BigTV English

Viral Video: వారెవ్వా.. డ్యాన్స్ ఇరగదీసిన భార్యాభర్తలు, వీడియో వైరల్

Viral Video: వారెవ్వా.. డ్యాన్స్ ఇరగదీసిన భార్యాభర్తలు, వీడియో వైరల్

Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. క్షణాల్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా వైరల్ వీడియోలను సోషల్ మీడియాలో తెగ చూస్తున్నారు. తాజాగా హర్యానాకు చెందిన ఓ జంట హర్యానీ పాటకు చేసిన డ్యాన్స్ వీడియో మస్త్ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియోకు లక్షల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను క్లియక్ కట్‌గా తెలుసుకుందాం.


హర్యానాకు చెందిన ఒక జంట ‘లాంబా లాంబా ఘూంఘట్’ అనే హర్యానీ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. ఇందులో ఒక వ్యక్తి, అతని భార్యతో కలిసి వారి ఓ వేడుకలో అద్భుతంగా డ్యాన్స్ చేశారు. వారి చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన కూడా వస్తోంది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ వైరల్ వీడియోపై ప్రముఖ సింగర్ అజయ్ హుడా కూడా స్పందించారు. ఈ వీడియోపై అజయ్ హుడా ట్విట్టర్ వేదిగా రియాక్ట్ అయ్యారు. ఈ జంటకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘లాంబా లాంబా ఘూంఘట్’ పాట ఇంతగా ప్రజాదరణ పొందడానికి ఈ వీడియో ఒక ముఖ్య కారణమని ఆయన పేర్కొన్నారు.

?utm_source=ig_web_copy_link


ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోలో మహిళ గ్రీన్ కలర్ దుస్తులు ధరించగా, ఆమె భర్త వైట్ కలర్ డ్రెస్ ధరించి ఉన్నారు. ఈ జంట ఓ ఫంక్షన్ లో ఎంతో ఉత్సాహంగా ఒకరినొకరు ఫాల్లో అవుతూ ఒకే రీతిలో డ్యాన్స్ వేశారు. వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ వీడియోను మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఈ వీడియోకు ఇప్పటివరకు లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులు వచ్చాయి. నెటిజన్లు ఈ వీడియోపై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. వారి డ్యాన్స్, ఒకరినొకరు ఫాల్లో అవుతున్న తీరును ఎంతోమంది మెచ్చుకుంటూ కామెంట్ చేస్తున్నారు. కొందరు ఈ జంటను ‘రియల్ సూపర్‌స్టార్లు’ అని కామెంట్ చేశారు. మరికొందరు ‘సినిమాలో హీరో, హీరోయిన్లు కూడా ఇంత బాగా డ్యాన్స్ వేయరు” అని కామెంట్లు చేశారు. ‘వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మామూలుగా లేదు’ అని.. ‘వీరి డ్యాన్స్.. ఈ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది’ అని కామెంట్ చేసుకొచ్చారు.

ALSO READ: Gudivada : చీర, గాజులు, బూటు పాలిష్‌లు.. కొడాలికి గుడివాడ సెగ..

ఈ పాటకు యూట్యూబ్‌లో 62 మిలియన్లకు పైగా వ్యూస్‌తో ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందింది. ఈ పాటలో ప్రఖ్యాత గాయకుడు అజయ్ హుడా పాడారు. వీడియోలో ఈ జంట ఎంతో ఆనందంగా డ్యాన్స్ చేస్తూ ఇంటర్నెట్‌లోని అందరి హృదయాలను గెలుచుకున్నారు. ముఖ్యంగా వారిద్దరూ మీద చేసిన కదలికలు, ఒకరినొకరు అనుసరించిన విధానం ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ దంపతులు ఇద్దరూ చేసి డ్యాన్స్ వల్లద వల్ల ఈ పాట ప్రజాదరణ మరింత పెరిగింది.

ALSO READ: HRRL Recruitment: హెచ్ఆర్ఆర్ఎల్‌లో ఉద్యోగాలు.. రూ.2,20,000 జీతం, క్వాలిఫికేష్ ఇదే..

Related News

Viral Video: వరద నీటిలోనూ దూసుకెళ్లే కారు.. కానీ, ట్రాఫిక్ పోలీసులకు నచ్చలే!

Viral video: తాళి కడతావా లేదా? కట్టకుంటే వి*ప్పేస్తా.. అమ్మాయి వార్నింగ్.. వీడియో వైరల్!

Watch Video: రైల్లో ఊపిరి ఆడక యువతి విలవిల.. శునకానందం పొందిన జనాలు, వీడియో వైరల్!

Gujarat Tragedy: కన్నకొడుకుతో పాటే ఇష్టమైన బైక్ సమాధి, ఈ బాధ మరే పేరెంట్స్ కు రావద్దు!

Bizarre Food: రసం రైస్.. ఐస్‌ఫ్రూట్, తినక్కర్లేదు.. ఏకంగా నాకేయొచ్చు!

Viral News: అక్కడ పెళ్లికి ముందే ఫస్ట్ నైట్.. గుడిసెల్లోకి పంపి మరీ ఎంకరేజ్ చేసే పెద్దలు!

Big Stories

×