Niziamabad Crime News: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నాయి. ఫలితంగా ఊహించని దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది. మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకుని ఇల్లరికం వచ్చాడు ఓ వ్యక్తి. అప్పటికే అతడి భార్య మరొకరితో వివాహేతర సంబంధించి పెట్టుకుంది. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. సంచలనం రేపిన ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది.
అసలు స్టోరీలోకి వెళ్తే..
నిజామాబాద్ జిల్ల బాన్సువాడకు మండలం నాగారం గ్రామానికి చెందిన 38 ఏళ్ల విఠల్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. పొలం దగ్గర చనిపోవడంతో ప్రత్యర్థులు చేసి ఉంటారని భావించారు. చివరకు విఠల్ బంధువులకు అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తమదైన శైలిలో విచారణ చేపట్టారు. చివరకు భార్య నిందితురాలి తేలింది.
విటల్‌రెడ్డి 20 ఏళ్ల కిందట సోమేశ్వర్ గ్రామంలోని మేనమామ కూతురు కాశవ్వను పెళ్లి చేసుకున్నాడు. మేనమామ కావడంతో ఇల్లరికం వచ్చాడు. మామతో కలిసి అన్ని రకాల పనులు చేసేవాడు. విటల్ తాపీ మేస్త్రిగా పని చేస్తున్నాడు. విటల్ రెడ్డి-కాశవ్యకు ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు. అందులో ఒకరికి మ్యారేజ్ అయ్యింది. మరో ఇద్దరు ఉన్నారు. వారి కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు విఠల్‌రెడ్డి.
మేన కోడల్ని పెళ్లి చేసుకున్నాడు
తన పనుల్లో నిత్యం బిజీగా ఉండేవాడు. విఠల్ భార్య కాశవ్వ నాగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. రోజురోజుకూ భర్త టార్చర్ ఎక్కువ కావడంతో కాశవ్య తట్టుకోలేకపోయింది. చివరకు భర్తను చంపాలని నిర్ణయానికి వచ్చేసింది అతడి భార్య.
ALSO READ: క్రెడిట్ కార్టు నుంచి లక్ష నొక్కేసిన జియో ఫైబర్ ఉద్యోగి
పెళ్లీడు ఆడపిల్లలు, అయినా దారి తప్పింది
ఈ విషయం తన ప్రియుడు అమృత విఠల్‌కు తెలిపింది. దీంతో ఇద్దరు కలిసి విఠల్ రెడ్డి హత్యకు ప్లాన్ చేశారు. శుక్రవారం రాత్రి విఠల్‌ను పొలం వద్దకు తీసువచ్చాడు అమృతం విఠల్. పుల్‌గా మద్యం తాగించాడు. చివరకు టవల్‌తో మెడకు గట్టిగా బిగించాడు. అప్పటికే స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత పైపులతో కొట్టి చంపేశాడు.
అనంతరం విఠల్ మృతదేహాన్ని కొల్లూరు సబ్‌స్టేషన్ సమీపంలోని ప్రధాన రహదారిపై పడేసి సైలెంట్‌గా వెళ్లిపోయాడు. శనివారం ఉదయం అటు వైపు వెళ్తున్న కొందరు శవాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు విఠల్ మృతిపై అతడి అన్న సాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల విచారణలో అసలు గుట్టు బయటకు
తమదైన శైలిలో విచారణ చేపట్టారు పోలీసులు. తొలుత కాశవ్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో మొత్తం గుట్టు అంతా బయటపెట్టింది. ఆ తర్వాత అమృతం విఠల్‌ను అదుపులోకి తీసుకున్నారు. విఠల్‌ను తామిద్దరం హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. కేవలం వివాహేతర సంబంధం కోసం దగ్గర బంధువును చంపేసింది కాశవ్య.
ALSO READ: అమ్మాయిలకు లక్ష్లల్లో జీతాలు.. ఆపై అలాంటి పనులు, నొయిడాలో బయటపడింది