Fire accident: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాసేపటి క్రితమే కోకాపేట్ లో GAR టవర్స్ లోని ఓ రెస్టారెంట్లో సిలండర్ పేలడంతో ప్రమాదం జరిగింది. దీంతో ఆ బిల్డింగ్ మొత్తం మంటలు వ్యాపించాయి. స్థానికులు వెంటనే అగ్ని మాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో ఐటీ కంపెనీలు ఉన్న సమాచారం. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ప్రమాదంలో ఆరుగురు ఐటీ ఉద్యోగులకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. చికిత్స నిమిత్త క్షతగాత్రులను గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరుగురు ఉద్యోగులు ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇందులో నలుగురికి 30 శాతం గాయాలు కాగా.. ఒకరికి 40 శాతం, మరొకరికి 50 శాతం గాయాలు అయినట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: NCL Recruitment: సువర్ణవకాశం.. పదో తరగతి అర్హతతో 1765 పోస్టులు, ఇంకా 3 రోజులే గడువు..