E-Paper
Advertisement

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసుల కలకలం

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసుల కలకలం
Advertisement

Arekapudi Gandhi: సాహితీ ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈనెల 27న విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులో సూచించారు.

ఈడీ నోటీసులు..

సాహితీ ఇన్‌ ఫ్రాటెక్ వెంచర్స్ సంస్థ నుంచి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బ్యాంక్ ఖాతాలకు దాదాపు 2.1 కోట్ల నిధులు బదిలీ అయినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ లావాదేవీల వెనుక ఉన్న కారణాలపై ఆరా తీసేందుకు ఈడీ ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఫ్లాట్లు, విల్లాలు నిర్మించి ఇస్తామంటూ ‘ప్రీ-లాంచ్’ ఆఫర్ల పేరుతో కొనుగోలుదారుల నుండి భారీగా వసూలు చేసిన నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలపై తెలంగాణ పోలీసులు సాహితీ ఇన్ ఫ్రా సంస్థపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఎఫ్ఐఆర్ ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు చేపట్టింది.

సాహితీ ఇన్ ఫ్రా..

Advertisement

ప్రాథమికంగా ప్రీ లాంచ్ పేర జనం నుంచి సాహితీ ఇన్ ఫ్రా 248 కోట్లు కొల్లగొట్టినట్టు భావించారు. అయితే, దర్యాప్తులో వెల్లడైన ఆధారాల నేపథ్యంలో 842 కోట్ల మేర మోసం జరిగినట్టుగా అంచనా. ఈ కేసులో సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ బూదాటి లక్ష్మీనారాయణను గతంలోనే అరెస్ట్ చేశారు. దాంతోపాటు 56 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. రెండు విడతల్లో 173.6 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

Also read: ఎండ తగిలితే చాలు ఛార్జ్ అయిపోతుంది! ఏకంగా 51 రోజుల బ్యాటరీతో Amazfit T Rex Dual Solar లాంచ్!

Tags

Related News

సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై ఎంపీ చామల కుమార్ రెడ్డి ఫైర్..!

చలానాల రాబడిపై సర్కార్ కొత్త ప్లాన్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!

ఏపీలో భారీ వర్షాలకు అన్నదాత కుదేలు.. ఈ ప్రాంతాల్లో విపరీతంగా పంటనష్టం?

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపతి.. తరలివచ్చిన భక్తజనం.. వైభవంగా నిమజ్జనం!

ఎంపీహెచ్‌ఏ ఫీమెల్ రిక్రూట్‌మెంట్‌లో ఊహించని ట్విస్ట్.. వారికి ఉద్యోగాలు వచ్చేనా..?

బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర.. ఎవరికి, ఎంతకి దక్కిందంటే?

అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర.. తరలివచ్చిన భక్త జనం!

Big Stories

Advertisement
×