E-Paper
Advertisement

మారుతున్న పరిణామాలు.. పండగ వేళ బంగారం ధర పతనం, మార్కెట్లో రేటు ఎలా ఉంది?

మారుతున్న పరిణామాలు.. పండగ వేళ బంగారం ధర పతనం, మార్కెట్లో రేటు ఎలా ఉంది?
Advertisement

Gold Price Today: అంతర్జాతీయ పరిణామాలు బులియన్ మార్కెట్‌పై పడింది. ఫలితంగా పెట్టుబడుదారులు ఆ మార్కెట్ వైపు చూడడం మానేశారు. దీనికితోడు దేశీయంగా జరుగుతున్న పరిణామాలతో బంగారం-వెండి ధరలకు క్రమంగా పతనమవుతున్నాయి. బుధవారం మార్కెట్లో ధరలను చూద్దాం.

పడిపోతున్న బంగారం-వెండి ధరలు

బులియన్ మార్కెట్‌పై అన్ని వైపుల నుండి తీవ్రమైన ఒత్తిడి నెలకుంది. ప్రపంచ పవ్యాప్తంగా బంగారం-వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతుండం, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల కోసం మదుపరులు ఎదురుచూపు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సౌదీపై హౌతీల దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో క్రూడాయిల్ ధరలపై ఫోకస్ చేశారు పెట్టుబడిదారులు. ఫలితంగా బంగారం ధర పతనమవుతోంది. ఈ వార్త రాసే సమయానికి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్- MCXలో బంగారం ఫ్యూచర్స్ 0.30 శాతం తగ్గి 10 గ్రాములకు రూ. 1,48,001 వద్ద కొనసాగుతోంది.

దేశీయ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి

Advertisement

వెండి ఫ్యూచర్స్ 0.36 శాతం తగ్గి కిలోకు సుమారు రూ.2,18,425 వద్ద లావాదేవీలు జరుగుతున్నాయి. క్యాప్స్‌ గోల్డ్‌ వెబ్‌సైట్‌ వివరాల మేరకు.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర బుధవారం నాటికి రూ.1,395 తగ్గింది. ప్రస్తుతం రూ.1,50,855 వద్ద కొనసాగుతోంది. వైజాగ్​, విజయవాడ, నెల్లూరు, ప్రొద్దుటూరు మార్కెట్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కత్తా, చెన్నై వంటి నగరాల్లో రూ. 200 అటు ఇటుగా ధరలు కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,36,850 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. వెండి ధరల విషయానికి వద్దాం. కిలోకు బుధవారం నాటికి రూ.3,705 తగ్గింది. ప్రసుత్తం రూ.2,22,180 వద్ద లావాదేవీలు జరుగుతున్నాయి.

Advertisement

ALSO READ: నెలకు రూ.1000 జీతం.. ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకు అధిపతి, అదెలా సాధ్యం?

మార్కెట్ వర్గాలు ఏమంటున్నాయి? ఇన్నాళ్లు బంగారం-వెండి ధరలు హెచ్చతగ్గులకు లోనవుతాయని చెబుతున్నాయి. లోహాల ధరలు ఒకరోజు పెరిగితే మూడు నాలుగు రోజులు డౌన్ కావడం చూస్తున్నామని అంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మళ్లీ వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో బంగారానికి దూరంగా మదుపరులు ఉన్నట్లు చెబుతున్నారు. కొద్దిరోజులు వీటి ధరలు తగ్గినా, క్రమంగా పెరగడం ఖాయమని చెబుతున్నాయి.

Related News

ఐటీ షేర్లు లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు!

నెలకు రూ.1000 జీతం.. ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకు అధిపతి, అదెలా సాధ్యం?

గాజువాకలో CMR జువెలరీ గ్రాండ్ ఓపెనింగ్.. ముఖ్య అతిథిగా భాగ్యశ్రీ బోర్సే!

అమ్మమ్మ చేతి రుచికి రూ.2 వేల పెట్టుబడి.. నేడు రూ.580 కోట్ల సామ్రాజ్యం.. ‘స్వీట్‌ కారం కాఫీ’ సక్సెస్‌ స్టోరీ!

రూ. 3 లక్షలతో బిజినెస్ స్టార్ట్.. నేడు రూ. 1.5 కోట్ల టర్నోవర్.. ఇద్దరు స్నేహితుల అద్భుత సక్సెస్ స్టోరీ!

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వాయిదా.. అక్టోబర్ 15 నుంచి కాదు, దీపావళి తర్వాతే

ట్రాఫిక్ జామ్‌లో రూ.20 ఐడియా.. నేడు నెలకు రూ.2 లక్షల సంపాదన.. ఇది కదా సక్సెస్ అంటే!

Big Stories

Advertisement
×