BigTV English

Dating App Fatal Love| డేటింగ్ యాప్ లవ్.. బ్రేకప్ చెప్పిందని ప్రియుడు ఏం చేశాడంటే..

Dating App Fatal Love| డేటింగ్ యాప్ లవ్.. బ్రేకప్ చెప్పిందని ప్రియుడు ఏం చేశాడంటే..

Dating App Fatal Love| వారిద్దరూ ఆన్‌లైన్ ద్వారా కలుసుకున్నారు. కొంతకాలం గాఢంగా ప్రేమించుకున్నారు. అతను ఆమెను ప్రపోజ్ చేస్తూ.. చేతికి రింగ్ కూడా తొడిగాడు. కానీ అంతలోనే ఇద్దరూ గొడవపడడంతో ఆమె అతనిచ్చిన రింగ్ తిరిగి ఇచ్చేసింది. అయితే మరుసటి రోజే ఆమె తన ఇంటి బాత్రమ్ టబ్ లో రక్తపుమడుగులో కనిపించింది. ఈ ఘటన అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్జియా రాష్ట్రంలోని రాస్ వెల్ నగరానికి చెందిన ఫెబియోలా థామస్ (39), జూన్ 2019లో తన ఇంటి బాత్రూమ్ టబ్ లో శవమై కనిపించింది. ఆమెతో పాటు అదే ఇంట్లో నివసిస్తున్న ఆమె స్నేహితురాలు ఇంటికి చేరుకోగానే.. బాత్రూమ్ టబ్ లో ఫెబియోలా రక్తపు మడుగులో కనిపించింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఫెబియోలాని ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు.

ఫెబియోలా చేతి మణికట్టుకి కత్తితో గాయాలున్నాయి. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని ముందుగా అందరూ భావించారు. కానీ పోలీసులు ఆమె కేసులో లోతుగా విచారణ చేయగా.. ఫెబియోలా తన చేతులను స్వయంగా గాయపరచలేదని.. ఎవరో బలవంతంగా కత్తితో కోశారని ఫోరెన్సిక్ మెడికల్ నిపుణులు తేల్చారు. అయితే ఫోరెన్సిక్ మెడికల్ నిపుణుల నివేదిక వచ్చే వరకు కొన్ని నెలల సమయం పట్టింది.


Also Read: ‘మీ బట్టలు సరిగా లేవు బయటికి వెళ్లండి’.. మహిళను గెంటేసిన రెస్టారెంట్ ఓనర్

దీంతో పోలీసులు ఫెబియోలా గురించి మరింత సమాచారం సేకరించేందుకు ఆమె రూమ్ మేట్ ని ప్రశ్నించారు. అప్పుడు తెలిసింది.. ఫెబియోలా డేటింగ్ యాప్ ద్వారా ఆంటోనియో విల్సన్ ని కలిసిందని.. వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారని. పోలీసులు ఫెబియోలా సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించగా.. ఆమె ఆంటోనియోతో బ్రేకప్ చేసుకున్నట్లు తెలిసింది. ఫెబియోలా చనిపోయిన ఒక రోజు ఆమె ఆంటోనియో పంపిన మెసేజ్ లు చదవగా.. ఆమె ఇక తనతో బ్రేకప్ చేసుకున్నట్లు రాసింది. దీంతో ఆంటోనియో ఆమె వెంటపడినట్లు.. ఆమె తన ప్రేమని ఎందుకు రిజెక్ట్ చేస్తోందని అతన ప్రశ్నించినట్లు.

ఫెబియోలా మెసేజ్ లో.. ఆంటోనియో ఇచ్చిన రింగ్ కూడా వెనక్కు ఇచ్చేసినట్లు ఉంది. ఈ మెసేజ్ లన్నీ చదివిన పోలీసులు ఆంటోనియో కోసం గాలించారు. ఆంటోనియో పరారీలో ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. దీంతో పోలీసులకు ఆంటోనియోపై అనుమానం ఇంకా పెరిగింది.

చివరికి కొన్ని నెలల తరువాత ఆంటోనియోని పోలీసులు అరెస్టు చేశారు. కానీ ఆంటోనియోకు వ్యతిరేకంగా సరైన ఆధారాలు లేవు. అందుకే అయిదేళ్లు పాటు కోర్టులో ఫెబియోలా హత్య కేసు విచారణ సాగింది. జూలై 23. 2024న కోర్టు అతడిని ఫెబియోలా హత్యకేసులో దోషిగా తేల్చింది. కోర్టు నిర్ణయం వచ్చిన అరగటంలోనే జ్యూరీ అతడికి జీవితకాల జైలు శిక్ష విధించింది.

Also Read: ‘కలియుగం.. ఆడవాళ్లు ఇలా కూడా చేస్తున్నారు’.. పాకిస్తాన్ లో డివోర్స్ పార్టీపై ట్రోలింగ్

Tags

Related News

Guntur News: రాష్ట్రంలో దారుణ ఘటన.. పిల్లలను చంపి ఉరేసుకున్న తండ్రి

Delhi News: దారుణం.. సొంత తల్లిపై అత్యాచారానికి పాల్పడిన కిరాతక కొడుకు.. చివరకు..?

Medak District Crime: కన్న కొడుకును చంపిన తల్లి.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Khazana Jewellers Robbery: ఖజానా జ్యువెలరీ దోపిడీ దొంగలు ఇలా దొరికారు.. కీలక విషయాలు చెప్పిన డీసీపీ

Hyderabad crime: ఛీ.. ఛీ.. వీడు మనిషేనా? ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం..

Medak crime: ప్రియుడి కోసం కొడుకుపై కత్తి.. మెదక్‌లో తల్లి ఘాతుకం!

Big Stories

×