BigTV English

Gama Awards 2025 : గామా అవార్డ్స్ 2025.. దుబాయ్ లో సినీ తారల సందడి.. పుష్ప రాజ్ కు అవార్డ్..

Gama Awards 2025 : గామా అవార్డ్స్ 2025.. దుబాయ్ లో సినీ తారల సందడి.. పుష్ప రాజ్ కు అవార్డ్..
Advertisement

Gama Awards 2025 : సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్లలో గామా అవార్డులు ఒకటి. ప్రతి ఏడాది ఈ అవార్డులను సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు అందుకుంటున్నారు. ఈ ఏడాది కూడా దుబాయ్ లో గ్రాండ్ గా ఈ అవార్డు వేడుకలను నిర్వహించారు. ఈ అవార్డుల కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు.. ఇక తెలుగు హీరోయిన్లు దుబాయ్ గడ్డమీద సందడి చేశారు. ఇప్పటికే నాలుగు ఎడిషన్ల గామా అవార్డులను అందజేశారు. రీసెంట్గా ఐదవ ఎడిషన్ గామా అవార్డులో వేడుకను ఘనంగా నిర్వహించారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో పుష్ప రాజ్ కి అవార్డు వరించింది. అలాగే పలువురు నటీనటులు ఈ అవార్డుని అందుకున్నారు. ఎంతమందికి గామా అవార్డు వచ్చిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


పుష్ప రాజ్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్…

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. నేషనల్ వైట్ గా ఈ సినిమాతో అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ పెరిగారు. గత ఏడాది ఈ మూవీ కు సీక్వల్ గా పుష్ప 2 వచ్చింది. మొదటి పార్ట్ కంటే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది. అంటే కాదు భారీగా కలెక్షన్ లో వర్షం కురిసింది. ఇప్పటికే ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ నటనకు గాను ఎన్నో అవార్డులు వరించాయి. తాజాగా గామా అవార్డులలో కూడా పుష్పరాజు తగ్గలేదు. బెస్ట్ యాక్టర్ అవార్డు అల్లు అర్జున్ కి దక్కింది. అల్లు అర్జున్ కి అవార్డు రావడం పై ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.


గామా వేడుకలో ఎంతమందికి అవార్డు వరించింది..

గామా బెస్ట్ యాక్టర్ 2024 – అల్లు అర్జున్ (పుష్ప2 మూవీ)

గామా బెస్ట్ హీరోయిన్ – మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్ మూవీ)

గామా బెస్ట్ మూవీ – పుష్ప 2

గామా బెస్ట్ డైరెక్టర్ – సుకుమార్

గామా బెస్ట్ ప్రొడ్యూసర్ – అశ్విని దత్, ప్రియాంక దత్ ( కల్కి మూవీ )

గామా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – దేవిశ్రీప్రసాద్ (పుష్ప 2 మూవీ)

బెస్ట్ కొరియోగ్రఫీ – భాను మాస్టర్ (నల్లంచు తెల్లచీర.. మిస్టర్ బచ్చన్ మూవీ)

బెస్ట్ ఎడిటర్ – నవీన్ నూలి (లక్కీ భాస్కర్ మూవీ)

బెస్ట్ సినిమాటోగ్రఫీ – రత్న వేలు (దేవర మూవీ)

గామా బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ – రజాకార్ మూవీ

గామా బెస్ట్ యాక్టర్ క్రిటిక్ – తేజ సజ్జా

బెస్ట్ పెర్ఫార్మన్స్ యాక్టర్ జ్యూరీ – రాజా రవీంద్ర (సారంగదరియా మూవీ)

బెస్ట్ యాక్టర్ జ్యూరీ – కిరణ్ అబ్బవరం (క మూవీ )

బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ – రోషన్ (కోర్ట్ మూవీ)

బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ ఫిమేల్ – శ్రీదేవి (కోర్ట్ మూవీ)

బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ ఫిమేల్ – మానస వారణాశి

బెస్ట్ ఆస్పైరింగ్ డైరెక్టర్ – అప్సర్ (శివం భజే మూవీ)

గద్దర్ మెమోరియల్ మ్యూజిక్ అవార్డ్ – మట్ల తిరుపతి

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – వినయ్ రాయ్ (హనుమాన్ మూవీ)

బెస్ట్ సపోర్టింగ్ పెర్ఫార్మన్స్ అవార్డ్ – హర్ష చెముడు (సుందరం మాస్టర్ మూవీ)

బెస్ట్ సపోర్టింగ్ కామెడీ రోల్ – బాలిరెడ్డి పృథ్వీరాజ్

బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ – యదు వంశీ (కమిటీ కుర్రాళ్ళు)

బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ – నిహారిక కొణిదెల (కమిటీ కుర్రాళ్ళు)

బెస్ట్ డెబ్యూ యాక్టర్ ఫిమేల్ – నయన్ సారిక (ఆయ్, క)

బెస్ట్ డెబ్యూ యాక్టర్ జ్యూరీ – ధర్మ కాకాని (డ్రింకర్ సాయి మూవీ)

గామా బెస్ట్ సింగర్ అవార్డ్స్…

బెస్ట్ లిరిసిస్ట్ – రామ జోగయ్య శాస్త్రి (చుట్టమల్లే..దేవర మూవీ)

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ – అనురాగ్ కులకర్ణి (సుట్టమలా సూసి.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ)

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ క్రిటిక్ – సింగర్ సమీరా భరద్వాజ్ (నల్లంచు తెల్లచీర.. మిస్టర్ బచ్చన్)

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ – మంగ్లీ (కళ్యాణి వచ్చావచ్చా.. ఫ్యామిలీ స్టార్ మూవీ)

Also Read : ఈ వారం అత్యంత దారుణం.. బ్రహ్మముడి పరిస్థితి ఏంటి..?

ఇక వీటితో పాటుగా బెస్ట్ గ్లోబల్ కమెడియన్ గా బ్రహ్మానందం కు అవార్డు వచ్చింది. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును నిర్మాత అశ్వినీ దత్ కు, ప్రామిసింగ్ యాక్టర్ గా హీరో సత్యదేవ్ జీబ్రా సినిమాకు వచ్చింది.. వీటితోపాటు మరికొన్ని అవార్డులను కూడా అందుకున్నారు.. దుబాయ్ గడ్డమీద తెలుగోళ్ల సత్తాని చాటారు… అంతేకాదు ఈ అవార్డు వేడుకలో తెలుగు హీరోయిన్లు పాటలతో అదిరిపోయే స్టెప్పులతో దద్దరిల్లేలా చేశారు.. ప్రస్తుతం ఈ అవార్డు వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Related News

Pawan Kalyan: పవన్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన దిల్ రాజు .. ఫస్ట్ టైం ఆ పాత్రలో పవర్ స్టార్?

Samantha -Raj Nidumori: డైరెక్టర్ రాజ్ పోస్ట్ పై సమంత కామెంట్స్.. రిలేషన్ బయట పెట్టినట్టేనా?

Mass Jathara: మాస్ జాతర టైటిల్ ఆలోచన అతనిదేనా.. ఈ టాలెంట్ కూడా ఉందా బాసు?

Nani Sujeeth : నాని సరసన పూజ హెగ్డే, సెంటిమెంటును ఛాలెంజ్ చేస్తున్న సుజీత్ 

Raviteja-Sreeleela: శ్రీ లీల నటన పై రవితేజ కామెంట్స్.. ఇంకా బయట పెట్టలేదంటూ!

Prabhas: ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రానున్న అప్డేట్స్ , సుకుమార్ కల నెరవేరినట్లే

Akhanda 2 : అఖండ 2 టీం కు జియో హాట్ స్టార్ కండిషన్స్, మరి ఇంతలో ఇన్వాల్వ్ అవుతారా?

Suriya 46 : అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన మాస్ మహారాజా కొడుకు, యాక్టింగ్ కు దూరమైనట్లేనా? 

Big Stories

×