Nagarkurnool News: అనుమానంతో పచ్చని సంసారాలకు నిప్పు అంటుకుంటోంది. హైదరాబాద్‌లోని మేడిపల్లి ఘటన మరువకముందే అలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. భార్యని అడవిలోకి తీసుకెళ్లిన భర్త, కత్తితో కసితీరా పొడిచి పొడిచి చంపేశాడు. ఆ తర్వాత భార్య మృతదేహంపై పెట్రోల్ పోసి తగుల బెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంచలనం రేపిన ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగుచూసింది. అసలేం జరిగింది?
అనుమానం పెనుభూతం అవుతోంది. ఫలితంగా పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. ఫలితంగా ఆవేశానికి లోనవుతున్నారు దంపతులు. చివరకు హత్యలు.. ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో అడవిలోకి తీసుకెళ్ళి హత్య చేశాడు భర్త. ఆ తర్వాత పెట్రోల్ పోసి భార్య మృతదేహాన్ని తగుల బెట్టేశాడు. పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో దారుణమైన ఘటన జరిగింది. ఆ జిల్లాలోని లింగాల మండలం కొత్త రాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలం- దేవరకద్రకు చెందిన శ్రావణిలు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇదంతా పదేళ్ల కిందటి మాట. వారికి ఓ కూతురు, కొడుకు ఉన్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి.
ఫలితంగా భార్యభర్తల మధ్య తరచు గొడవలు చోటు చేసుకునేవి. ఈ టార్చర్ తట్టుకోలేని శ్రావణి కొన్నాళ్లుగా పిల్లలతో కలిసి మహబూబ్‌నగర్‌కి వచ్చేసింది. అక్కడే నివాసం ఉంటోంది. ఇంతవరకు బాగానే జరిగింది. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో వెల్డర్‌గా పని చేస్తున్నాడు శ్రీశైలం. అయితే భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. ఈ క్రమంలో తరుచూ గొడవ పడేవాడు.
ALSO READ: రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి
గత జనవరిలో మహిళా పీఎస్‌లో ఫిర్యాదు చేసింది భార్య. అయితే సోమశిలకు వెళ్దామని నమ్మించిన శ్రీశైలం, ఈ నెల 21న మహబూబ్‌నగర్‌కు వచ్చి భార్యను బైక్‌పై తీసుకెళ్లాడు. ఉన్నట్లుండి భర్తలో వచ్చిన మార్పుని గమనించలేకపోయింది. ప్లాన్ ప్రకారం కత్తి-పెట్రోల్‌ను బైక్‌లో పెట్టాడు. పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ అడవిలోకి తీసుకెళ్లాడు. తొలుత బండి ఆపాడు.
ఆ తర్వాత తనతో తెచ్చుకున్న కత్తితో భార్యని పొడిచి హత్య చంపేశాడు. ఆ తర్వాత మృతదేహానికి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కూతురు నుంచి ఎలాంటి సమాచారం రాలేదని గమనించింది ఆమె తల్లి. శనివారం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే రోజు రాత్రి శ్రీశైలం పోలీసుల వద్ద లొంగిపోయాడు. పోలీసుల విచారణలో శ్రీశైలం ఎలాంటి విషయాలు బయటపెడతాడో చూడాలి.
భార్యపై అనుమానం.. దారుణంగా హత్య చేసి చంపిన భర్త
నాగర్‌కర్నూల్-నల్లమల అడవుల్లో దారుణం
భార్య శ్రావణిని దారుణంగా హత్య చేసిన భర్త శ్రీశైలం
కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు
భార్య శ్రావణిపై అనుమానం పెంచుకున్న శ్రీశైలం
సోమశిల వెళ్దామని చెప్పి తీసుకెళ్లి మార్గమధ్యలో శ్రావణి గొంతు… pic.twitter.com/xV344eSsYE
— BIG TV Breaking News (@bigtvtelugu) August 25, 2025