E-Paper
Advertisement

ఐటిఆర్ ఫైల్ చేశాక.. ట్యాక్స్ రీఫండ్ ఎప్పుడు వస్తుంది?

ఐటిఆర్ ఫైల్ చేశాక.. ట్యాక్స్ రీఫండ్ ఎప్పుడు వస్తుంది?
Advertisement

Tax Refund Status| ఆదాయపు పన్ను రిటర్న్‌ (ITR) దాఖలు చేయగానే పన్ను ప్రక్రియ పూర్తయినట్లు కాదు. రిటర్న్‌ సమర్పించిన తర్వాత పన్ను రీఫండ్‌ ఎప్పుడు బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతుందా? అని చాలా మంది ఎదురుచూస్తుంటారు. అయితే ప్రతి ట్యాక్స్ పేయర్‌కి ఒకే సమయంలో రీఫండ్‌ రావడం జరగదు.

ఐటిఆర్ రీఫండ్‌ సాధారణంగా ఎంత సమయం పడుతుంది?

సాధారణంగా ఎలాంటి సమస్యలు లేని రిటర్న్స్‌కు రెండు నుంచి ఆరు వారాల్లో రీఫండ్‌ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆదాయపు పన్ను శాఖ పరిశీలన, ధృవీకరణ, వివరాల్లో ఉన్న తేడాలు వంటి అంశాలపై సమయం ఆధారపడి ఉంటుంది. రిటర్న్‌లో తప్పులు లేదా సరిపోని సమాచారం ఉంటే అదనపు పరిశీలన అవసరం కావచ్చు.

రీఫండ్‌ త్వరగా రావాలంటే ఏం చేయాలి?

Advertisement

రిటర్న్‌లో ఆదాయం, పన్ను చెల్లింపులు వంటి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలి. ఫామ్ 16, ఫామ్ 26AS, AIS, TIS వంటి పత్రాల్లో ఉన్న సమాచారంతో వివరాలను సరిపోల్చుకోవాలి. ఐటిఆర్ సమర్పించిన వెంటనే ఈ – వెరిఫికేషన్‌ పూర్తి చేయడం కూడా చాలా ముఖ్యం. అలాగే రీఫండ్‌ జమ అయ్యే బ్యాంక్‌ ఖాతాను ముందుగానే ప్రీ వాలిడేట్‌ చేసుకోవాలి.

ముందుగానే ఐటిఆర్ దాఖలు చేస్తే రీఫండ్‌ త్వరగా వస్తుందా?

ముందుగా ఐటిఆర్ దాఖలు చేయడం వల్ల రీఫండ్‌ తప్పకుండా త్వరగా వస్తుందని చెప్పలేం. అయితే ఫైలింగ్‌ రద్దీ పెరగకముందే రిటర్న్‌ ప్రాసెసింగ్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. తప్పులను గుర్తించి సరిచేసుకోవడానికి కూడా ఎక్కువ సమయం లభిస్తుంది. అందుకే చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే రిటర్న్‌ దాఖలు చేయడం మంచిది.

రీఫండ్‌ రాకపోతే ఏం చేయాలి?

Advertisement

ముందుగా అధికారిక ఆదాయపు పన్ను ఈ – ఫైలింగ్‌ పోర్టల్‌లో ఐటిఆర్, రీఫండ్‌ స్టేటస్‌ను చెక్ చేయాలి. బ్యాంక్‌ అకౌంట్ ప్రీ వాలిడేట్‌ అయిందో లేదో కూడా చూడాలి. ఆదాయపు పన్ను శాఖ నుంచి ఏవైనా ఈమెయిల్స్‌, నోటీసులు లేదా అదనపు సమాచారం కోరిన సందేశాలు వచ్చాయా అని పరిశీలించాలి. అవసరమైతే పోర్టల్‌ ద్వారా గ్రీవెన్స్‌ కూడా నమోదు చేయవచ్చు.

ఆలస్యమైతే రీఫండ్‌పై వడ్డీ వస్తుందా?

కొన్ని సందర్భాల్లో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 244A ప్రకారం రీఫండ్‌పై నెలకు లేదా నెలలో కొంత భాగానికి 0.5 శాతం సాధారణ వడ్డీ లభించే అవకాశం ఉంది. అయితే దీనికి కొన్ని నిబంధనలు, షరతులు వర్తిస్తాయి.

Also Read: ఇంటర్వ్యూలో కళ్లుమూసుకుని సమాధానం చెప్పాలి.. షాక్ అయిన ఏఐ ఇంజనీర్

చివరగా గుర్తుంచుకోవాల్సింది విషయాలు

కచ్చితమైన వివరాలతో ఐటిఆర్ దాఖలు చేయడం, వెంటనే ఈ – వెరిఫికేషన్‌ పూర్తి చేయడం, బ్యాంక్‌ ఖాతాను ప్రీ-వాలిడేట్‌ చేయడం, పన్ను వివరాలను సరిపోల్చుకోవడం ద్వారా అనవసరమైన ఆలస్యాలను తగ్గించుకోవచ్చు. రీఫండ్‌ వెంటనే వస్తుందని మాత్రం ఏ ఒక్క చర్య హామీ ఇవ్వదు. కాబట్టి రిటర్న్‌ స్టేటస్‌ను క్రమం తప్పకుండా చెక్ చేసి, సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించడం మంచిది.

Also Read: ఐటిఆర్ ఫైల్ చేసినా ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చిందా? దీనికి 3 కారణాలు ఇవే

 

Tags

Related News

వారంటీ vs గ్యారంటీ.. రెండింటికి తేడా ఏంటి? దేని వల్ల మనకి ఎక్కువ లాభం?

డీమార్ట్ షాపింగ్ సీక్రెట్స్.. బిల్లు సగానికి తగ్గాలంటే.. ఏవి కొనాలి? ఏవి కొనకూడదు?

పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. రూ. 1.20 లక్షలకు పడిపోనున్న బంగారం ధర?

ఓలాకు భారీగా జరిమానా! ముందస్తు ‘టిప్’ వ్యవహారం, నిలిపి వేయాలని సీసీపీఏ ఆదేశం

ఆవు పేడతో అద్భుతం.. రూ. లక్షల్లో సంపాదిస్తున్న సాధారణ మహిళ.. ఇదెక్కడి వెరైటీ బిజినెస్!

భార్యాభర్తల అద్భుత ఆలోచన.. మట్టి లేకుండానే కుంకుమపువ్వు సాగు.. నెలకు రూ. 4 లక్షల సంపాదన!

సిటీ ఎందుకు మామ.. పల్లెల్లో ఉంటూ రూ.లక్షల్లో సంపాదించొచ్చు.. ఈ వ్యాపారాలు ట్రై చేయ్!

ఒక్క ఐడియాతో రూ.100 కోట్ల టర్నోవర్.. స్వీట్స్ బిజినెస్‌లో సరికొత్త ట్రెండ్ ప్రారంభించిన యువ వ్యాపారవేత్తలు

Big Stories

Advertisement
×