Indian Railway Tickets Booking: పండుగ సీజన్ లో రైల్వే టికెట్లు త్వరగా బుక్కైపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల టికెట్ బుకింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ MakeMyTrip రెండు టూల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో ఒకటి టికెట్ల లభ్యత అంచనా, మరొకటి అమ్ముడైన టికెట్లకు సంబంధించిన అలర్ట్. ఈ రెండు టూల్స్ ప్రయాణీకులకు టికెట్ బుకింగ్ మోడల్స్ ను నావిగేట్ చేయడంలో, కన్ఫార్మ్ టికెట్లను పొందడంలో సాయపడనున్నాయి.
ప్రస్తుతం ముందస్తు రైల్వే టికెట్ బుకింగ్ గడువు 60 రోజులు ఉన్న నేపథ్యంలో MakeMyTrip బుకింగ్ డేటా ప్రకారం దాదాపు 40% మంది వినియోగదారులు విండో ఓపెన్ అయిన వెంటనే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. దాదాపు 60% మంది తమ ప్రయాణ ప్రణాళికలు ఖరారు అయ్యే సమయానికి ధృవీకరించబడిన సీట్లు అందుబాటులో లేకపోవడం వల్ల వెయిట్ లిస్ట్ చేయబడిన టికెట్లను బుక్ చేసుకుంటారు. బుకింగ్ మోడల్స్ డిమాండ్ ను బట్టి మారుతూ ఉన్నాయి. ఏప్రిల్ లో చాలా హై-స్పీడ్ రైళ్లు బయలుదేరడానికి 13 రోజుల ముందే టికెట్లు అన్నీ అమ్ముడయ్యాయి. మే నాటికి పెరిగిన డిమాండ్ కారణంగా, 20 రోజుల ముందుగానే టికెట్లు అమ్ముడయ్యాయి. డిమాండ్ హెచ్చు తగ్గులు అనేవి టికెట్లు ఎప్పుడు బుక్ చేసుకోవాలో ప్రయాణీకులకు సవాల్ మారుతుంది.
MakeMyTrip టికెట్ లభ్యత అంచనా టూల్
టికెట్ల బుకింగ్ సమస్యను పరిష్కరించడానికి MakeMyTrip సరికొత్త సీట్ లభ్యత అంచనా టూల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బుకింగ్ డేటా, రియల్ టైమ్ డిమాండ్ ఆధారంగా ప్రిడిక్టివ్ మోడల్స్ ను ఉపయోగించి వివరాలను అందిస్తుంది. ఎంపిక చేసిన రైలులో సీట్లు ఎప్పుడు అమ్ముడయ్యే అవకాశం ఉందో ఈ ఫీచర్ అంచనా వేస్తుంది. ఇది ప్లానింగ్ టూర్ దశలో వినియోగదారులకు ఎక్కువ స్పష్టతను అందిస్తుంది. ఈ ఫీచర్ ఇప్పుడు MakeMyTrip యాప్, వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. దీని ద్వారా టికెట్లు ఎప్పుడు బుక్ చేసుకోవాలో ఈజీగా తెలుసుకోవచ్చు. అనుకున్న సమయానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ప్రయాణీకులకు మెరుగైన టికెట్ బుకింగ్ అనుభవాన్ని అందించేందుకు ఈ టూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు MakeMyTrip వెల్లడించింది. “భారతీయ రైలు ప్రయాణీకుల అవసరాలను అంచనా వేయడం, పరిష్కరించడమే లక్ష్యంగా ఈ టూల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చాం. సీట్ లభ్యత అంచనా అనేది టికెట్ బుకింగ్ కు సాయపడుతుంది. ఎప్పుడు టికెట్ బుక్ చేసుకోవాలో సూచిస్తుంది. రైల్వే ప్రయాణీకులు ఈ టూల్స్ అందించే డేలా ప్రకారం టికెట్లును బుక్ చేసుకోవచ్చు. మెరుగైన ప్రయాణ అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది” MakeMyTrip సహ వ్యవస్థాపకుడు, CEO రాజేష్ మాగోవ్ వెల్లడించారు.
అటు MakeMyTrip సోల్డ్ అవుట్ అలర్ట్ టూల్ ను కూడా ప్రారంభించింది. ఇది ఎంచుకున్న రైలులో టికెట్ లభ్యత, టికెట్లు అయిపోయే సమయంలో వినియోగదారులకు అలర్ట్ చేస్తుంది. సకాలంలో బుకింగ్‌లను ప్రాంప్ట్ చేయడం, ధృవీకరించబడిన సీట్లను కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ టూల్ పని చేస్తుంది.
Read Also: 60 డేస్ అడ్వాన్స్ బుకింగ్ రూల్.. పండుగ వెళ్లాలంటే టికెట్ ఎప్పుడు బుక్ చేసుకోవాలి?