UPEL private Limited: భారతదేశానికి చెందిన ప్రముఖ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ మరియు ఆటోమేషన్ సేవల సంస్థ యూపిఈఎల్ ప్రైవేట్ లిమిటెడ్ (UPEL PRIVATE LIMITED), ఆసియాలో అగ్రగామిగా నిలిచిన MTA Vietnam 2025 ఎక్స్‌పోలో భారతదేశాన్ని ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా యూపిఈఎల్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అజయ్ కుమార్ ఇనమడుగు, కో ఫౌండర్ నాగరాజు పత్తిపాటి, సీఈఓ నరేశ్ సిలివేరు, బిజినెస్ హెడ్ వినోద్ దొంతినేని హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఫౌండర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ..ప్రపంచవ్యాప్తంగా వ్యాపార భాగస్వామ్యాలను ఏర్పరచడం, ట్రేడ్ అవకాశాలను అన్వేషించడం, భారతీయ పరిశ్రమలకు అంతర్జాతీయ పరిజ్ఞానాన్ని అందించడం.ఇండియా నుంచి గ్లోబల్ మార్కెట్‌కి అడుగు యూపిఈఎల్ ఇప్పటికే 6,200కి పైగా ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలియజేశారు అదే విధంగా 2,400+ కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకున్నామని వెల్లడించారు.
ఇక ఈ కార్యక్రమంలో వీరి సంస్థల ప్రత్యేకతల గురించి కూడా తెలిపారు. VFDs, Servo Systems, HMIs, PLCs, Power Supplies, Industrial PCs, Control Systems తదితరాల రిపేర్ మరియు ఇంటిగ్రేషన్ సేవలు.వీటిని ప్రాముఖ్యంగా మాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మా, ఎనర్జీ, ఆటోమోటివ్, ప్యాకేజింగ్, వాటర్ ట్రీట్‌మెంట్ రంగాలకు అందిస్తుందని తెలియజేశారు. వియత్నాం, దక్షిణ కొరియా, తైవాన్ దేశాల నుంచి పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలియజేశారు.
ముఖ్య ఉద్దేశాలు..
ఇండియన్ మార్కెట్‌లో ఆధారపడదగిన ట్రేడ్ పార్టనర్‌గా మారడం. ప్రోడక్ట్ సప్లైతో పాటు ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ సేవలు అందించడం,భారత పరిశ్రమలకు అంతర్జాతీయ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురావడం. “ఇది యూపిఈఎల్ గ్లోబల్ విజన్‌కి పెద్ద అడుగు,” అని సంస్థ స్థాపకుడు అజయ్ కుమార్ ఇనమడుగు పేర్కొన్నారు. ఇక సీఈఓ నరేష్ కూడా మాట్లాడుతూ మేము కేవలం పరికరాలు మాత్రమే కాదని ఆ పరికరాల లైఫ్ సైకిల్ అలాగే టెక్నికల్ సపోర్ట్ కూడా అందిస్తామని తెలియజేశారు.
నమ్మకాన్ని నిర్మించడం..
బిజినెస్ హెడ్ వినోద్ దొంతినేని మాట్లాడుతూ… “మేము కేవలం బిజినెస్ చేయడం కాదు, బోర్డర్స్‌కి మించిన నమ్మకం నిర్మిస్తున్నామని తెలిపారు. భారత పరిశ్రమలకు అంతర్జాతీయ టెక్నాలజీ, ఎఫిషియన్సీ, విశ్వసనీయత అందించడమే మా లక్ష్యం అని తెలిపారు.భారతదేశమంతటా పరిశ్రమలకు సాంకేతిక నైపుణ్యం, కస్టమర్ ఫోకస్, మరియు డెడికేటెడ్ సపోర్ట్ ద్వారా సేవలందిస్తోంది.
🔗 Website: www.upelservices.com
+919052222704
+919052222702