Hasan Nawaz Breaks stadium glass : ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ తొలి సెమీ ఫైనల్స్ లో భాగంగా బంగ్లాదేశ్ పై విజయం సాధించిన పాకిస్తాన్, నేరుగా ఫైనల్స్ కు దూసుకెళ్లింది. అయితే, ఇవాళ ఉదయం జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్ హసన్ నవాజ్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. ఈ తరుణంలోనే అతడు బాదిన ఓ సిక్సర్ దెబ్బకు డ్రెస్సింగ్ రూం (Hasan Nawaz Breaks stadium glass) అద్దాలు పగిలినట్టు వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ సంఘటనకు చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. పాకిస్తాన్ ప్లేయర్ హసన్ నవాజ్ బీఫ్ తిని వచ్చాడని, అందుకే భయంకరమైన సిక్సర్లతో బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ని రోజులు నవాజ్ ను ఎక్కడ దాచేశారంటూ పేర్కొంటున్నారు. కాగా ఈ మ్యాచ్ లో 22 బంతుల్లోనే 27 పరుగులు చేసి నవాజ్, మ్యాచ్ గెలిపించాడు. ఇందులో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.
ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ లో భాగంగా తొలి సెమీస్ లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్, 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను 13 ఓవర్లకు ఫిక్స్ చేశారు. ఈ తరుణంలోనే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్, 13 ఓవర్లు ఆడి 7 వికెట్ల నష్టానికి 111 పరుగులు సాధించింది. బంగ్లాదేశ్ జట్టులో హ్రిడోయ్ ఒక్కడే 42 పరుగులతో రాణించాడు. ఇక బంగ్లాదేశ్ విధించిన టార్గెట్ ను 11.3 ఓవర్లలోనే పాకిస్తాన్ జట్టు ఛేదించి, ఫైనల్స్ కు దూసుకెళ్లింది. పాకిస్తాన్ జట్టులో హసన్ నవాజ్ 27 పరుగులు, అబ్దుల్ సమద్ 30 పరుగులతో చివరి వరకు నిలబడి మ్యాచ్ గెలిపించారు. దీంతో విజయం సాధించిన పాక్… ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో అడుగుపెట్టింది.
ఏషియన్ గేమ్స్ 2026 ఫైనల్స్ అక్టోబర్ 3వ తేదీన జరుగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ ఇప్పుటికే ఫైనల్స్ కు చేరుకుంది. ప్రస్తుతం టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య రెండో సెమీస్ జరుగుతోంది. ఇందులో గెలిచిన జట్టు, పాకిస్తాన్ తో అక్టోబర్ 3వ తేదీన ఫైనల్స్ ఆడనుంది. మరి పాకిస్తాన్ తో ఎవరు తలపడేది మరి కొన్ని నిమిషాల్లోనే తేలనుంది. అందరి అంచనా ప్రకారం, టీమిండియానే ఫైనల్స్ కు చేరుతుందని అంచనా వేస్తున్నారు. పాక్ ప్లేయర్లు కూడా ఇదే కోరుతున్నారు. టీమిండియా ఫైనల్స్ కు వస్తే, ఓడిస్తామని ఇప్పటికే శపథం చేశారు.
Some shots that by Hasan Nawaz!!!
Back to Back sixes 🔥 pic.twitter.com/5hQjVs4bwD
— Usman (@Usman_56Offical) October 1, 2026