Rithu Chowdary:సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే ఇట్టే క్షణాల్లో వైరల్ అవుతోంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ కదలికలను కూడా నెటిజన్లు ఎక్కువగా గమనిస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ ఒక రియాలిటీ షో.. ఇందులో కనిపించేదంతా నిజం కాదని తెలిసినా.. ఒకవేళ షో టిఆర్పి రేటింగ్ కోసం వారి మధ్య లేనిపోని లవ్ ట్రాక్ లు సృష్టించినా.. ఆడియన్స్ కి మాత్రం అది నిజంగానే పోట్రేట్ అవుతోంది. అందుకే బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్ నడిపిన జంటలు ఒకవేళ బయట కనిపిస్తే నిజంగానే ప్రేమలో పడ్డారని, పెళ్లి కూడా చేసుకుంటారని ఎన్నో ఊహాగానాలు సృష్టిస్తూ ఉంటారు. అయితే ఆ జంట మధ్య అనూహ్యంగా బ్రేకప్ వస్తే మాత్రం.. ఇక విడిపోయారు అనే కామెంట్స్ కూడా వ్యక్తం అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో లవ్ ట్రాక్ నడిపి అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన రీతూ చౌదరి(Rithu Chowdary), డెమోన్ పవన్(Demon Pawan) బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటారనే ఊహాగానాలు వ్యక్తం అయ్యాయి. పైగా వీళ్ళిద్దరూ కలిసి ‘బంగారం’ అనే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ కూడా చేశారు. దీంతో ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే ఇలాంటి సమయంలో డెమోన్ పవన్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఒక రేంజ్ లో వైరల్ అయింది. ఇక దీంతో రంగంలోకి దిగింది రీతూ చౌదరి. దీనిపై రీతూ చౌదరి స్పందిస్తూ..” మా ఫ్రెండ్ షిప్ లో వంద గొడవలు ఉంటాయి. దానికి బ్రేకప్ ఏంటో.. మేము ఏమైనా లవర్స్ ఆ? లేకపోతే మాకు పెళ్లి అని చెప్పామా? అయినా ఇదెక్కడ గోలరా నాయనా? అసలు సోషల్ మీడియాలో పని పాట లేకుండా వీడియోస్ పెట్టుకోవడం ఏంటో? మీరంతా ఇంత ఖాళీగా ఉన్నారేంట్రా ? కొంతమంది అయితే వ్లాగ్స్ కూడా చేస్తున్నారు. ఒరేయ్ మీ ఫ్రెండ్స్ తో మీకు గొడవలు అవ్వవా? ఎందుకురా ఇదంతా.. వాడేదో పెట్టాడు.. మీరు ఇంత ఖాళీగా ఉన్నారని నేను అనుకోవట్లేదు.. అయితే ఏది ఏమైనా నాకు మాత్రం ఒక్క రోజులోనే 25 వేల మంది ఫాలోవర్లు వచ్చారు. ధన్యవాదాలు” అంటూ పోస్ట్ పెట్టింది. ఒక్క పోస్టు వీరిపై నెగెటివిటీని పెంచడం అటు ఉంచితే.. రీతూ చౌదరికి మాత్రం భారీగా ఫాలోవర్స్ పెరగడం గమనార్హం.

అంతటితో ఆగకుండా..” మేటర్ తెలియకుండా అసలు ఫ్రెండ్షిప్ లో గొడవకి కూడా సోషల్ మీడియాలో ఇంత హైలెట్ చేసి వీడియోస్ చేస్తున్న నిబ్బ గాళ్ళ కంటే.. త్రిగుణ్ అన్నా చాలా బెటర్ . ఆయనకు ఓటు వేయండి. నిజానికి ముందుంటారు లైక్స్ , వ్యూస్ కోసం.. వీడియోస్ చేయటానికి.. చీప్ .. ముందు మనం జడ్జిమెంట్ పాస్ చేయాలి. హైలెట్ అవ్వాలి. మీ ఇంట్లో వాళ్ల మీద పెట్టుకోండి వీడియోస్ ,మీమ్స్” అంటూ ఒక రేంజ్ లో తన అధికారిక ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పంచుకుంది.
also read:ఈ వారం డబుల్ ఎలిమినేషన్?ఆ ఇద్దరే టార్గెట్!
డెమోన్ పవన్ తన పోస్ట్ షేర్ చేస్తూ..” అందరూ తప్పుగా అనుకుంటున్నారు. మేమేమీ లవర్స్ కాదు.. అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. రూమర్లు స్ప్రెడ్ చేస్తున్నారు . అసలు మా మధ్య గొడవలు కూడా చాలానే అవుతున్నాయి. ఆ గొడవలు ,ఆ టార్చర్ ని నేను కూడా భరించలేకపోతున్నాను. రీతూ కూడా అన్నింట్లో నన్ను బ్లాక్ చేసింది. నేను కూడా బ్లాక్ చేస్తా.. మా స్నేహబంధం ఇక్కడితో ముగిసింది.. బ్రేకప్ అయిపోయింది. ఇకపై రివన్ ఉండదు. ఎవరి దారి వారిదే” అన్నట్టుగా డెమోన్ పవన్ ఒక పోస్ట్ పెట్టాడు. దీంతో ఒక్కసారిగా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.