Cheque bounce: బిజినెస్ డీల్స్ అన్నాక చెక్కులు ఇవ్వడం,తీసుకోవడం సర్వసాధారణం. కానీ.. అకౌంట్లో డబ్బులు సరిగ్గా లేక చెక్ కాస్తా ‘బౌన్స్’ అయితే.. మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 ప్రకారం చెక్ బౌన్స్ అవ్వడం అంటే మామూలు తప్పు కాదు, అది క్రిమినల్ నేరం! ఇందుకు జైలు శిక్ష లేదా భారీ జరిమానా పడే ఛాన్స్ ఉంటుంది. అయితే చాలా మందికి వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే.. పదే పదే చెక్కులు బౌన్స్ అయితే బ్యాంకు అధికారులు మన అకౌంట్‌ను డైరెక్ట్‌గా ఫ్రీజ్ లేదా బ్లాక్ చేసేస్తారా? దీనిపై ఆర్బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది అనుకున్నట్లుగా.. కేవలం చెక్ బౌన్స్ అయినంత మాత్రాన బ్యాంక్ వాళ్ళు మీ సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్‌ను ఆటోమేటిక్‌గా ఫ్రీజ్ చేయడానికి కుదరదు. చెక్ బౌన్స్ అనేది కేవలం చెక్ ఇష్యూ చేసిన వ్యక్తికి, తీసుకున్న వ్యక్తికి మధ్య జరిగే లీగల్ లేదా సివిల్ సమస్య కిందకి వస్తుంది. అవతలి వ్యక్తి కోర్టు ద్వారా లీగల్ నోటీసు పంపి కేస్ వేయొచ్చు. అంతే తప్ప బ్యాంక్ వాళ్ళే స్వయంగా మీ అకౌంట్‌ను క్లోజ్ చేయరు. బ్యాంక్ చేసేదల్లా చెక్ రిటర్న్ మెమో ఇవ్వడమే!
అకౌంట్లో బ్యాలెన్స్ లేకుండా.. పదే పదే చెక్కులు బౌన్స్ అవుతుంటే .. బ్యాంకులు ఊరుకోవు! ఆ చెక్ ఇచ్చి వారి మీద ‘చెక్ రిటర్న్ చార్జీలు’ తీసుకుంటారు. అంతేకాదు.. మీ సిబిల్ స్కోర్ పాతాళానికి పడి పోతుంది. భవిష్యత్తులో మీకు లోన్ ఇవ్వడానికి ఏ బ్యాంక్ ముందుకు రాదు. కొత్తగా కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేయాలన్నా.. మొహం చాటేస్తారు. పదే పదే ఇలా జరుగుతుంటే.. మీతో బిజినెస్ రిలేషన్షిప్ కట్ చేసుకొని, మీ అకౌంట్‌ను క్లోజ్ చేసుకోమని బ్యాంక్ వాళ్లే అఫీషియల్‌గా ఆర్డర్ వేయొచ్చు.
Also Read: సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!
చెక్కులు బౌన్స్ అయినంత మాత్రాన అకౌంట్ ఫ్రీజ్ కాకపోయినా.. ఈ కింద చెప్పిన పనులు జరిగితే మాత్రం బ్యాంకులు మీ అకౌంట్‌ను ఇన్‌స్టంట్‌గా లాక్ చేసేస్తాయి.
కోర్టు లేదా పోలీస్ ఆర్డర్స్: చెక్ బౌన్స్ కేసులో కోర్టు నుంచి కఠినమైన ఆర్డర్స్ వస్తే.. లేదా సైబర్ క్రైమ్, మనీ లాండరింగ్ కేసులు ఉంటే అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది.
కేవైసీ లేకపోవడం: ఆర్బీఐ రూల్స్ ప్రకారం.. ఎప్పటికప్పుడు కేవైసీ అప్డేట్ చేయకపోతే.. బ్యాంకులు అకౌంట్‌ను కొన్ని రోజుల పాటు లేదా పూర్తిగా నిలిపేస్తాయి.
డౌట్ఫుల్ ట్రాన్సాక్షన్స్: అకౌంట్లో అసాధారణమైన ట్రాన్సాక్షన్స్ జరిగితే.. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద బ్యాంకులు అకౌంట్ బ్లాక్ చేస్తాయి.
అందుకే మీ చెక్కులు ఎట్టి పరిస్థితుల్లోనూ బౌన్స్ కాకుండా చూసుకోండి. అకౌంట్లో డబ్బు ఉంటేనే చెక్కులు ఇవ్వండి. లేదంటే లీగల్ ఇష్యూస్ చుట్టుకుని జీవితం రివర్స్ అవుతుంది.