Sister In Law Affair| ఒక యువకుడి హత్య కేసులో పోలీసులు విచారణ చేస్తూ హంతకుడెవరని తలపట్టుకున్నారు. ఎందుకంటే వారి ముందే హంతకుడు నిలబడి.. వారిని తప్పుదోవ పట్టించాడు. అంతా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తరహాలో జరిగిన ఈ ఘటన రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడా ప్రాంతంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా పరిధిలోని మంగ్‌రౌలీ గ్రామంలో పోలీసులకు వారం రోజుల క్రితం ఊరి చివర ఒక పాడు బడ్డ ఇంట్లో ఒక 30 ఏళ్ల యువకుడి శవం లభించింది. ఆ యువకుడి పేరు అజీత్ అని తెలిసింది. రెండు రోజులగా అజిత్ ఇంటికి రాలేదని, అతని తల్లిదండ్రులు, భార్య తెలిపారు. అజిత్ తో పాటు అతని బాబాయ్ కొడుకు గోపాల్ (15) ఎక్కువగా తిరిగేవాడు. పోలీసులు అజిత్ హత్య కేసులో విచారణ చేస్తుండగా.. అతని తండ్రి ఆరుగురు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు ఆ ఆరుగురిని పట్టుకునేందుకు గోపాల్, పోలీసులకు సాయం చేశాడు.
Also Read: రెండు వివాహాలు చేసుకున్న యువతి.. భర్తపై కోపంతో పిల్లల్ని హత్య చేసి..
పోలీసులు అనుమానంతో అరెస్ట్ చేసిన ఆరుగురు నిందితులను ఎంత విచారణ చేసినా ఫలితం లభించలేదు. చివరికి పోలీసులు మృతుడు అజిత్ కుటుంబంలో అందరి మొబైల్ ఫోన్లు చెక్ చేశారు. ముందుగా అజిత్ తో ఎక్కువగా కలిసి తిరిగే గోపాల్ ఫోన్ చెక్ చేయగా.. అందులో అనుమాస్పదంగా ఏమీ లభించలేదు. ఆ తరువాత అజిత్ తల్లిదండ్రులు వద్ద కూడా ఏ ఆధారం దొరకలేదు. చివరగా అజిత్ భార్య ఫోన్ చెక్ చేయగా.. ఒక రహస్యం బయటపడింది. ఆమె మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ వ్యక్తితో రోజూ చాటింగ్ చేసేది. వీడియో కాల్ చేసేది. ఇద్దరూ అజిత్ లేని సమయంలో శృంగారం చేసుకునేవారు. దీని గురించిన వివరాలన్నీ ఆమె వ్యాట్సాప్ చాట్ లో కనిపించాయి. ఆ వ్యక్తి మరెవరో కాదు చనిపోయిన అజిత్‌కు స్వయానా బాబాయ్ కొడుకు అయిన గోపాల్. అయితే గోపాల్ వయసు 15 ఏళ్లు మాత్రమే.
ఆ చాటింగ్ చూసి పోలీసులు గోపాల్ ని అదుపులోకి తీసుకున్నారు. అజిత్ ని గోపాల్ హత్య చేశాడనే అనుమానంతో అతడిని గట్టిగా ప్రశ్నించారు. దీంతో గోపాల్ చివరికి భయపడిపోయి నేరం అంగీకరించాడు. పోలీసుల కథనం ప్రకారం.. అజిత్ కు రెండేళ్ల క్రితం మధు (24) అనే యువతితో వివాహమైంది. అజిత్ ఎప్పుడూ మద్యం సేవించేవాడు. అతనికి తాగుడు అలవాటు ఉండడంతో ఎక్కువగా భార్యను పట్టించుకునేవాడు. దీంతో 9 తరగతి చదువకుంటున్న గోపాల్ ని అతని భార్య ఇంట్లో పనుల కోసం పిలిచేది. ఈ క్రమంతో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. తరుచూ గోపాల్ కు మధు వీడియో కాల్స్ చేసి మాట్లాడేది.
అయితే అజిత్ చనిపోయిన రోజు రాత్రి.. అజిత్, గోపాల్ ఇద్దరూ ఊరి చివర పాడు బడ్డ ఇంట్లో కూర్చొని మద్యం సేవించారు. అయితే అజిత్ ఎక్కువగా తాగడం వల్ల అతను మత్తులో ఉన్నాడు. అప్పుడే గోపాల్ ఫోన్ కు మధు వీడియో కాల్ చేసింది. గోపాల్ పక్కకు వెళ్లి మధుతో వీడియోకాల్ లో మాట్లాడుతుండగా.. అక్కడికి అనుకోకుండా అజిత్ వచ్చి వారిద్దరి మాటలు విన్నాడు. దీంతో తన భార్య అక్రమ సంబంధం గురించి అజిత్ కు తెలిసిపోయింది. కోపంలో అజిత్ గట్టిగా అరవగా.. గోపాల్ వెంటనే ఫోన్ కట్ చేశాడు. అజిత్ కోపంలో గోపాల్ ని కొట్టాడు. దీంతో గోపాల్ ఒక బండరాయితో అజిత్ తలపై కొట్టాడు. ఆ దెబ్బకు అజిత్ కిందపడిపోయాడు. వెంటనే అజిత్ వద్ద ఎప్పుడూ ఉండే కత్తిని గోపాల్ లాగేసుకున్నాడు.
ఆ కత్తితో అజిత్ ఛాతీ, కడుపు భాగంలో చాలాసార్లు పొడిచాడు. అలా అజిత్ ని గోపాల్ హత్య చేసి.. అక్కడి నుంచి ఏమీ తెలియనట్లు ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లి స్నానం చేసి.. రక్తంతో ఉన్న బట్టలు దాచిపెట్టాడు. ఆ తరువాత తన వదిన మధు వద్దకు వెళ్లి ఏమీ తెలియనట్లు అజిత్ తనను వదిలి ఒంటరిగా ఎక్కడికో వెళ్లిపోయాడని చెప్పాడు. ఆ తరువాత ఇద్దరూ శృంగారం చేశారు. రెండు రోజుల తరువాత అజిత్ మృతదేహం లభించగా.. హత్య కేసులో పోలీసులకు గోపాల్ పక్కదారి పట్టించాడు. అయితే తన వదిన మధుని గోపాల్ పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే అజిత్ ని హత్య చేశానని చెప్పాడు.
గోపాల్ టీనేజర్ కావడంతో అతడిని ప్రస్తుతం బాలుర కారగారానికి పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసులో అజిత్ భార్య ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేకపోవడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేయలేదు.