BigTV English

Pawan Kalyan: రూ. 6 కోట్లు విరాళం.. అయినా పవన్ పై ఎందుకంత నెగిటివిటీ.. ?

Pawan Kalyan: రూ. 6 కోట్లు విరాళం.. అయినా పవన్ పై ఎందుకంత నెగిటివిటీ.. ?

Pawan Kalyan:ఏపీ  డిప్యూటీ  సీఎం పవన్ కళ్యాణ్ పేరు సోషల్ మీడియాలో  మారుమ్రోగిపోతుంది. ఏపీలో వరదలు ముంచెత్తాయి. ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. ఎంతోమంది   ఆకలితో  అలమటిస్తున్నారు.   ఇక  ప్రజల బాధలను  చూడలేక   ప్రభుత్వం సైతం  వారిని కాపాడడానికి విశ్వప్రయత్నాలు  చేస్తుంది.  కూటమి కి అనవసరంగా ఓటు వేశామని. ఇప్పటివరకు ఏ ఒక్కరు తమను చూడడానికి రాలేదని చెప్పుకొస్తున్నారు.


ఇక ఇంకోపక్క ప్రభుత్వం.. ప్రజలను కాపాడే బాధ్యతలను తీసుకుంది. హెలికాఫ్టర్ల సాయంతో ఫుడ్ ను కిందకు వదులుతుంది.  ఇక ఇవన్నీ పక్కన పెడితే.. అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ అనే ప్రశ్న తలెత్తింది. సాధారణంగా  సీఎం ఉన్నప్పుడు.. డిప్యూటీ సీఎం గురించి మాట రాదు. కానీ, ఆ ప్లేస్  లో ఉన్నది పవన్ కళ్యాణ్ కాబట్టి.. ఆయనపై నెగిటివిటిని తీసుకొస్తున్నారని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

ఇంత జరుగుతున్నా పవన్ రాకపోవడానికి కారణం  ఉంది.  ఆయన పొలిటీషియన్ మాత్రమే కాదు.. ఒక సినిమా హీరో.  అంత వరదల్లో కూడా పవన్ ను చూడడానికి జనాలు ఎగబడతారు. పవన్ మీద పడతారు. ఆ సమయంలో  చాలామందికి గాయాలు అవుతాయి. కొంతమంది నీళ్లలో చిక్కుకొనే  అవకాశం  కూడా ఉంది.  అవన్నీ ఆలోచించే పవన్ వరద ముంపు ప్రాంతాలలో  కనిపించలేదు.


ఇక ఇవేమి ఆలోచించని కొందరు.. పవన్ మిస్సింగ్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేపట్టారు.  ఇక  వరద ప్రాంతాలకు ఇండస్ట్రీ  తమవంతు సాయం చేస్తున్న విషయం తెల్సిందే.  ఇక పవన్ కళ్యాణ్ .. ఏపీకి ఒక కోటి, తెలంగాణకు ఒక కోటి విరాళంగా   ప్రకటించారు. ఇక  ఇవి కాకుండా 400  పంచాయితీలకు ఒక్కో లక్ష చొప్పున రూ. 4 కోట్లు ప్రకటించారు.

ఇప్పటివరకు ఇంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చిన నటుడు కానీ, రాజకీయ నాయకుడు కానీ ఇచ్చింది లేదు.  ఇంత చేసినా కూడా పవన్ పై నెగిటివిటీ తగ్గలేదు. ఇంకా పవన్ వలనే  ఈ వరదలు వచ్చాయని, సరిగ్గా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది మరీ దారుణంగా.. నువ్వు విజయవాడలో పుట్టి ఉంటే నీకు తెలిసేది.. నువ్వు వరదల్లో చిక్కుకుంటే తెలిసేది అంటూ  విమర్శిస్తున్నారు. అసలు పవన్ పై ఎందుకంత  నెగిటివిటీ.. ? దేనికి ఇంతలా విమర్శిస్తున్నారు .. ?. మరి  ఈ విమర్శలు  ఎక్కడ వరకు వెళ్లి ఆగుతాయో చూడాలి.

Related News

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Big Stories

×