BigTV English
Advertisement

Father Killed Son in Medak: మెదక్‌లో ఘోరం.. బెట్టింగ్‌ ఆడుతున్నాడని కొడుకును రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి!

Father Killed Son in Medak: మెదక్‌లో ఘోరం.. బెట్టింగ్‌ ఆడుతున్నాడని కొడుకును రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి!

Man Loses Rs.2 Crore in Betting killed by Father in Medak: నేటి కాలంలో యువత బెట్టింగ్ అనే వ్యసనానికి బానిసవుతున్నారు. బెట్టింగ్ మోజులో పడి నేటి యువత ఆన్ లైన్ గేమ్ లకు, బానిసై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా సెల్ ఫోన్ వాడకం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ గేమ్స్ మాయలో పడి లక్షలకొద్ది డబ్బును పోగొట్టుకుంటున్నారు. చివరకు ప్రాణాలమీదకు తెచ్చుకొని తల్లి దండ్రులకు కడుపుకోత మిగిల్చి వెల్తున్నారు.


ఒకప్పుడు ఎవరికి తెలయకుండా కొందిరి వ్యక్తుల మధ్య బెట్టింగ్ లు జరిగేవి కాని ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా ద్వారా అందరికి అందుబాటులోకి వచ్చేశాయి. కొందరు కేటుగాళ్లు బెట్టింగ్ ల రూపంలో అమాయకులను మోసం చేసి వారిదగ్గర డబ్బులు కొల్లగొడుతున్నారు. దీంతో వారు వారి సమస్యలను ఎవరి చెప్పుకొలేక, అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు.

అయితే తాజాగా బెట్టింగ్ లో రెండు కోట్లు పోగొట్టున్న కొడుకుని చూసి ఆ తండ్రి పట్టరాని కోపంతో కన్న కొడుకుని రాడ్డుతో కొట్టి చంపాడు. ఈ విషాదకరమైన ఘటన శనివారం రాత్రి మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బగిరాత్ కు చెందిన ముకేష్ కుమార్ అనే వ్యక్తి (28) రైల్వే ఉద్యేగం చేస్తున్నాడు. అతను గత కొంతకాలంగా ఆన్ లైన్ గేమ్ ఆడటం, జల్సాలు చేయడం, చెడు అలవాట్లకు బానిసయ్యాడు. అది గమనించిన అతని తండ్రి సత్యనారాయణ ఎన్నో సార్లు హెచ్చరించాడు. అలవాట్లు మానుకోమని బ్రతిమిలాడాడు. కాని అతను మాత్రం పద్ధతి మార్చుకోలేదు.


Also Read: మైనర్ పై గ్యాంగ్ రేప్.. పేట్రేగిపోయిన నీచులు

పైగా బెట్టింగ్ చేసి రెండు కోట్లు పోగొట్టాడు.. దీంతో సత్యనారాయణకు పట్టరాని కోపంతో ఆవేశంతో కొడుకు తలపై బలంగా రాడ్డుతో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సొంత ఊరిలో ఉన్న ఇల్లు, ప్లాట్లు, పొలాలు అమ్మేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ముకేశ్‌ కుమార్‌ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆన్ లైన్ గేమ్స్ వల్ల ఇరువురి మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

Tags

Related News

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Big Stories

×