Kannappa: తెలుగు నుండి వచ్చే ఏ పాన్ ఇండియా మూవీ అయినా ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. అందుకే టాలీవుడ్ నుండి వచ్చే ప్రతీ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అలాగే మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ‘కన్నప్ప’పై కూడా అప్పుడే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. అయితే ఈ మూవీపై ఆడియన్స్‌కు బజ్ క్రియేట్ అవ్వడానికి మరొక ముఖ్య కారణం ఇందులోని క్యాస్టింగ్. ‘కన్నప్ప’ కోసం ఇండియాలోని స్టార్స్‌ను అంతా ఒక్కచోటికి తీసుకొచ్చాడు విష్ణు. తాజాగా వారి పాత్రల గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేసుకున్నాడు.
ఎక్కువ స్కోప్
ఇండియాలో గొప్ప గొప్ప స్టార్స్ అయిన ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్లను తన ‘కన్నప్ప’ (Kannappa) మూవీలో నటించడానికి ఒప్పించాడు మంచు విష్ణు. అయితే వీరంతా సినిమాలో 5 లేదా 10 నిమిషాలు మెరిసి వెళ్లిపోయే గెస్ట్ రోల్సే అయ్యింటారని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. కానీ వీరందరిలో ఏ ఒక్కరివి కూడా గెస్ట్ రోల్స్ కావని క్లారిటీ ఇచ్చేశాడు మంచు విష్ణు. ‘‘ఆ స్టార్లంతా కేవలం ఫార్మాలిటీకి ఉన్నారని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వారి సొంత సినిమాలకంటే ఈ సినిమాలో వారికి ఎక్కువగా స్కోప్ లభించింది అని మీరే స్వయంగా అంటారు. వాళ్లు కేవలం గెస్ట్ పాత్రలకే పరిమితం కాదు. వాళ్లు కేవలం 2,3 నిమిషాలు వచ్చి వెళ్లిపోతారనుకుంటే అది తప్పు’’ అని రివీల్ చేశాడు.
ఫస్ట్ లుక్స్ రివీల్
‘కన్నప్ప’లో మంచు విష్ణు తండ్రి మోహన్ బాబు కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే తన తండ్రి పాత్ర కంటే ప్రభాస్, మోహన్ లాల్, ప్రభాస్ పాత్రలే చాలాసేపు స్క్రీన్‌పై కనిపిస్తాయని చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. ఇప్పటికే ఈ మూవీలో ఎవరెవరు ఏయే పాత్రల్లో కనిపిస్తున్నారనే విషయాన్ని మేకర్స్ రివీల్ చేశారు. అలా కిరట అనే పాత్రలో మోహన్ లాల్ కనిపించనున్నారని కూడా ఫస్ట్ లుక్‌తో క్లారిటీ ఇచ్చారు. మోహన్ లాల్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవ్వగానే ప్రేక్షకులు దానిని తెగ ట్రోల్ చేశారు. అసలు మోహన్ లాల్ పాత్ర ‘కన్నప్ప’లో ఎంత కీలకమో బయటపెట్టాడు మంచు విష్ణు (Manchu Vishnu).
Also Read: రష్మికకు ప్రొటెక్షన్ అవసరం.. కేంద్ర ప్రభుత్వానికి స్పెషల్ రిక్వెస్ట్
తెలియని చరిత్ర
‘‘మోహన్ లాల్ (Mohanlal) ఎపిసోడ్ ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తుంది. శివ బాలాజీ కూడా ఈ సినిమాలో భాగమే. తనకు అసలు కథేంటో చెప్పకుండా మోహన్ లాల్ ఎపిసోడ్‌కు సంబంధించిన కొంచెం ఫుటేజ్ చూపించాను. తను అది చూసి షాకయ్యాడు. ఇండియన్ హిస్టరీలో చాలామందికి తెలియని ఒక విషయం గురించి ఈ సినిమా ద్వారా తెలుసుకుంటారు. దీని గురించి ముందు సినిమాల్లో ఎక్కడా చూపించలేదు. విజయేంద్ర ప్రసాద్ నాకు ఈ ఐడియా ఇచ్చారు. కన్నప్పపై తెరకెక్కించిన ముందు సినిమాల్లో ఈ ఎపిసోడ్‌ను పెద్దగా వివరించలేదు. మోహన్ లాల్ పాత్రతో చాలామందికి తెలియని ఒక కొత్త చాప్టర్‌ను వారికి తెలిసేలా చేస్తున్నాం’’ అంటూ మోహన్ లాల్ పాత్ర గురించి చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పాడు మంచు విష్ణు.