E-Paper
Advertisement

అడవిలో అరుదైన వింత కోసం వెళ్లిన ఫోటోగ్రాఫర్… కట్ చేస్తే మిస్టీరియస్ ఫాంటసీ థ్రిల్లర్

అడవిలో అరుదైన వింత కోసం వెళ్లిన ఫోటోగ్రాఫర్… కట్ చేస్తే  మిస్టీరియస్ ఫాంటసీ థ్రిల్లర్
Advertisement

Fantasy Mystery Thriller: అడవిలో కనిపించే ఓ అరుదైన వింతను కెమెరాలో బంధిస్తే జీవితమే మారిపోతుందని ఓ ఫోటోగ్రాఫర్‌కు తెలుస్తుంది. దాని కోసం ఎవరూ వెళ్లని దట్టమైన అడవిలోకి ఒంటరిగా వెళ్తాడు. కానీ తాను వెతుకుతున్నది కేవలం ఓ అరుదైన దృశ్యం కాదని… ఆ అడవి తనలో దాచుకున్న ఓ మిస్టరీ అని తెలిసే సరికి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఫోటో కోసం మొదలైన ప్రయాణం చివరికి ఓ మిస్టీరియస్ ఫాంటసీ థ్రిల్లర్‌గా ఎలా మారిందో చూపించే సినిమా ‘ఫోటోగ్రాఫర్’ (Photographer). ఆష్రఫ్ అలీ, కలట్‌పడై జై , కరుణాకరన్, జనని సామంతనం తదితరులు నటించిన ‘ఫోటోగ్రాఫర్’కు ఆష్రఫ్ ఏ. దర్శకత్వం వహించారు. ఇది తమిళ ఫాంటసీ, మిస్టరీ, థ్రిల్లర్ మూవీ.

కథలోకి వెళ్తే…

వీరా (Veera) ఓ ఫోటోగ్రాఫర్. తన ప్రతిభకు సరైన గుర్తింపు రావడం లేదనే అసంతృప్తి అతనిలో ఉంటుంది. తన ఫొటోగ్రఫీ కెరీర్‌లో పెద్ద బ్రేక్ కోసం ఎదురుచూస్తుంటాడు. అలాంటి సమయంలో మ్యాథికెట్టన్ సోలై అనే రహస్యమైన ఫారెస్ట్ రిజర్వ్ గురించి అతనికి సమాచారం అందుతుంది. ఆ అడవిలో చాలా అరుదుగా కనిపించే ఓ సహజ దృశ్యం ఉందని వీరాకు తెలుస్తుంది. దాన్ని కెమెరాలో బంధించగలిగితే తన కెరీర్ పూర్తిగా మారిపోతుందని భావిస్తాడు. అందుకే ప్రమాదం ఉందని తెలిసినా అడవిలోకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు.

Advertisement

అడవిలోకి వెళ్లిన తర్వాత వీరాకు మొదట ప్రకృతి అందాలే కనిపిస్తాయి. కానీ కొద్దికొద్దిగా అక్కడి వాతావరణం అతనిలో అసౌకర్యాన్ని పెంచుతుంది. తాను వెతుకుతున్న ఆ అరుదైన దృశ్యం కోసం మరింత లోతుగా అడవిలోకి వెళ్తున్న కొద్దీ… అక్కడి పరిసరాల్లో ఏదో అసాధారణమైన విషయం ఉందని అతనికి అనిపిస్తుంది. వీరా గతం కూడా అతని ప్రయాణాన్ని వెంటాడుతూనే ఉంటుంది. తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదల కారణంగా అతను ప్రమాదాన్ని కూడా పట్టించుకోడు. కెమెరాలో బంధించాలనుకున్న ఆ అరుదైన దృశ్యం దగ్గరపడుతున్న కొద్దీ అతని ఆలోచనలు, భయాలు కూడా పెరుగుతాయి.

అసలు వీరా వెతుకుతున్నది ఏంటి? ఆ అడవిలో కనిపించే అరుదైన దృశ్యం వెనుక ఏదైనా రహస్యం ఉందా? అతను దాన్ని కెమెరాలో బంధించగలిగాడా? ఆ అన్వేషణ అతని జీవితాన్ని ఎలా మార్చింది? అనే ప్రశ్నల చుట్టూ కథ సాగుతుంది.

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు?

Advertisement

‘ఫోటోగ్రాఫర్’ (Photographer) తమిళ ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌ను ముగించుకుని డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ వేదిక Amazon Prime Video లో ప్రస్తుతం స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ప్రేక్షకులు ఓటీటీలో వీక్షించవచ్చు.

Read Also: నోట్‌బుక్ నుంచి మనుషులు బయటకొస్తే… పుస్తకం చేతులు మారడంతో మొదలయ్యే గందరగోళం…

Related News

అమ్మలా కనిపించే వింత ఆకారం… ఏడేళ్ల చిన్నారిని వెంటాడుతూ కుటుంబంలోకి… వెన్నులో వణుకు పుట్టించే హారర్

ప్రపంచంతో సంబంధం లేని ద్వీపం… ఖాళీ చేయించడానికి వచ్చిన వ్యక్తికి పట్టపగలే చుక్కలు… ఫుల్ ఫన్

ఇదెక్కడి సినిమారా నాయనా… బెస్ట్ ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌తోనే ప్రేమలో పడితే… ట్రయాంగిల్ రొమాంటిక్ కామెడీ

బాంబుల వర్షం కురుస్తున్న గాజాలోకి ముగ్గురు డాక్టర్లు… ప్రాణాలు కాపాడేందుకు చేసిన సాహసం చూస్తే షాక్ అవ్వాల్సిందే

క్రిస్మస్‌కి ముందే చర్చి మూతపడే పరిస్థితి… ఫాదర్ కి పరీక్ష… క్లైమాక్స్ అదుర్స్

ప్రపంచ ప్రఖ్యాత సెలబ్రిటీలను కెమెరాలో బంధించిన ఫోటోగ్రాఫర్‌… ఫ్యాషన్ ప్రపంచాన్నే మార్చేసిన రిచర్డ్ అవెడన్ రియల్ స్టోరీ

మూతబడిన వాటర్ పార్క్ లో స్టూడెంట్స్ ట్రిప్… దెయ్యం ఎంట్రీతో దిమాక్ కరాబ్… నవ్విస్తూనే భయపెట్టే హారర్ కామెడీ

జరగబోయే ప్రమాదాలు ముందే కనిపిస్తే… ఓటీటీలో దుమ్మురేపుతున్న సిరీస్… ఈ హారర్ చూస్తే మైండ్ బ్లాక్

Big Stories

Advertisement
×