E-Paper
Advertisement

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?
Advertisement

BC Overseas Scholarship: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద 2026 ఆగస్టు/సెప్టెంబర్ ఫాల్ సెషన్‌లో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థుల దరఖాస్తు గడువును అక్టోబర్ 15, 2026 నుంచి అక్టోబర్ 31, 2026 వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బి. బాలామాయాదేవి తెలిపారు. దీంతో విదేశాల్లో మాస్టర్స్, డాక్టోరల్ కోర్సులు అభ్యసిస్తున్న లేదా అభ్యసించాలనుకునే అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

అర్హత ప్రమాణాలు..

1. విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం అన్ని వనరుల నుంచి కలిపి రూ.5 లక్షల లోపు ఉండాలి.
2. దరఖాస్తు చేసుకునే తేదీ నాటికి విద్యార్థి వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు.
3. గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
4. GREలో 260 లేదా GMATలో 550 స్కోర్ కలిగి ఉండాలి.
5. TOEFLలో 60 లేదా IELTSలో 6.0 లేదా PTEలో 50 స్కోర్ కలిగి ఉండాలి.

దరఖాస్తు చేసుకునే విధానం

Advertisement

అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి, ఇతర వివరాలు తెలుసుకోవడానికి అధికారిక తెలంగాణ ఈ-పాస్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు. దీనికోసం https://telanganaepass.cgg.gov.in/OverseasLinks.do వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు దరఖాస్తు చివరి తేది 31 అక్టోబర్ 2026 వరకు అవకాశం ఇచ్చారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు ఈ పొడిగించిన గడువును వినియోగించుకోవాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులు కోరారు.

Also read: 33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

Tags

Related News

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×