BigTV English

Hardik Pandya: పాండ్యాపై అంబానీ వేటు…ముంబైకి కొత్త కెప్టెన్‌ ?

Hardik Pandya: పాండ్యాపై అంబానీ వేటు…ముంబైకి కొత్త కెప్టెన్‌ ?

Hardik Pandya: ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌ కు ( IPL 2025 ) సన్నహాలు ప్రారంభమవుతున్నాయి. ఐపీఎల్ 2025 ధనాధన్ లీగ్ కి ముందు ఆటగాళ్లు దేశవాళీ టోర్నీలో ఊచకోత కుస్తున్నారు. గత సీజన్లో ఫ్లాప్ అయిన ఆటగాళ్లు వచ్చే సీజన్లో తమ సత్తాను నిరూపించుకోవాలని సిద్ధమయ్యారు. ఫ్రాంచైజీ ఓనర్లు కూడా తమ ప్లేయర్ల కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. గత సీజన్లో ముంబై ఇండియన్స్ లీగ్ ప్రారంభ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. వచ్చే సీజన్ లో ఆ పరిస్థితి ఉండకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది.


Also Read: Punjab kings Captains: ఇదేం కర్మ రా.. 17 మంది కెప్టెన్స్ మారారు..కానీ తలరాత మారలేదు ?

వేలంలో మ్యాచ్ విన్నర్లను ఎంపిక చేసిన ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) టైటిల్ లక్ష్యంగా వారిని సిద్ధం చేస్తుంది. గతేడాది ప్లేయర్ ట్రాన్స్ఫర్ విండో ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా ( Hardik Pandya )… రోహిత్ శర్మ ( Rohit Sharma ) నుంచి సారధ్య బాధ్యతలు అందుకున్నాడు. తన కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ విఫలమైనప్పటికీ వచ్చే సీజన్లోనూ హార్దిక్ మళ్ళీ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. ఈ విషయంపై ముంబై యాజమాన్యం ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. అయితే ముంబై ఇండియన్స్ తలపడే మొదటి మ్యాచ్ కి హార్దిక్ పాండ్యా దూరం అవుతుండడం ఓవైపు ఆందోళనకు గురిచేస్తోంది.


స్లో ఓవర్ రేటింగ్ కారణంగా కెప్టెన్ హార్దిక్ పైన బీసీసీఐ నిషేధం విధించింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం మూడుసార్లు స్లో ఓవర్ వేస్తే జట్టు కెప్టెన్ ఒక మ్యాచ్ నిషేధం పడుతుంది. గత సీజన్ లో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) మూడుసార్లు స్లో ఓవర్ వేయడంతో ఆ ఎఫెక్ట్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) పైన పడింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్య వచ్చే సీజన్లో ఆరంభం మ్యాచ్ కి దూరం కానున్నాడు. హార్దిక్ తొలి మ్యాచ్ కి దూరం కావడంతో కెప్టెన్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. రేసులో ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, సూర్య కుమార్ యాదవ్ లాంటి ప్లేయర్లు ఉన్నారు. అయితే ముంబై ఇండియన్స్ జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు సార్లు గెలిపించాడు.

Also Read: South Africa Squad: ఏం గుండెరా అది.. బావుమా కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ బరిలో సౌతాఫ్రికా !

అయితే ఐదు సార్లు జట్టును గెలిపించిన రోహిత్ శర్మ పైన మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రోహిత్ సారధ్యంలో ముంబై ఇండియన్స్ ఐదు ఐపీఎల్ టైటిల్స్ ను గెలుచుకుంది. మరోవైపు హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) మొదటిసారి తొలి సీజన్ లోనే గుజరాత్ టైటాన్స్ ను చాంపియన్ గా నిలబెట్టాడు. విశేషమేంటంటే హార్దిక్ కెప్టెన్సీలో గుజరాత్ రెండవ సీజన్లో రన్నరప్ గా నిలిచింది. 2023 సీజన్ లో టైటిల్ పోరులో చెన్నై గుజరాత్ టైటాన్స్ తో పోటీపడిగా…. చెన్నై విజయం సాధించి అయిదవ టైటిల్ సొంతం చేసుకుంది. ఇక గత సీజన్ లో విఫలమైన ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ).. ఈ సారైనా రాణిస్తుందో చూడాలి.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×