Visakhapatnam Youth Suicide: ఈ మధ్యకాలంలో ఎవడూ చూసిన ఐఫోన్, ఐఫోన్ అంటున్నారు. దాన్ని కొనేందుకు తెగ ఎగబడుతున్నారు. ఐఫోన్ ఉంటే అదో పెద్ద స్టేటస్‌లా ఫీల్ అవుతున్నారు. ఇక యూత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కొందరైతే అప్పులు చేసి మరీ ఐఫోన్ కొంటుంటే మరి కొందరు.. ఇంట్లో వాళ్లను వేధించి, ఇప్పించక పోతే బ్లాక్ చనిపోతామని బ్లాక్ మెయిల్ చేసి మరీ దాన్ని సొంత చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది.
విశాఖ జిల్లా సుజాతనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సాయి మారుతి కెవిన్ అనే 26 ఏళ్ల యువకుడు.. తన తండ్రి ఐఫోన్ కొనివ్వలేదని మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
విశాఖపట్నం జిల్లా పెందుర్తి సుజాతానగర్‌కు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తికి సాయి మారుతి అనే కుమారుడు ఉన్నాడు. తండ్రి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతూ జీవనం సాగించేవాడు. కొడుకు సాయి హైదరాబాద్‌లో ఉంటూ సినిమా పరిశ్రమలో పనిచేసేవాడు. అయితే సాయి ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికొచ్చినప్పటి నుంచి సాయి తనకు ఐఫోన్ ఇప్పించాలని తండ్రిని అడగడం స్టార్ట్ చేశాడు.
తండ్రితో ఐఫోన్ విషయంలో వాగ్వాదం
ఘటన జరగడానికి కొన్ని రోజులు ముందే తండ్రి-కొడుకు మధ్య ఐఫోన్ కొనుగోలు విషయంలో వాగ్వాదం జరిగింది. సాయి మారుతి తనకు కావలసిన ఐఫోన్ అందకపోవడం వల్ల మనస్తాపానికి గురయ్యాడు. ఆ తరువాత అతను తన గదిలోకి వెళ్లి, ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పోలీస్ దర్యాప్తు
సుజాతనగర్ పోలీస్ స్టేషన్‌కు సంబంధిత అధికారులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి మృతికి సంబంధించిన వివరాలను సేకరించి, కుటుంబ సభ్యులతో, మిత్రులతో చర్చించారు. పోలీసులు, సంఘటనపై పూర్తి నివేదికను సేకరించి, మరింత చర్యలకు దర్యాప్తు చేయనున్నారు.
Also Read: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన
కుటుంబానికి సూచనలు
కుటుంబాలు, యువత కోసం మానసిక ఆరోగ్య ప్రాధాన్యత కలిగించాలి. వ్యక్తిగత సమస్యలపై ఓపికతో, చర్చలతో పరిష్కారం చూపించడం, చిన్న అంశాలను విస్తృత సమస్యగా భావించకుండా చూడడం అవసరం.