.. ఇక గ్రామాలకూ విస్తరించనున్న సేవలు

Big Stories

×