Thudarum OTT : బెస్ట్ సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ అంటే ఇప్పటికీ ‘దృశ్యం’ సినిమానే గుర్తొస్తుంది. అలాంటి మరో అదిరిపోయే థ్రిల్లర్ మూవీతో మోహన్ లాల్ తాజాగా ప్రేక్షకులను పలకరించారు. ‘తుడరుమ్’ (Thudarum)అనే టైటిల్ తో రూపొందిన ఈ మలయాళ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఏప్రిల్ 25 న థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో కూడా ఈ మూవీ ఇదే టైటిల్ తో తెరపైకి వచ్చింది. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్‌లాల్, శోభన ప్రధాన పాత్రల్లో నటించారు. సైలెంట్ గా 70 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ ఏ ఓటీటీలో, ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…
ఓటీటీ స్ట్రీమింగ్ డేట్
‘తుడరుమ్’ ఓటీటీ రిలీజ్ గురించి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ మాత్రం ఫిక్సయింది. ఇప్పటికే మోహన్ లాల్ నటించిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా హక్కులను సొంతం చేసుకున్న జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లోనే ‘తుడరుమ్’ కూడా స్ట్రీమింగ్ కానుంది. సాధారణంగా మలయాళ సినిమాలు థియేటర్ రిలీజ్ తర్వాత 4-6 వారాలలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయి. ఈ లెక్క ప్రకారం చూస్తే, సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలైంది. కాబట్టి ‘తుడరుమ్’ మే చివరిలో లేదా జూన్ మొదటి వారంలో ఓటీటీలో అందుబాటులోకి రావచ్చు. ఈ ఏడాది ‘ఎల్ 2 ఎంపురాన్’తో పాటు ‘తుడరుమ్’ కూడా హైయెస్ట్-గ్రాసింగ్ మలయాళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ ఓటీటీలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
కథలోకి వెళ్తే…
తుడరుమ్ ఒక ఫీల్-గుడ్ ఫ్యామిలీ డ్రామాగా మొదలై, క్రమంగా నెయిల్ – బైటింగ్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా మారే కథ. ఈ మూవీ స్టోరీ మొత్తం కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని రన్ని అనే గ్రామంలో నడుస్తుంది. షణ్ముఖంను బెంజ్ (మోహన్‌లాల్) అని పిలుస్తారు. ఆయనొక టాక్సీ డ్రైవర్. తన భార్య లలిత (శోభన), ఇద్దరు పిల్లలతో హాయిగా జీవిస్తాడు. అతనికి తన పాత బ్లాక్ వింటేజ్ అంబాసిడర్ మార్క్ 1 కారు అంటే అమితమైన ఇష్టం.
ఒక రోజు అతని కొడుకు పవి తన స్నేహితులను ఇంటికి తీసుకొస్తాడు. స్నేహితుల్లో ఒకరైన కిరణ్ తో కలిసి పవి తండ్రి అనుమతి లేకుండా అంబాసిడర్ కారును రైడ్ కి తీసుకెళ్తాడు. షణ్ముఖం ఓ షాప్ లో ఉండగా, తన కారు వెళ్తుండటం చూసి స్నేహితుడి స్కూటర్‌తో వెంబడిస్తాడు. అంతలోనే కారు గోడకు ఢీకొని కొంత డ్యామేజ్ అవుతుంది. దీంతో షణ్ముఖం కోపంగా పవిని కొడతాడు. తరువాత పవి కాలేజీ హాస్టల్‌కు వెళ్లిపోతాడు.
Read Also : ఇదేం చిత్రం మావా !? ఈ ఊళ్ళో చనిపోయిన వాళ్ళంతా తిరిగొస్తారు… వర్త్ వాచింగ్ సర్వైవల్ థ్రిల్లర్
షణ్ముఖం యజమాని మరణం కారణంగా మద్రాస్ కు వెళ్లి తిరిగి వచ్చాక, తన కారును పోలీసులు నార్కోటిక్స్ కేసులో స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. కుట్టిచాన్ వర్క్ షాప్‌లో పని చేసే మెకానిక్ మణియన్ ఈ కారును డ్రగ్స్ రవాణాకు వాడుకుంటాడు. ఇక కారును తిరిగి పొందడం కోసం షణ్ముఖం చేసే పోరాటం అరాచకంగా మారుతుంది. ఫ్యామిలీ డేంజర్ లో పడుతుంది. షణ్ముఖం తనకు ఇష్టమైన కారు, కుటుంబం కోసం ఎంత దూరం వెళ్తాడనే అంశం ఉత్కంఠభరితంగా మారుతుంది. మరి చివరికి షణ్ముఖం తన కారును తెచ్చుకోగలిగాడా? ఈ క్రమంలో ఆయన ఫ్యామిలీకి ఎదురైన కష్టాలు ఏంటి? వాటిని ఎలా అధిగమించారు? అనేది స్టోరీ.