Adah Viral Train Reel: హీరోయిన్ ఆదా శర్మ మరోసారి తన సరదా ప్రయాణంతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు విమానాలు, ఖరీదైన కార్లలో ప్రయాణించడం చూస్తుంటాం. కానీ, ఆదా శర్మ మాత్రం సాధారణ ప్రయాణికురాలిలా రైలు ఎక్కి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రయాణంలో జరిగిన చిన్న చిన్న విషయాలను తనదైన స్టైల్‌లో చూపిస్తూ ఆమె చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రైలు ప్రయాణంలో కనిపించే సాధారణ దృశ్యాలను ఆదా శర్మ సరదాగా ఇమిటేట్ చేశారు. ముఖ్యంగా బోగీల్లో తిరుగుతూ చాయ్, సమోసా, పల్లీలు అమ్మే వ్యాపారులను ఆమె అనుకరిస్తూ నవ్వులు పూయించారు. ప్రయాణికులు తరచూ వినే “చాయ్.. చాయ్..” “సమోసా” అనే మాటను తనదైన కామెడీ టైమింగ్ తో చెప్పడం వీడియోలో నెటిజన్లు ఆకట్టుకుంటుంది. అదే సమయంలో రైళ్లో ఏమాత్రం సెన్స్ లేకుండా చెత్తా చెదారం వేసే వారినీ మొట్టికాయలు వేసేలా కామెంట్స్ చేసింది.
ఆదా శర్మ ప్రయాణం మొత్తం ఎంతో క్యాజువల్ గా కనిపించింది. రైలు బర్త్ పై కూర్చోవడం, చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించడం, మధ్య మధ్యలో కెమెరా ముందు అల్లరి చేయడం లాంటి సన్నివేశాలు వీడియోలో కనిపించాయి. తన చుట్టూ ఉన్న సాధారణ పరిస్థితులను కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌గా మార్చుకోవడం ఆదా శర్మ స్పెషల్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె గతంలోనూ క్రేజీ సోషల్ మీడియా పోస్టులతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. తాజా రైలు ప్రయాణం కూడా అదే తరహాలో అందరినీ అలరించింది.
రైలు ప్రయాణంలో ఆదా శర్మ అభిమానులతో ఫొటోలు కూడా దిగింది. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఎలాంటి హడావుడి లేకుండా సాధారణ ప్రయాణికురాలిలా కనిపించడం ఈ వీడియోలో మరో హైలైట్‌గా మారింది. ఆమె రైలు ప్రయాణానికి సంబంధించిన మొదటి వీడియోకు మంచి స్పందన రావడంతో, తర్వాత మరో భాగాన్ని కూడా అభిమానుల కోసం షేర్ చేసినట్లు వెల్లడించింది.
ఆదా శర్మ వీడియోలో పెద్దగా ప్రత్యేకమైన సెటప్ ఏమీ లేదు. రైలు, ప్రయాణికులు, చాయ్-సమోసా అమ్మకాలు, సాధారణ ప్రయాణ వాతావరణం మాత్రమే కనిపిస్తాయి. అయితే, వాటినే తన కామెడీతో ఆసక్తికరంగా మార్చడంతో నెటిజన్లు వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. సెలబ్రిటీ జీవితానికి భిన్నంగా ఒక సాధారణ రైలు ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ ఆదా శర్మ కనిపించడం అభిమానులకు కూడా నచ్చింది. దీంతో ఆమె చేసిన చిన్న చిన్న అల్లరి, రైల్లో చేసిన ఇమిటేషన్ సన్నివేశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారాయి. ఆమె సరదా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను నవ్విస్తోంది.
Read Also: కదిలే రైల్లో అదిరిపోయే కేఫే.. వేడి కాఫీ తాగుతూ వెళ్తుంటే ఆ కిక్కే వేరప్పా!