E-Paper
Advertisement

Nissan X-Trail: మార్కెట్‌లోకి సూపర్ కార్.. నిస్సాన్ నుంచి కొత్త ఎస్‌యూవీ.. ధర ఎంతంటే?

Nissan X-Trail: మార్కెట్‌లోకి సూపర్ కార్.. నిస్సాన్ నుంచి కొత్త ఎస్‌యూవీ.. ధర ఎంతంటే?

Nissan X-Trail: కార్ల తయారీ సంస్థ నిస్సాన్ మోటర్స్ తన పెద్ద సైజు SUV కారును ఆవిష్కరించింది. ఈ కారుని 2021లో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేశారు. దేశంలో ఈ కారు 5, 7 సీట్ల ఆప్షన్స్‌లో రావచ్చు. నివేదికల ప్రకారం ఈ కారు 1.5 లీటర్ ఇంజన్ పవర్‌ట్రెయిన్‌లో వస్తుంది. ఈ కారు పెద్ద సన్‌రూఫ్‌, 20 అంగుళాల అల్లాయ్ వీల్స్‌, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నిస్సాన్ కారు వెడల్పు 1840mm,ఎత్తు 1725mm. ఈ కారు 2705mm పొడవాటి వీల్‌బేస్‌ను కలిగి ఉంది. ఇది విలాసవంతమైన లుక్ ఇస్తుంది. కారు ముందు బంపర్ నుండి వెనుకకు ఉన్న దూరాన్ని వీల్‌బేస్ అంటారు. ఈ కారుకు 210ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. కారు దిగువ ప్లాట్‌ఫారమ్, గ్రౌండ్ మధ్య దూరాన్ని గ్రౌండ్ క్లియరెన్స్ అంటారు. అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా చదును చేయని రోడ్లపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారు నేలను తాకదు. ఈ పెద్ద సైజు కారు 20 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది.

Also Read: Kia Seltos SUV: సెల్టోస్‌కు ఫుల్ క్రేజ్.. అప్‌డేటెడ్ ఫీచర్లు.. సేఫ్టీలో తగ్గేదే లే!

నిస్సాన్ ఎక్స్-ట్రైల్ షాంపైన్ సిల్వర్, సాలిడ్ వైట్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ప్రస్తుతానికి, ఈ కారు డెలివరీ తేదీ, ధరను కంపెనీ వెల్లడించలేదు. ఈ కారును రూ.40 నుంచి 45 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కారులో హైబ్రిడ్ ఇంజన్ ఉంటుంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ కారులో ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఉంటాయి.

నిస్సాన్ ఎక్స్-ట్రైల్ 360 డిగ్రీల కెమెరా, నిస్సాన్ 8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ SUV కారులో 8-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) అందుబాటులో ఉంటుంది. ఈ సిస్టమ్ సెన్సార్‌లపై పనిచేస్తుంది. రోడ్డు ప్రమాదాల సమయంలో ఆడియో, వీడియో హెచ్చరికలను జారీ చేస్తుంది.

Also Read: Bike Under 60000: రూ.60 వేలకే హీరో బైక్.. 65 కిమీ మైలేజ్.. 11 రంగుల్లో కొనుగోలు చేయవచ్చు!

ఈ నిస్సాన్‌ కారులో ఇంటీరియర్‌లో డ్యూయల్ కలర్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. ఈ కారులోని హై పవర్ ఇంజన్ 204 హెచ్‌పి పవర్, 305 ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ నిస్సాన్ కారుకు 550 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. నిస్సాన్ ఎక్స్-ట్రైల్ మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్, MG హెక్టర్‌తో పోటీపడతుంది.

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×