Road accident: కీసర ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కీసర నుంచి ఘట్ కేసర్ కు వెళ్లే రూట్‌లో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. బోలెరో వాహనం అతివేగంగా వచ్చి.. చెట్లకు నీళ్లు పోస్తున్న వ్యక్తులను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తులను ఒడిశాకు చెందినవారిగా స్థానికులు చెబుతున్నారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒడిశాకు చెందిన ముగ్గురు వ్యక్తులు చెట్లకు నీళ్లు పోస్తుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతులను చక్ మోహన్ (21), జైరామ్ (30), నారాయణ (22) గా గుర్తించారు. టీజీ08T2496 నెంబర్ గల మినీ ట్రక్ వేగంగా వచ్చి కార్మికులను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు.
ALSO READ: Monkey video viral: కోతి తలకు పగడి ధరించి.. ఓ మోడల్ లాగా..? వీడియో మస్త్ వైరల్
బతుకుదెరువు కోసం ఒడిశా రాష్ట్రం నుంచి హైదరాబాద్ కు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓఆర్ఆర్ పై ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. అనుకోకుండా ఈ రోజు చెట్లకు నీళ్లు పోస్తుంటే అనుకోకుండా రోడ్డు ప్రమాదం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Marriage: శోభనం రాత్రి.. బాల్కనీ నుంచి దూకిన వధువు.. కట్ చేస్తే, పెద్ద స్కామ్!