EPFO ATM Card Mobile App | ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో భాగమైన ఉద్యోగుల కోసం త్వరలోనే ఈపిఎఫ్‌ఓ మొబైల్ అప్లికేషన్, డెబిట్ కార్డు వసతులు అందుబాటులోని రానున్నాయని కేంద్ర లేబర్, ఎంప్లాయ్‌మెంట్ మంత్రి మన్‌సుఖ్ మాండవీయా తెలిపారు. ఈపిఎఫ్‌ఓ సబ్స్‌క్రైబర్లకు ఈ వసతులు 2025 సంవత్సరం మే లేదా జూన్ నెలలో అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది.
EPFO 2.0 సిస్టమ్ లో మార్పులు చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయా అన్నారు. దీనికి సంబంధించి మొత్తం ఐటి సిస్టంని అప్గ్రేడ్ చేస్తున్నమాని.. జనవరి 2025 చివరికల్ల సిస్టం అప్‌గ్రేడ్ పూర్తి అవుతుందని ఆయన వెల్లడించారు. ఆ తరువాత EPFO 3.0 యాప్ ని మే లేదా జూన్ 2025లో లాంచ్ చేసి EPFO సబ్స్‌క్రైబర్లకు బ్యాంకింగ్ ఫెసిలిటీ కల్పిస్తామని తెలిపారు. దీని వల్ల మొత్తం ప్రావిడెంట్ ఫండ్ సిస్టమ్ కేంద్రీకృతమవుతుందని, క్లెయిమింగ్ అండ్ సెటిల్ మెంట్ ప్రక్రియ సులభతరమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలతో చర్చలు
కేంద్ర లేబర్ మంత్రిత్వశాఖ ద్వారా అందిన సమాచారం ప్రకారం.. ఈపిఎఫ్‌ఓ సబ్స్‌క్రైబర్లకు EPFO 3.0 ద్వారా బ్యాంకింగ్ సదుపాయాలు కల్పించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ మినిస్ట్రీతో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సిస్టం విజయవంతంగా అమలుపరిస్తే.. ఈపిఎఫ్‌ఓ సబ్స్‌క్రైబర్లు EPFO నిధులను పిఎఫ్ అకౌంట్ డెబిట్ కార్డులు ఉపయోగించి ఎటిఎంల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.
Also Read: న్యూ ఇయర్ పార్టీలు ఎంజాయ్ చేసిన భారతీయలు.. స్విగ్గీలో ఫ్లేవర్ కండోమ్స్, గ్రేప్స్ ఫుల్ సేల్..
ఈపిఎఫ్‌ఓ ఎటిఎం విత్‌డ్రాల్ లిమిట్?
ఈపిఎఫ్‌ఓ సబ్స్‌క్రైబర్లకు ప్రభుత్వం అందించే ఎటిఎం కార్డుకు కూడా పరిమితి ఉంటుంది. పిఎఫ్ అకౌంట్ లోని మొత్తం నిధులు విత్ డ్రా చేసుకునేందకు వీలుపడదు. అందుకే లిమిట్ లోపలే పిఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలి. ఇందుకు ఎవరి అనుమతి అనుమతి ఉండదు. ఇంతకుముందు పిఎఫ్ అకౌంట్ నుంచి ఉద్యోగులు అవసరమైనప్పుడు డబ్బులు విత్ డ్రా చేయాల్సి వస్తే.. దానికి సుదీర్ఘ ప్రక్రియ ఉండేది. ఈ కొత్త సిస్టంతో ఈపిఎఫ్ సబ్స్‌క్రైబర్లు ముందులాగా ఫామ్ ఫిల్ చేయడం, ఆఫీసుల చుట్టూ తిరగడం వంటి ఇబ్బందుతు తప్పాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో ఉద్యోగ అవకాశాలు మెరుగు
కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయా మీడియాతో మాట్లాడుతూ.. 2014 నుంచి 2024 వరకు పదేళ్ల పాటు ప్రధాని మోడీ పాలనలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయని చెప్పారు. అంతకుముందు ఉన్న యుపిఏ ప్రభుత్వం కన్నా మోదీ ప్రభుత్వం ఆరు రెట్లు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిందని అన్నారు. కేవలం ఒక్క సంవత్సరం అంటే 2023-24లోనే దేశ వ్యాప్తంగా 4.6 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించామని మంత్రి మన్‌సుఖ్ మాండవీయా వెల్లడించారు. యుపిఏ హయాంలో 2004 నుంచి 2014 మధ్య వ్యవసాయ రంగం కుదేలైందని అన్నారు. 16 శాతం మంది వ్యవసాయం రంగంలో ఉపాధి కోల్పోయారని అన్నారు. కానీ అదే వ్యవసాయ రంగంలో 2014 నుంచి 2023 మధ్య ఎన్డీఏ ప్రభుత్వం 19 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించిందని చెప్పారు.