E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Fake Doctor: సంతాన లేమితో బాధపడుతున్నారా.. మేడ్చల్‌లో నకిలీ వైద్యుడు కలకలం

Fake Doctor: సంతాన లేమితో బాధపడుతున్నారా.. మేడ్చల్‌లో నకిలీ వైద్యుడు కలకలం
Advertisement

Fake Doctor: స్వేచ్చ బ్యూరో: మేడ్చల్‌లో నకిలీ వైద్యుడి బండారం బట్టబయలైంది. ఎలాంటి వైద్య అర్హతలు, ప్రభుత్వ అనుమతులు లేకుండానే క్లినిక్ నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పెంటయ్య అనే వ్యక్తిని కుత్బుల్లాపూర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ అధికారులు అరెస్టు చేశారు. మేడ్చల్ పట్టణంలోని “శివరామకృష్ణ డే కేర్ సెంటర్” పేరిట అక్రమంగా వైద్య సేవలు అందిస్తున్న అతడు, ఓ మహిళా వైద్యురాలి ధ్రువపత్రాలను ఉపయోగిస్తూ క్లినిక్ నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు.

ప్రత్యేక ఇంజెక్షన్లు..

ముఖ్యంగా సంతానం లేమితో బాధపడుతున్న దంపతులకు ప్రత్యేక ఇంజెక్షన్లు ఇస్తే గర్భం దాల్చుతారని నమ్మబలుకుతూ భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించిన SOT పోలీసులు, ఇద్దరు రోగులకు చికిత్స చేస్తున్న సమయంలోనే పెంటయ్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణలో వైద్య ఆరోగ్య శాఖ అనుమతులు లేకుండానే క్లినిక్ నిర్వహించడంతో పాటు అదే ప్రాంగణంలో మెడికల్ షాప్ కూడా నడుపుతున్నట్లు బయటపడింది.

Advertisement

Also Read: మనసులో ప్రేమను భార్యకు తెలిపే స్టైల్ వేరు.. న్యూమరాలజీ ద్వారా మీ భర్త స్వభావాన్ని తెలుసుకోండి

డాక్టర్ ఉమాగౌరి ఫిర్యాదు..

అర్హత లేకున్నా వైద్య చికిత్సలు చేస్తున్నట్టు గుర్తించారు. సంబంధించి అతడి వద్ద చికిత్స పొందుతున్న ఓ మహిళ నుంచి వివరాలను కూడా సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా మందులు నిల్వ చేయడం, వైద్య పరికరాలను వినియోగించడం వంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఉమాగౌరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి అక్రమ కార్యకలాపాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అర్హత కలిగిన వైద్యులను మాత్రమే సంప్రదించాలని, నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు.

Advertisement

Also read: తెలంగాణ సీపీఎం పార్టీలో మూడు ముక్కలాట.. తెరవెనుక ఉన్న ఆ కీలక నేత..?

Related News

Nalgonda Deaths: నల్గొండ జిల్లాలో దారుణం.. ఒకే ఇంట్లో నలుగురు మృతి.. !

పూణె యంగ్ బిజినెస్‌మేన్ మృతి కేసు.. కాబోయే భార్య పక్కాగా ప్లాన్ చేసిందా? పోలీసుల విచారణలో

Bengaluru Triple Murder: ఆ ఫ్యామిలీలో చిచ్చు రేపిన సహజీవనం.. నో చెప్పినందుకు పేరెంట్స్-చెల్లిని

భార్యకు విదేశాల్లో ఉద్యోగం.. భర్త రాసలీలల్లో బిజీ, CCTV‌కి చిక్కిన కానిస్టేబుల్

Coaching Fire: లక్నో కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి!

వాహనాల తనిఖీలు.. జిల్లా అధికారిపై దూసుకొచ్చిన లారీ, స్పాట్‌లో అధికారి వెంకన్న మృతి

BMW Car Crash: ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జైన బీఎండబ్ల్యూ కారు, 250 కిలోమీటర్ల వేగంతో

Big Stories

×