Gaya News: బీహార్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. గయా జిల్లాలో గురువారం రోజు జరిగిన ఈ దారుణ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. పోలీస్ నియామక పరీక్షలో పాల్గొన్న 26 ఏళ్ల యువతి ఫిట్ నెస్ పరీక్ష సమయంలో స్పృహ తప్పి కింద పడిపోయింది. గమనించిన పోలీస్ సిబ్బంది ఆస్పత్రికి తరలించేందుకు అక్కడే ఉన్న అంబులెన్స్ ను ఏర్పాటు చేశారు. అయితే.. అంబులెన్స్ లో తనపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు యువతి ఆరోపిస్తుంది. ఈ దారుణ ఘటన బీహార్ లో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర చర్చకు దారితీసింది. దీనికి సంబంధించిన వివరాలు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గయా జిల్లాలో బీహార్ మిలిటరీ పోలీస్ మైదానంలో హోంగార్డ్ నియామక ప్రక్రియకు యువతి హాజరైంది. అయితే ఆ సమయంలో మైదానంలో యువతి ఒక్కసారిగా స్పృహ తప్పి కిందపడిపోయింది. పోలీసులు అంబులెన్స్ లో సమీపంలో ఉన్న అనుగ్రహ్ నారాయణ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. అయితే.. యువతి స్పృహలోకి వచ్చిన తర్వాత అంబులెన్స్ లో ఉన్న ముగ్గురు నలుగురు వ్యక్తలు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. యువతి ఫిర్యాదు మేరకు బోధ్ గయా పోలీస్ స్టేషన్‌లో నిందితులపై కేసు నమోదైంది. పోలీసులు ఈ ఘటనపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.
యువతి ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే అంబులెన్స్ డ్రైవర్ వినయ్ కుమార్, టెక్నీషియన్ అజిత్ కుమార్‌లను అరెస్ట్ చేశారు. గయా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందం సంఘటనా స్థలంలో సాక్ష్యాలు సేకరించింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అంబులెన్స్ మార్గం, సమయం, తదితర వివరాలను పోలీసులు తెలుసుకున్నారు. పోలీసులు మిగిలిన నిందితుల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధితురాలికి అన్ని విధాలుగా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఈ ఘటనపై లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పశ్వాన్ స్పందించారు. బీహార్‌లో చట్టం, శాంతిభద్రతల వైఫల్యాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నందుకు బాధగా ఉందని అన్నారు. విపక్ష నేత తేజస్వీ యాదవ్ ఈ ఘటనను “రాక్షస రాజ్”గా అభివర్ణించి, నీతీశ్ కుమార్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. రోజురోజుకీ బీహార్‌లో నేరాలు పెరిగిపోతున్నాయని, ప్రజల రక్షణకు ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ సంఘటన మహిళల భద్రతపై తీవ్ర చర్చకు దారితీసింది. అంబులెన్స్ వంటి వాహనంలో ఇలాంటి నేరం జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల లోపాన్ని తెలియజేస్తున్నారు.
ALSO READ: Heavy rains: ఈ జిల్లాల్లో భారీ వర్షం.. 40 కిమీ వేగంతో ఈదురు గాలులు.. అక్కడ పిడుగులు పడే ఛాన్స్
ALSO READ: ESIC Recruitment: ఈఎస్ఐసీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. 2లక్షల వేతనం, పూర్తి వివరాలివే..