E-Paper
Advertisement

రూ.3,300కే అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్.. 21 రోజుల బ్యాటరీ, 50+ వర్కౌట్ మోడ్స్!

రూ.3,300కే అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్.. 21 రోజుల బ్యాటరీ, 50+ వర్కౌట్ మోడ్స్!
Advertisement

Xiaomi Smart Band 11 Active: ఇప్పుడు మార్కెట్‌లో దొరికే శాంసంగ్, ఫిట్‌బిట్, యాపిల్ కంపెనీల స్మార్ట్‌వాచ్‌లు అద్భుతమైన ఫీచర్లతో వస్తున్నాయి. అయితే వీటి ధరలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. అందరూ అంత బడ్జెట్ పెట్టలేరు. అలాంటి వారి కోసం తక్కువ ధరలోనే దాదాపు అన్ని ఫీచర్లు ఉండేలా షియోమీ కంపెనీ ఒక కొత్త ఫిట్‌నెస్ బ్యాండ్‌ను తీసుకొచ్చింది. అదే ‘షియోమీ స్మార్ట్ బ్యాండ్ 11 యాక్టివ్’. రోజూ వర్కవుట్లు చేస్తూ, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకునే వారికి ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

రూ.3,300 లభించే బ్యాండ్:

సాధారణంగా మంచి స్మార్ట్‌వాచ్ కొనాలంటే రూ.20,000 పైనే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఉదా: శాంసంగ్ గెలాక్సీ వాచ్ 7 ధర దాదాపు రూ.20,800 వరకు ఉంటుంది. కానీ ఈ షియోమీ బ్యాండ్ కేవలం రూ.3,300 దొరుకుతుంది. శాంం‌సంగ్ కంపెనీకి చెందిన గెలాక్సీ ఫిట్ 3 బ్యాండ్ ధర రూ.3,900 వరకు ఉంటే.. దానికంటే తక్కువ ధరకే ఇది లభిస్తోంది. బడ్జెట్ పరిధిలో ఉంటూ అందరికీ అందుబాటులో ఉండటమే ఈ బ్యాండ్ యొక్క ప్రత్యేకత.

Advertisement

Also Read: ఒకే ధరకు రెండు దిగ్గజ ఫోన్లు.. కెమెరా, పనితీరులో ఏది బెటరంటే?

21 రోజుల బ్యాటరీ లైఫ్:

ఈ బ్యాండ్‌లో అత్యంత ఆకట్టుకునే అంశం దీని బ్యాటరీ లైఫ్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 21 రోజుల పాటు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. రోజువారీగా మనం వాడే విధానాన్ని బట్టి ఇందులో స్వల్ప మార్పులు ఉండవచ్చు. యాపిల్ వాచ్ కేవలం 24 గంటలు, ఫిట్‌బిట్ ఒక వారం రోజులు మాత్రమే బ్యాటరీ లైఫ్ ఇస్తాయి. వాటితో పోలిస్తే షియోమీ బ్యాటరీ లైఫ్ చాలా మెరుగ్గా ఉండి, పదే పదే ఛార్జింగ్ పెట్టే పని తప్పిస్తుంది.

వర్కవుట్స్, వాటర్ రెసిస్టెన్స్:

Advertisement

ఈ బ్యాండ్‌లో 50కి పైగా వర్కవుట్ మోడ్స్ ఉన్నాయి. మన గుండె వేగం, నిద్ర విధానం, ఒత్తిడి స్థాయిలను ఇది ఎప్పటికప్పుడు గమనిస్తుంది. ఇది వాటర్ రెసిస్టెంట్ కావడంతో ఈత కొట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు. అయితే స్టీమ్ బాత్ లాంటి ప్రదేశాల్లో వాడకపోవడమే మంచిది. అలాగే ఇందులో 1.47 అంగుళాల డిస్‌ప్లే, 100కి పైగా వాచ్ ఫేసెస్, మూడు రకాల కలర్ బ్యాండ్స్ అందుబాటులో ఉన్నాయి.

కొన్ని చిన్న చిన్న లోపాలు:

ఈ బ్యాండ్‌లో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. దీని స్ట్రాప్స్ నాణ్యత అంత ప్రీమియంగా అనిపించదు. అలాగే ఎండలో వెళ్లినప్పుడు డిస్‌ప్లే బ్రైట్‌నెస్ కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది. ఇందులో ఇన్‌బిల్ట్ జీపీఎస్ ఉండదు. జీపీఎస్ ఉంటే బ్యాటరీ త్వరగా అయిపోయే అవకాశం ఉంది. రూ.8,700 ఉండే షియోమీ స్మార్ట్ బ్యాండ్ 10 ప్రోలో జీపీఎస్ ఉంటుంది. బడ్జెట్‌లో ఆల్ రౌండ్ ఫీచర్లు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

Also Read: నెట్ లేకున్నా గూగుల్ మ్యాప్స్ వాడొచ్చు.. కానీ ఈ 3 ఫీచర్లు మాత్రం అస్సలు పనిచేయవు!

Tags

Related News

మీ ఫోన్‌కు వేరే వాళ్ల ఛార్జర్ వాడుతున్నారా? పొరపాటున కూడా ఇలా చేయొద్దు ఎందుకంటే?

ఆన్‌లైన్ షాపింగ్ చేసేవాళ్ళు..ఈ 5 విషయాలు అస్సలు మరవద్దు!

పాత గాడ్జెట్ బాక్సులు ఇంట్లో ఉన్నాయా? అయితే మీకు జాక్‌పాట్ తగిలినట్టే!

ఒకే ధరకు రెండు దిగ్గజ ఫోన్లు.. కెమెరా, పనితీరులో ఏది బెటరంటే?

మీ ఫేవరెట్ డ్రెస్సులు ఎప్పుడూ కొత్త వాటిలాగే మెరవాలంటే..వాటిపై ఉన్న సింబల్స్ మిస్టరీ తెలియాల్సిందే!

నెట్ లేకున్నా గూగుల్ మ్యాప్స్ వాడొచ్చు.. కానీ ఈ 3 ఫీచర్లు మాత్రం అస్సలు పనిచేయవు!

పవర్ కట్ అయినప్పుడు ఫ్రిజ్‌లో.. ఏ పదార్థాలు ఎన్ని గంటలు తాజాగా ఉంటాయో తెలుసా?

Big Stories

Advertisement
×