OTT Movie : హారర్ సినిమాల ప్రత్యేకత ఏమిటో అందరికీ తెలిసిందే. ఒక వైపు భయపెడుతూ, మరో వైపు ఎంటర్టైన్ చేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, ఒక పురాతన దేవత నరబలిని కోరుకుంటూ ఉంటుంది. ఆతరువాత వణుకు పుట్టించే సీన్స్ తో, ప్రేక్షకులను బెదరగొడుతూ ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
అంబర్ అనే యువతి తన తల్లి మరణం తర్వాత, మెక్సికో నుండి అక్రమంగా అమెరికాకు వలస వస్తుంది. క్లీవ్ ల్యాండ్లో ఆమె ఒక చిన్న జాబ్‌లో పనిచేస్తూ, జీవనం సాగిస్తుంటుంది. ఆమెకు ఒక బోర్డింగ్ హౌస్‌లో చవకగా గది దొరుకుతుంది. దానిని రెడ్ అనే వ్యక్తి నడుపుతుంటాడు. కానీ ఆ ఇల్లు ఒక పాడుబడిన, వింత వాతావరణంతో ఉంటుంది. అంబర్ ఆ ఇంట్లో వింత శబ్దాలు, అరుపులు, భయంకరమైన దృశ్యాలను ఎదుర్కొంటుంది. అక్కడ రెడ్‌తో పాటు, మానసిక స్థితి సరిగ్గా లేని అతని సోదరుడు బెకర్ కూడా ఉంటాడు. ఆ ఇంట్లో కొన్ని గదులలో వింత వస్తువులు, రిచ్యువల్ సాక్రిఫైస్‌లకు సంబంధించిన చిత్రాలు అంబర్ కి కనిపిస్తాయి. స్టోరీ ముందుకు సాగే కొద్దీ, ఆ ఇంట్లో జరుగుతున్న భయంకరమైన సంఘటనలు, ఒక పురాతన రిచ్యువల్‌తో ముడిపడి ఉన్నాయని తెలుస్తుంది.
కొన్ని సంవత్సరాల క్రితం, రెడ్ తండ్రి ఒక ఆర్కియాలజిస్ట్ గా ఉండేవాడు. మెక్సికోలో ఒక వింత రాతి పెట్టెను తవ్వి తీసుకొస్తాడు. అందులో పురాతన దెయ్యాల దేవతకి చెందిన శక్తి ఉంటుంది. ఈ శక్తి మనుషులను బలి తీసుకుంటూ ఉంటుంది. ఎవరైనా బలి ఇస్తే, వారికి ఆరోగ్యంతో పాటు, శక్తిని ఇస్తుంది. అంబర్‌తో పాటు ఇంట్లోకి వచ్చిన ఇతర మహిళలు కూడా ఈ శక్తికి బలి కావాల్సి వస్తుంది. రెడ్, బెకర్ ఈ బలులను నిర్వహిస్తుంటారు. అందుకు గానూ, అక్రమ వలసదారులైన మహిళలను వీళ్ళు టార్గెట్ చేస్తుంటారు. అంబర్ దీని నుంచి బయట పడటానికి, తన బంధువు బెటో సహాయం కోసం ప్రయత్నిస్తుంది. అతన్ని కూడా ఈ రెడ్ సోదరులు బలి తీసుకుంటారు. చివరికి అంబర్ ఈ ఉచ్చులో నుంచి తప్పించుకుంటుందా ? ఆ దెయ్యాల దేవతకి బలైపోతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : సీను సీనుకో ట్విస్ట్ … సైలెన్స్ తో వైలెన్స్ పెంచే మూవీ… ఈ థ్రిల్లర్ని ఊపిరి బిగబట్టి చూడాల్సిందే
నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో
ఈ బ్రిటీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘నో వన్ గెట్స్ అవుట్ అలైవ్’ (No One Gets Out Alive). 2021లో వచ్చిన ఈ మూవీకి సంటియాగో మెంగిని దర్శకత్వం వహించారు. ఇది 2014 లో ఆడమ్ నెవిల్ రాసిననవల ఆధారంగా తెరకెక్కింది. ఇందులో క్రిస్టినా రోడ్లో, మార్క్ మెంచాకా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ స్టోరీ అక్రమంగా అమెరికాకు వలస వచ్చిన ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది.