E-Paper
Advertisement

పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్.. ఒకేసారి రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తే.. నెలకు వచ్చే వడ్డీ ఎంత?

పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్.. ఒకేసారి రూ.9 లక్షలు డిపాజిట్ చేస్తే.. నెలకు వచ్చే వడ్డీ ఎంత?
Advertisement

Post Office Scheme: పోస్టాఫీసు అందిస్తున్న అద్భుతమైన పథకాల్లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) ఒకటి. డిపాజిట్ చేసిన డబ్బుపై ప్రతీ నెలా స్థిరంగా, సురక్షితంగా వడ్డీ పొందాలనుకునేవారికి ఈ స్కీమ్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ప్రస్తుతం ఈ పథకంపై ఏడాదికి 7.4 శాతం వడ్డీని అందిస్తున్నారు. అయితే ఈ స్కీమ్‌లో ఒకేసారి రూ. 9 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు ఎంత ఆదాయం వస్తుంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, వడ్డీ లెక్కలు ఏంటో ఈ కథనంలో చూద్దాం.

రూ. 9 లక్షల పెట్టుబడికి నెలకు ఎంత?

పోస్టాఫీసు మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ లో ఒకేసారి రూ. 9 లక్షలు పెట్టుబడి పెడితే దానిపై 7.4 శాతం వార్షిక వడ్డీ రానుంది. అంటే రూ.9 లక్షలకు 7.4 శాతం వడ్డీని లెక్కగడితే ఏడాదికి రూ.66,600 అవుతుంది. ఈ పథకంలో వడ్డీ ప్రతి నెలా ఇస్తారు కాబట్టి వార్షిక వడ్డీ రూ. 66,600 ను 12 నెలలకు విభజిస్తే నెలకు రూ. 5,550 చొప్పున ఆదాయం వస్తుంది. ఈ లెక్కన రూ. 9 లక్షలు డిపాజిట్ చేయడం ద్వారా ఏడాదికి రూ. 66,600 వడ్డీ చొప్పున పథకం ముగిసే ఐదేళ్ల కాలంలో మొత్తం రూ. 3.33 లక్షలు కేవలం వడ్డీ రూపంలోనే చేతికి అందుతుంది. కాలపరిమితి ముగిసిన తర్వాత మీరు డిపాజిట్ చేసిన అసలు రూ. 9 లక్షలు తిరిగి ఇచ్చేస్తారు.

గరిష్ట, కనిష్ట పెట్టుబడి పరిమితులు

Advertisement

పోస్టాఫీసు ఎంఐఎస్ పథకంలో ఒక వ్యక్తి పేరిట పొదుపు చేసేందుకు గరిష్ట పరిమితి రూ. 9 లక్షలు. అదే జాయింట్ అకౌంట్ అయితే గరిష్టంగా రూ. 15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. అటు ఈ పోస్టాఫీసు స్కీమ్ లో కనిష్టంగా రూ.1000తో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. నెలానెలా చేతికి డబ్బు రావాలనుకునే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పోస్టాఫీస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు, స్టాక్ మార్కెట్ రిస్క్ వద్దనుకునే పొదుపుదారులు ఈ స్కీమ్‌ను ఎంచుకోవచ్చని పేర్కొన్నాయి.

గడువుకు ముందే డబ్బులు విత్‌డ్రా చేస్తే?

ఈ పోస్టాఫీసు స్కీమ్ ఐదేళ్ల కాలానికి డబ్బును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు డబ్బును విత్ డ్రా చేసుకునే వెసులుబాటును సైతం కొన్ని షరతులతో ఈ స్కీమ్ లో కల్పించారు. అయితే డిపాజిట్ చేసిన ఒక సంవత్సరం తర్వాత మాత్రమే విత్ డ్రాకు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 1-3 ఏళ్ల మధ్య ఖాతాను క్లోజ్ చేస్తే.. డిపాజిట్ చేసిన అసలు మొత్తంలో 2 శాతం కోత విధించనున్నారు. 3 నుండి 5 ఏళ్ల మధ్య విత్ డ్రా చేస్తే అసలు మొత్తంలో 1 శాతం కట్ చేయనున్నారు.

Advertisement

Also Read: జడ్జి కొడుకు యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్.. కొచ్చి పోలీస్ కమిషనర్‌పై వేటు.. కారణం ఏంటంటే?

చక్రవడ్డీ లాభం ఉండదు… జాగ్రత్త!

అయితే ఈ పోస్టాఫీసు పథకంలో డిపాజిట్ చేసిన మనీకి ఎలాంటి చక్ర వడ్డీని యాడ్ చేయరు. ఈ స్కీమ్ ఉద్దేశం ప్రతినెలా ఆదాయాన్ని అందించడమే తప్ప పెట్టిన పెట్టుబడిని చక్రవడ్డీతో కలిపి భారీగా పెంచడం కాదు. ప్రతి నెలా వచ్చే రూ. 5,550 వడ్డీని తీసుకోవడం వల్ల దానిపై ఎలాంటి చక్రవడ్డీని విధించే అవకాశం ఉండదని పోస్టాఫీసు వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ నెలవారీ వడ్డీ సొమ్మును వేరే స్కీమ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా చక్రవడ్డీ లాభాన్ని పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: ఒక సెకనులో 20 వేల 4K సినిమాలు డౌన్‌లోడ్.. ఇంటర్నెట్ వేగంలో చైనా ప్రపంచ రికార్డు!

Tags

Related News

జియో లిస్టింగ్ అదుర్స్.. అనంత్ స్పీచ్ తో రిలయన్స్ అధినేత ముకేష్ కంటతడి

ఫ్లాట్ ఇవ్వడంలో ఆలస్యం.. బిల్డర్‌కు వినియోగదారుల కమిషన్ బిగ్ షాక్.. రూ.87 లక్షల ఫైన్!

ఆఫీస్, షాపు లేకుండానే ఇతర రాష్ట్రాల్లో వ్యాపారం చేసుకోవచ్చు.. ఈ GST నిబంధన గురించి తెలుసా?

పాలు, పండ్లు, కూరగాయలు ఏదైనా 5 స్టార్ హోటల్స్‌కు నేరుగా విక్రయించండి.. రైతులకు మంచి అవకాశం

హోమ్ లోన్ టెన్యూర్ ఎంత ఉండాలి? తక్కువ ఈఎంఐ బెటరా? త్వరగా తీర్చేయడం మంచిదా?

దీపావళి వేళ గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఆభరణాలు కొనకుండానే.. పసిడిపై లాభాలు పొందే 5 మార్గాలు!

ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్.. దీపావళి కానుకగా కార్లు అందజేత.. ఈ కంపెనీకి హాట్సాఫ్ చెప్పాల్సిందే!

Big Stories

Advertisement
×