BigTV English

LoveTrap Bhopal: కాలేజీ అమ్మాయిలను టార్గెట్ చేసే లవ్ ట్రాప్ గ్యాంగ్.. మత్తుమందు ఇచ్చి ఆ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

LoveTrap Bhopal: కాలేజీ అమ్మాయిలను టార్గెట్ చేసే లవ్ ట్రాప్ గ్యాంగ్.. మత్తుమందు ఇచ్చి ఆ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

LoveTrap Bhopal| కాలేజీలో చదువుకునే అమాయక యువతులే వారి టార్గెట్. వారితో స్నేహం చేసి, సినిమాలకు షికార్లకు తిప్పి ఆ తరువాత ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేస్తారు. ఆ విద్యార్థినులు వారిని పూర్తిగా నమ్మాక.. వారిని ఏకాంత ప్రదేశాలకు తీసుకుపోయి లోబర్చుకుంటారు. ఆ తరువాత వారి అసభ్య వీడియోలు తీసి తాము చెప్పిందే చేయాలంటూ ఆ వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తారు. మతం మారాలని, తాము చెప్పినట్లు వ్యభిచారం చేయాలని బెదిరిస్తారు. ఇలా దాదాపు 15 నుంచి 20 మంది యువతులు ఆ గ్యాంగ్ సభ్యుల బారిన పడి నరకం అనుభవిస్తున్నారు. అయితే ఒక బాధితురాలు ధైర్యం చేసి పోలీసుల ముందు వారి బండారం బయటపెట్టింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. భోపాల్ నగరంలోని టిఐటి కాలేజీ (TIT College) లో బిటెక్ చదువుకునే ముగ్గురు విద్యార్థినులు.. (వారిలో ఇద్దరు అక్కా చెల్లెళ్లు) ఒక బ్లాక్ మెయిల్ గ్యాంగ్ బారిన పడి చిత్రహింసలు అనుభవించారు. ఈ ముగ్గురిలో ఒక యువతి ధైర్యం చేసి తన తండ్రికి తన సమస్యలు చెప్పగా.. ఆయన పోలీసులను ఆశ్రయించాడు. కేసు తీవ్రతను బట్టి పోలీసులు వెంటనే విచారణ మొదలు పెట్టారు. దీంతో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

పోలీసులు కథనం ప్రకారం.. ఫర్హాన్, సాహిల్ అనే ఇద్దరు యువకులు టిఐట్ కాలేజీకి చెందిన ఇద్దరు యువతులతో స్నేహం చేశారు. కాలేజీలో చదువుకునే ఇతర అమ్మాయిల ద్వారా వారికి పరిచయం ఏర్పడింది. సాహిల్, ఫర్హాన్ ఇద్దరు తమ పేర్లను మార్చుకొని హిందూ పేర్తలో వారికి పరిచయమయ్యారు. మంచి కార్లు, ఖరీదైన బైకులు తీసుకొని కాలేజీల చుట్టూ తిరిగుతూ ఉండడంతో.. వాటిని చూసి ఆ ఇద్దరు అమ్మాయిలు వారి వలలో పడ్డారు. వీకెండ్స్ సమయంలో వారితో సినిమాలు, షికార్లకు, పబ్బులకు వెళ్లడం వంటివి చేశారు.


ఆ తరువాత ఒకరోజు ఫర్హాన్ ఒక యువతిని తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని తన ఇంటికి తీసుకెళ్లాడు. కానీ అది అతని ఇల్లు కాదు. అతని స్నేహితుడు సాహిల్ నివసించే ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్. అక్కడికి వెళ్లాక.. కాసేపు అక్కడ పని ఉందని చెప్పి ఆమెను కూర్చోబెట్టి జ్యాస్ ఇచ్చాడు. అందులో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అది తాగిన వెంటనే ఆ యువతి స్పృహ కోల్పోగా ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే ఇదంతా అదే గదిలో ఉన్న సాహిల్ వీడియోగా రికార్డ్ చేశాడు. మెలుకువ రాగానే ఆ యువతి తాను మోసపోయానని గ్రహించి అతనితో గొడవ పడింది. అప్పుడు ఫర్హాన్ ఆమెను వీడియో చూపించి బెదిరించాడు. అంతటితో ఆగక.. ఆమెపై సాహిల్ కూడా అత్యాచారం చేశాడు. తాము చెప్పినట్లు చేయాలని లేకపోతే ఆ వీడియో బటయపెడతామని బ్లాక్ మెయిల్ చేశారు.

Also Read: యువతిపై మనసుపడ్డ వృద్ధుడు.. కొడుకుని హత్య చేసిన 76 ఏళ్ల తండ్రి

ఆ వీడియో బయటికి వస్తే తన పరువు పోతుందని భావించిన ఆ యువతి వారు చెప్పినట్లు చేసింది. ముందుగా ఆమె మరో స్నేహితురాలిని కూడా అదే తరహాలో వారి అపార్ట్ మెంట్ కు తీసుకువచ్చి రేప్ చేశారు. ఆ తరువాత యువతి చెల్లిని కూడా తీసుకువచ్చి ఆమెపై కూడా అత్యాచారం చేసి వీడియోలు రికార్డ్ చేశారు. యువతి చెల్లి ఒక మైనర్. అంతటి వారి దుర్మార్గం ఆగలేదు. ఆ అపార్ట్ మెంట్ కు వేర్వేరు యువకులను తీసుకువచ్చి కాలేజీ అమ్మాయిలతో వ్యభిచారం చేయించారు. పార్టీల పేరుతో యువతల చేత మద్యం తాగించారు. వారిని మతం మారాలని ఒత్తిడి చేశారు. అప్పుడు వారికి తెలిసింది వారు ఇంతకాలం నకిలీ పేర్లతో స్నేహం చేశారని. అయితే అనుకోకుండా ఆ రోజు ఫర్హాన్ ఫోన్ ఆ యువతికి చిక్కింది. అందులో తన లాంటి చాలామంది యువతుల అశ్లీల వీడియోలున్నాయి. అది చూసి ఆ యువతి వారిది ఒక గ్యాంగ్ అని తెలిసి షాకైంది.

ఇక తాము అలాగే భరిస్తూ ఉంటే ఎప్పటికీ అలాగే వ్యభిచార ఊబిలో చిక్కుకుంటామని తెలిసి ఆ యువతి తన తండ్రికి తన బాధ మొత్తం చెప్పింది. ఆ తరువాత పోలీసులు ఈ కేసుని సీరియస్ తీసుకొని సాహిల్, ఫర్హాన్ అనే ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారిని విచారణ చేయగా.. ఈ గ్యాంగ్ చాలా పెద్దదని తెలిసింది. మరో ఇద్దరు యువకులు పట్టుబడ్డారు. ముగ్గురు యువతులలో ఒక యువతి మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మధ్య ప్రదేశ్ బలవంతపు మత మార్పిడి చట్టం కింద కూడా వారిపై కేసులు నమోదయ్యాయి. ఆ గ్యాంగ్ భారీ ఎత్తున వ్యభిచారం చేయిస్తోందని.. మధ్యప్రదేశ్ లోని బాగ్ సెవానియా, జెహింగీరా బాద్, ఆశోక గార్డెన్ ప్రాంతాలలో వీరి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. ఈ గ్యాంగ్ బారిన పడి చాలా మంది యువతులు మోసపోయారని.. ఇప్పటికే 15 నుంచి 20 మంది దాకా యువతులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చాలామంది యువతుల సామాజిక భయంతో తమ పరువుపోతుందని భావించి ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. 2022లో రాజస్థాన్ లో కూడా ఇలాంటి గ్యాంగ్ ని పోలీసులు పట్టుకున్నారు.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×