Bank strike September 2026: దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడంతో, రాబోయే రోజుల్లో ఏకంగా ఐదు రోజుల పాటు బ్యాంక్ బ్రాంచ్‌లన్నీ మూతపడే పరిస్థితి ఏర్పడింది. అసలే నెల చివరి వారం కావడంతో ఈ వరుస సెలవులు సామాన్య ప్రజలకు, వ్యాపారులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఎవరూ ఆందోళన చెందకుండా ఉండేందుకు ఆర్బీఐ (RBI), పలు ప్రముఖ బ్యాంకులు ముందస్తుగా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశాయి. అసలు ఈ బంద్ గోల ఏంటి? ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
యూనియన్ల నిర్ణయం ప్రకారం.. ఈ నెల 26వ తేదీ శనివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు వచ్చింది. ఆ తర్వాత 27వ తేదీ ఆదివారం కూడా రెగ్యులర్ హాలిడే. ఇక దీనికి కొనసాగింపుగా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె కారణంగా సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో కూడా బ్యాంక్ ఉద్యోగులు విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీని వల్ల వరుసగా బ్యాంకులు పనిచేయని పరిస్థితి ఏర్పడింది.
వరుసగా సెలవులు రావడం వల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కీలక ఆదేశం జారీ చేసింది. ఈ నెల 27 (ఆదివారం) రోజున బ్యాంకులు తెరిచి ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రధానంగా ప్రభుత్వ లావాదేవీలను ఈ రోజున బ్యాంకుల్లో నిర్వహిస్తారు. అయినప్పటికీ.. సాధారణ వినియోగదారులు బ్రాంచ్‌కు వస్తే వారికి కూడా తగిన సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర :
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి ప్రముఖ బ్యాంకులు తమ కస్టమర్ల కోసం ప్రత్యేక అడ్వైజరీని విడుదల చేశాయి. కస్టమర్లు తమ బ్రాంచ్-సంబంధిత పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించాయి. అంతే కాకుండా బ్రాంచ్‌లకు వెళ్లలేని పరిస్థితి ఉన్నప్పుడు కస్టమర్లు డిజిటల్ , ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ ఛానెల్స్‌ను ఉపయోగించుకోవాలని కోరాయి.
Also Read: క్రెడిట్ కార్డ్ హోల్డర్ చనిపోతే ఆ అప్పు ఎవరు కట్టాలి? బ్యాంకులకు ఉండే రూల్స్ ఇవే?
మొబైల్ బ్యాంకింగ్ : మీ స్మార్ట్‌ఫోన్ ద్వారానే నిధుల బదిలీ, బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ బ్యాంకింగ్: ట్రాన్సాక్షన్స్ , బిల్లుల చెల్లింపుల కోసం దీన్ని వాడొచ్చు.
ఏటీఎంలు : మనీ విత్ డ్రా కోసం ఏటీఎంలకు వెళ్లొచ్చు.
యూపీఐ & ఇతర డిజిటల్ ఛానెల్స్ (UPI): గూగుల్ పే, ఫోన్‌పే వంటి యూపీఐ యాప్‌ల ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజువారీ పేమెంట్స్ చేసుకోవచ్చు.
వాట్సాప్ బ్యాంకింగ్: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాంటి బ్యాంకులు వాట్సాప్ సేవలను కూడా అందిస్తున్నాయి. ఉదాహరణకు, ‘Hi’ అని టైప్ చేసి 70660 36640 నంబర్‌కు పంపడం ద్వారా మీ ఖాతా వివరాలను ఈజీగా తెలుసుకోవచ్చు.
Also Read: కారణం లేకుండా కంపెనీ మిమ్మల్ని తీసేయొచ్చా? లేబర్ లా ప్రకారం ఉద్యోగులకు ఉండే పవర్ ఫుల్ రైట్స్!