Nani : నేచురల్ స్టార్ నాని (Nani)… ఈ పేరు వినగానే పక్కింటి అబ్బాయిలా ఉండే యంగ్ హీరో గుర్తొస్తాడు. కానీ ఇప్పుడు నాని ట్రాక్ మార్చి, తనలోని కొత్త యాంగిల్ ని బయటకు తీసుకొచ్చాడు. ఆయన బర్త్ డే కానుకగా నేడు రిలీజ్ అయిన ‘హిట్ 3’ (Hit 3) టీజర్ లో ఏకంగా తనలోని కొత్త వెర్షన్ ను ప్రేక్షకులకు చూపించి సర్ప్రైజ్ చేశాడు. మరి నాని ఎందుకు ఇలా మారాడు? గతంలో ఎన్నడూ లేనిది ఈ సినిమాలో ఆయన బూతులు కూడా యూజ్ చేయడానికి గల కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…
పక్కా వైలెంట్ అయ్యాడేంటి ?
నాని కెరీర్ మొదటి నుంచి కంటెంట్ బేస్డ్, ఫీల్ గుడ్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కమర్షియల్ అంశాల జోలికి పెద్దగా పోకుండానే, తనకు నచ్చిన స్క్రిప్ట్ తో అలరించాడు. అప్పుడప్పుడూ యాక్షన్ సినిమా కూడా తీసి, తనలో ఈ యాంగిల్ కూడా ఉందని వెల్లడించాడు. కానీ తాజాగా ‘హిట్ 3’ టీజర్ ని చూశాక అసలు ఇన్నాళ్లు మనం చూసిన నాని… ఈ నాని ఒక్కడేనా? అనే అనుమానం రాకమనదు. టీజర్ లో నాని బ్లడ్ బాత్ చూశాక ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఇందులో రెబల్ గా యాక్ట్ చేయడమే కాకుండా, “ఇన్నాళ్లూ జనాలు కూడా ఇలాగే మోసపోయారు… కానీ ఇప్పుడు చూపిస్తాను ఒరిజినల్ వెర్షన్” అంటూ టీజర్లో ఆయన చేసిన రచ్చ, రక్తపాతం ప్రేక్షకులను నోరు వెళ్ళబెట్టేలా చేసింది.
ముందుగా అందరూ నానిని పక్కింటి అబ్బాయి అని అనుకున్నారు. అంతేకాదు నాని సినిమా అంటే ఎంత వెతికినా ఒక్క మైనస్ కూడా కనిపించేది కాదు. కానీ ‘హిట్ 3’లో మాత్రం యూటర్న్ తీసుకుని, అందరు హీరోలలాగే తను కూడా ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ తో పాటు, ఇప్పటి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మోస్ట్ వైలెంట్ థీమ్ ను వాడారు. నిజానికి ‘సరిపోదా శనివారం’ మూవీ టైంలోనే నాని నుంచి ఇది జనాలు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అందులో ఈ రేంజ్ వైలెన్స్ కి దిగలేదు నాని. ఇక ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సరికొత్తగా దర్శనమిచ్చాడు.
బూతులు కూడానా?
ఇక టీజర్ లో అందరికీ షాక్ ఇచ్చిన మరో విషయం ఏమిటంటే నాని ఏకంగా బూతులు మాట్లాడడం. ఆయన ఇప్పటిదాకా చేసిన ఏ సినిమాలోనూ ఇంత దారుణమైన బూతులు వాడలేదు. కానీ ఫస్ట్ టైం ‘హిట్ 3’ టీజర్ లో మాత్రం “కళ్లు దె*గి*న*యా… చె*త్త నా కొడుకా…” వంటి డైలాగులు వాడి, ఒక్క క్షణం అందరూ ఇది నాని సినిమానేనా అనే ఆలోచనలో పడేలా చేశాడు. మరి ఇప్పటిదాకా నానిని కేవలం పక్కింటి కుర్రాడిలా చూసిన ప్రేక్షకులు, ‘హిట్ 3’లో దర్శనం ఇచ్చిన అర్జున్ సర్కార్ రక్తపతాన్ని, అతని బూతులను ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా ఓ వర్గం ప్రేక్షకులు ఇప్పటికే నాని క్యారెక్టర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. పైగా ఈ మూవీలో ‘మార్కో’ మార్క్ కన్పిస్తుందనే టాక్ మొదలైంది.