విద్యార్థులకు సంతోషకరమైన వార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ వార్తతో విద్యార్థులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంతకీ రేపు సెలవు ఎందుకు ఇచ్చారు? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
సెప్టెంబర్ 5ను పలు రాష్ట్రాలు సెలవు దినంగా పాటిస్తున్నాయి. దానికి కారణం మిలాద్-ఉల్-నబి. ఇది ముస్లీంలకు సంబంధించిన మతపరమైన వేడుక. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ వేడుక సందర్భంగా సెలవు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. విద్యా క్యాలెండర్ లోనూ ఈ పండుగను ప్రత్యేకంగా మెన్షన్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటిస్తుంది. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో విద్యాశాఖలు రేపు సెలవు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. మిలాద్-ఉల్-నబి సందర్భంగా రేపు సెలవు ప్రకటిస్తున్నట్లు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,తమిళనాడుమ సహా పలు ప్రభుత్వాలు ప్రకటించాయి. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయనున్నట్లు తెలిపాయి.
ఇక తెలంగాణ వ్యాప్తంగా రేపు వినాయక నిమజ్జనం జరగనుంది. ఈ నేపథ్యంలో సెలవు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల నుంచి మొదలు కొని హైదరాబాద్ వరకు తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. వినాయక శోభాయాత్రలతో అన్ని ప్రాంతాలు కోలాహాలంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలు కూడా ఈ వేడుకల్లో పాల్గొని ఉత్సాహంగా గడపనున్నారు.హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున సెలవు ప్రకటించాలని నిర్ణయించింది. మొత్తంగా ఒకే రోజు ముస్లీంల వేడుక అయిన మిలాద్-ఉల్-నబి, హిందువుల వేడుక అయిన గణేష్ నిమజ్జనం రావడంతో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సెలవుకు సంబంధించిన వివరాలను విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలను సంప్రదించి తెలుసుకోవాలని అధికారులు సూచించారు.
అటు ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో సెలవులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 5 వరకు సెలవులు ప్రకటించారు. అక్కడ గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు అల్లకల్లోలం సృష్టించాయి. పలు జిల్లాల్లో రహదాలు ధ్వంసం అయ్యాయి. బ్రిడ్జిలు కూలిపోయాయి. విద్యా సంస్థలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాయి. వాతావరణ పరిస్థితులు చక్కబడే వరకు విద్యాసంస్థల మూసివేత కొనసాగుతుందని పంజాబ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా వెల్లడించాయి.
Read Also: ఆకాశం నుంచి పడ్డ బంగారు ఉల్క.. అసలు విషయం తెలిసి అంతా షాక్!