E-Paper
Advertisement

అమ్మమ్మ చేతి రుచికి రూ.2 వేల పెట్టుబడి.. నేడు రూ.580 కోట్ల సామ్రాజ్యం.. ‘స్వీట్‌ కారం కాఫీ’ సక్సెస్‌ స్టోరీ!

అమ్మమ్మ చేతి రుచికి రూ.2 వేల పెట్టుబడి.. నేడు రూ.580 కోట్ల సామ్రాజ్యం.. ‘స్వీట్‌ కారం కాఫీ’ సక్సెస్‌ స్టోరీ!
Advertisement

Startup Success Story: ప్రముఖ ఆహార బ్రాండ్స్ వెనుక కేవలం కొన్ని వంటకాల తయారీ విధానం మాత్రమే కాకుండా.. మధురమైన జ్ఞాపకం, మనసుకు హత్తుకునే అనుబంధం కూడా ఉంటుంది. దక్షిణాదికి చెందిన ఈ బ్రాండ్‌ కథ కూడా సరిగ్గా అలాంటి అరుదైన జ్ఞాపకాల నుంచే పురుడు పోసుకుంది. ‘స్వీట్‌ కారం కాఫీ’ బ్రాండ్ ఏర్పాటు వెనకున్న ఆసక్తికర విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.

ఒక దీపావళి నాటి ఆలోచన!

ఇదంతా 2015లో దీపావళి రోజున మొదలైంది. ఆహారాన్ని బాగా ఇష్టపడే ఆ కుటుంబానికి తమ అమ్మమ్మ చేసిన ఇంటి రుచి మురుకులు గుర్తుకొచ్చాయి. బయట ఎంత వెతికినా అలాంటి అసలైన రుచి, ఘుమఘుమలు ఉండే స్నాక్స్ ఎక్కడా దొరకలేదు. కేవలం ఫ్యాక్టరీల్లో తయారైన రుచిలేని పదార్థాలే కనిపించాయి. సరిగ్గా అక్కడే వారిలో ఒక ఆలోచన తట్టింది. దీంతో ఆనంద్‌ భరద్వాజ్‌, నళిని పార్థిబన్‌ దంపతులతో పాటు శ్రీవత్సన్‌ సుందరరామన్‌, వీర రాఘవన్‌ కలిసి ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తమ అమ్మమ్మ ‘జానకి పాటి’ చెప్పిన పాత కాలపు వంటకాలను మళ్లీ జీవం పోయాలని నిర్ణయించుకున్నారు.

రూ. 2,000 పెట్టుబడితో మొదలు!

Advertisement

‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ నివేదిక ప్రకారం.. ‘స్వీట్‌ కారం కాఫీ’ (SKC) బ్రాండ్‌ కేవలం రూ. 2,000 చిన్న పెట్టుబడితో ఒక చిన్న గదిలో ప్రారంభమైంది. తొలి కస్టమర్లను సంపాదించుకోవడానికి ఆ బృందం సభ్యులే స్వయంగా ఇంటింటికీ కరపత్రాలు పంచారు. తొలినాళ్లలో కుటుంబంలోని మహిళలే వంటలు చేయగా.. బంధుమిత్రులు సైతం తోడుగా నిలిచి డోర్‌ డెలివరీలు చేశారు.

నేడు మిలియన్‌ డాలర్‌ బ్రాండ్‌

ఈ ప్రయాణం గురించి నళిని పార్థిబన్‌ మాట్లాడుతూ.. ‘ప్రతి దీపావళికి మా అమ్మమ్మ జాంగ్రీలు, మురుకులు, మైసూర్ పాక్ వంటివి ఎంతో శ్రద్ధగా చేసేవారు. వంట చేస్తూనే మాకు చిన్నచిన్న పనులు చెప్పి, ఎన్నో కథలు చెప్పేది’ అని గుర్తుచేసుకున్నారు. ‘అమ్మమ్మతో కలిసి జాంగ్రీలు ఒత్తిన ఆ మధుర జ్ఞాపకమే మమ్మల్ని ఉద్యోగాలు మానేసి ఎస్కేసీ (SKC)ని ప్రారంభించేలా ప్రేరేపించింది. నేడు ఇది మిలియన్‌ డాలర్‌ బ్రాండ్‌గా ఎదిగింది’ అని ఆమె సంతోషంగా చెప్పారు.

మహిళలకు ఉపాధి.. కోట్లలో టర్నోవర్!

Advertisement

కొవిడ్‌ తర్వాత ప్రజల్లో ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన పెరగడంతో తమ ఉత్పత్తులకు డిమాండ్‌ రెట్టింపు అయిందని నళిని తెలిపారు. ఈ వ్యాపారం కేవలం వారి కుటుంబానికే కాకుండా, ఎంతోమంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపిందని పేర్కొన్నారు. ఎస్కేసీ ఉత్పత్తులకు డిమాండ్‌ భారీగా పెరగడంతో చాలామంది మహిళలు తమ సాధారణ ఉద్యోగాలు మానేసి తమ సిబ్బందితో పూర్తి స్థాయి క్లౌడ్‌ కిచెన్‌లను ఏర్పాటు చేసుకున్నారని తెలియజేశారు.

Also Read: రూ. 3 లక్షలతో బిజినెస్ స్టార్ట్.. నేడు రూ. 1.5 కోట్ల టర్నోవర్.. ఇద్దరు స్నేహితుల అద్భుత సక్సెస్ స్టోరీ!

ప్రస్తుత మార్కెట్ విలువ ఎంతంటే?

నేడు ‘స్వీట్‌ కారం కాఫీ’ బ్రాండ్‌ విలువ ఏకంగా రూ. 580 కోట్లకు చేరుకుంది. వారి అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది కస్టమర్లకు ఈ బ్రాండ్‌ సేవలు అందించింది. ఈ సంస్థ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న ఉత్పత్తుల్లో మైసూర్ పాక్, మురుకులు, మిక్చర్లు, అరటి చిప్స్ (బనానా చిప్స్), పొడులు, ఆంధ్రా ఆవకాయ పచ్చడి, దక్షిణాది సంప్రదాయ ఫిల్టర్‌ కాఫీ ఉన్నాయి.

Also Read: ట్రాఫిక్ జామ్‌లో రూ.20 ఐడియా.. నేడు నెలకు రూ.2 లక్షల సంపాదన.. ఇది కదా సక్సెస్ అంటే!

Tags

Related News

గాజువాకలో CMR జువెలరీ గ్రాండ్ ఓపెనింగ్.. ముఖ్య అతిథిగా భాగ్యశ్రీ బోర్సే!

రూ. 3 లక్షలతో బిజినెస్ స్టార్ట్.. నేడు రూ. 1.5 కోట్ల టర్నోవర్.. ఇద్దరు స్నేహితుల అద్భుత సక్సెస్ స్టోరీ!

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వాయిదా.. అక్టోబర్ 15 నుంచి కాదు, దీపావళి తర్వాతే

ట్రాఫిక్ జామ్‌లో రూ.20 ఐడియా.. నేడు నెలకు రూ.2 లక్షల సంపాదన.. ఇది కదా సక్సెస్ అంటే!

రూ.20,000 ఉంటే.. సొంతూళ్లలోనే దర్జాగా చేసుకునే వ్యాపారాలు.. ఇక సిటీ ఊసే అక్కర్లేదు!

రూ. 10 లక్షల పెట్టుబడి.. సింగిల్ ఎఫ్‌డీ vs మల్టిపుల్ ఎఫ్‌డీలు.. అధిక రాబడికి ఏది బెస్ట్?

బంగారం-వెండి ధరలు పతనం.. మార్కెట్లో రేటు ఎలా ఉంది? బులియన్ మార్కెట్ వర్గాల మాటేంటి?

Big Stories

Advertisement
×