D-Mart vs LuLu Mall: లులు మాల్ భారత్ లో శరవేగంగా తన స్టోర్లను విస్తరిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు నగరాల్లో తన స్టోర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. చక్కటి ఆఫర్లు, అద్భుతమైన డీల్స్ తో కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. UAEలోని ప్రపంచ రిటైల్ దిగ్గజం లులు గ్రూప్ నిర్వహిస్తున్న ఈ మాల్స్, హైపర్ మార్కెట్లు భారతీయ వినియోగదారుల హృదయాలను గెల్చుకుంది. విశాలమైన షాపింగ్ కాంప్లెక్స్ ల నుంచి అత్యంత అనుకూలమైన ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ ల వరకు, లులు మాల్స్ మరింత చేరువ అయ్యింది. ఇండియాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లులు మాల్స్ లక్షలాది మంది ఇష్టపడే గమ్యస్థానంగా ఎందుకు మారిందో ఇప్పుడు తెలుసుకుందాం..
వన్ స్టాప్ షాపింగ్ ప్యారడైజ్
లులు మాల్స్ దేశంలోని అతిపెద్ద షాపింగ్ స్పాట్ లలో ఒకటిగా కొనసాగుతోంది. కొచ్చి, బెంగళూరు, లక్నో, హైదరాబాద్, తిరువనంతపురం లాంటి నగరాల్లో ఉన్నాయి. 2013లో ప్రారంభించబడిన కొచ్చి ఫ్లాగ్ షిప్ లులు మాల్ ఏకంగా 2.5 మిలియన్ చదరపు అడుగులకు పైగా విస్తరించి ఉంది. ఇది దేశంలోని అతిపెద్ద మాల్స్ లో ఒకటి. ఇందులో వందలాది స్టోర్లు ఉన్నాయి. కిరాణా సామాగ్రి నుంచి హై-ఎండ్ ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు సహా అనేక వస్తువులను అందిస్తున్నాయి. హైపర్ మార్కెట్ మోడల్ లులును ప్రత్యేకంగా నిలుపుతుంది. ఇది సూపర్ మార్కెట్ సౌలభ్యాన్ని డిపార్ట్ మెంట్ స్టోర్ వైవిధ్యాన్ని మిక్స్ చేస్తుంది. 20,000 కంటే ఎక్కువ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతుంది. తాజా పండ్లు, కూరగాయలు, బియ్యం, నూనెలు, బ్రాండెడ్ దుస్తులు, గాడ్జెట్‌లు, ఫర్నిచర్‌ను కూడా ఒకేచోట కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కస్టమర్ల సమయం, శ్రమను ఆదా చేస్తుంది.
సరసమైన ధరలు, అదిరిపోయే తగ్గింపులు
లులు ప్రజాదరణ పొందడానికి కారణం తక్కువ ధరలకే వస్తువులను అందించడం. ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది.
⦿ వీక్లీ ప్రైస్ బస్టర్స్: బియ్యం, నూనెలు, స్నాక్స్ లాంటి కిరాణా సామాగ్రిపై రూ. 99 ఆఫర్లు అందిస్తుంది. బై వన్ గెట్ వన్ ప్రమోషన్స్ డీల్స్ అందిస్తుంది.
⦿ ఫెస్టివల్ సేల్స్: దీపావళి, స్వాతంత్ర్య దినోత్సవం, ఓనం పండుగల సందర్భంగా ఎలక్ట్రానిక్స్, దుస్తులు, గృహోపకరణాలపై 70% వరకు తగ్గింపులను అందిస్తుంది.
⦿ బ్లాక్ ఫ్రైడే, మిడ్ నైట్ సేల్స్: ఈ ఈవెంట్లు మొబైల్స్, ల్యాప్ టాప్ ల నుండి కిచెన్ వేర్ వరకు ఎంపిక చేసిన వస్తువులపై 90% వరకు తగ్గింపును అందిస్తాయి.
⦿ లాయల్టీ ప్రోగ్రామ్: లులు హ్యాపీనెస్ ప్రోగ్రామ్ ప్రతి కొనుగోలుపై పాయింట్లు, ఇన్ స్టంట్ డిస్కౌంట్లు, స్పెషల్ మెంబర్స్ ధరలతో కస్టమర్లకు బహుమతులు ఇస్తుంది.
ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభవం
లులు మాల్స్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభవాన్ని కలిగిస్తాయి.
⦿ ఎంటర్ టైన్ మెంట్ జోన్లు: లులు మాల్ లక్నోలో బౌలింగ్, ఆర్కేడ్ గేమ్‌లు, పిల్లల కోసం ఆట స్థలాలు వంటి కార్యకలాపాలతో ఫన్ జోన్లు ఉన్నాయి.
⦿ ఫుడ్ కోర్టులు, డైనింగ్: గ్లోబల్ ఫాస్ట్-ఫుడ్ చైన్‌ల నుంచి స్థానిక రుచికరమైన వంటకాల వరకు, లులు మాల్స్ వివిధ రకాల డైనింగ్ ఎంపికలను అందిస్తున్నాయి. కొచ్చిలోని లులు మాల్ లోని ఫుడ్ కోర్ట్ 20 కి పైగా అవుట్ లెట్లతో ఆహార ప్రియుల స్వర్గంగా మారింది.
⦿ సినిమా హాళ్లు: బెంగళూరు లులు మాల్స్ లో సినిమా ప్రియుల కోసం మల్టీప్లెక్స్ లు ఉన్నాయి.
సౌకర్యవంతమైన ఆన్ లైన్ షాపింగ్
లులుకు సంబంధించి లులు ఆన్ లైన్ ఇండియా యాప్, వెబ్ సైట్ ద్వారా అన్ని రకాల వస్తువులను కొనుగోలు చెయ్యొచ్చు. కొనుగోలుదారులు తాజా ఉత్పత్తుల నుండి గాడ్జెట్‌ల వరకు వేలాది ఉత్పత్తులను బ్రౌజ్ చేయవచ్చు. వస్తువు ఏదైనా ఆర్డర్ చేసిన తొలి రోజే ఉచితంగా డెలివరీ ఇస్తారు. ఈ యాప్ ప్రత్యేకమైన ఆన్ లైన్ డీల్స్, కూపన్స్, ప్రమోషన్లపై రియల్-టైమ్ అప్ డేట్లను కూడా కలిగి ఉంది. వినియోగదారులు డబ్బులు ఆదా చేసుకోవడంలో ఉపయోగపడుతాయి. మాన్సూన్ షాపింగ్ మేళా సందర్భంగా, యాప్ ద్వారా కిరాణా కొనుగోళ్లతో 65% వరకు తగ్గింపును పొందుతున్నట్లు కస్టమర్‌లు వెల్లడించారు. అంతేకాదు, నాణ్యతలోనూ లులు మాల్స్ వస్తువులు చాలా బాగుంటాయి.
అంతేకాదు, హ్యాపీనెస్ ప్రోగ్రామ్ లో చేరడం ద్వారా ప్రతి కొనుగోలుతో పాయింట్లను పొందే అవకాశం ఉంటుంది. బిగ్ సేల్స్ సమయంలో షాపింగ్ తో తక్కువ ధరలకు వస్తువులను పొందే అవకాశం ఉంటుంది. కిరాణా సామాన్లు బల్క్ లో కొనుగోలు చేయడం ద్వారా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. డిమార్ట్ ధరల్లోనే డిమార్ట్ కంటే ఎక్కువ వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది వినియోగదారులు లులు మాల్ లో షాపింగ్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
Read Also: డిమార్ట్ లో వస్తువుల ధరలు ఎందుకంత తక్కువ? ఏ రోజుల్లో మరింత చీప్ గా కొనేయొచ్చు?