Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో.. కొన్ని విమానాలను దారి మళ్లించారు. ల్యాండింగ్ కోసం వాతావరణం అనుకూలంగా లేనందున, కొన్ని విమానాలను అధికారులు పలు ప్రాంతాలకు తరలించారు.
వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావాల్సిన ఐదు విమానాలను దారి మళ్లించారు. ఇందులో శంషాబాద్ కు రావాల్సిన మూడు విమానాలను అధికారులకు విజయవాడకు మళ్లించారు. మరో రెండు విమానాలను తిరుపతి, బెంగళూరుకు పంపించినట్టు తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో వాతావరణం అనుకూలించకపోవడంతో అధికారులు దారి మళ్లించారు.
ALSO READ: Bank of Maharashtra: డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాలు.. జీతమైతే అక్షరాల రూ.93,960.. ఇంకెందుకు ఆలస్యం
హైదరాబాద్ లో ఈ రోజు ఉదయం నుంచి వర్షం దంచికొడుతున్న విషయం తెలిసిందే. పలు చోట్ల రహదారులపైకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిస్తోంది శంషాబాద్ లోనూ గాలులతో పాటు వాన పడటంతో విమానాల ల్యాండింగ్ వాతావరణం అనుకూలించలేదు. దీంతో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావాల్సిన పలు ఫ్లైట్లను దారి మళ్లించారు. శంషాబాద్ కు రావాల్సిన మూడు విమానాలను అధికారులకు విజయవాడకు మళ్లించారు. మరో రెండు విమానాలను తిరుపతి, బెంగళూరుకు పంపించినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
కుండపోత వర్షాలు
మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కుండపోత వానలు పడుతున్నాయి. ఉదయం, సాయంత్రం, రాత్రివేళల్లో నాన్ స్టాప్ గా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలకు నగరవాసులు, ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడక్కడ పిడుగులు కూడా పడుతున్నాయి. అందుకే వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు భాగ్యనగర వాసులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలను అప్డేట్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు కీలక అప్డేట్ ఇచ్చింది.
ప్రయాణాలను వాయిదా వేయండి…
ఈ రోజు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది.. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని జనాలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముుఖ్యంగా వాయు ప్రయాణాలు చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.
ALSO READ: Hydra Commissioner: హైడ్రా జిందాబాద్.. ఆ ఒక్క పనితో వందలాది మంది కాలనీవాసుల్లో ఆనందం