BigTV English

27 Years For Pawanism : ప‌వ‌నిజానికి 27 ఏళ్లు…. ఎమోషనల్ అయిన మెగా మేనల్లుడు…వైరల్ అవుతున్న పోస్ట్….

27 Years For Pawanism : ప‌వ‌నిజానికి 27 ఏళ్లు…. ఎమోషనల్ అయిన మెగా మేనల్లుడు…వైరల్ అవుతున్న పోస్ట్….
27 Years For Pawanism

27 Years For Pawanism : మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికి ఎందరో హీరోలు వచ్చారు…కానీ అందరూ మెగాస్టార్ పేరుతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఒక్కరు మాత్రం దీనికి భిన్నంగా తనదైన స్పెషల్ మార్క్ హీరోఇజంతో స్టార్ హీరోగా ఎదిగాడు. కోట్లాదిమంది ప్రేక్ష‌కహృద‌యాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఈ స్టార్ హీరో ను ముద్దుగా అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తారు. పవన్ కళ్యాణ్ కెరియర్ మొదలుపెట్టి నేటికీ 27 సంవత్సరాలు పూర్తి అవుతోంది.


1996లో మెగా ఫ్యామిలీ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ గా సినీ ఇండస్ట్రీ లోకి హీరోగా అడుగుపెట్టాడు పవన్ కళ్యాణ్. చిరంజీవి ఎప్పుడూ షూటింగ్స్ లో బిజీగా ఉన్న సమయంలో ఎక్కువగా తన వదిన దగ్గర పెరిగిన పవన్ మెగా దంపతులకు పెద్ద కొడుకుతో సమానం. ఇవివి సత్యనారాయణ డైరెక్షన్లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో పవన్ కళ్యాణ్ సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇదే సినిమాలు అక్కినేని ఫ్యామిలీ నుంచి ఏఎన్ఆర్ మనవరాలు ,నాగార్జున మేన‌కోడ‌లు సుప్రియ యార్ల‌గ‌డ్డ కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హీరో గా బ్లాక్ బస్టర్ హిట్ మూవీ…’ఖ‌యామ‌త్ సే ఖ‌యామ‌త్ త‌క్‌’ ఆధారంగా ఈ మూవీ రీమేక్ చేశారు. అయితే చిత్రాన్ని డైరెక్ట్గా అలాగే తీయకుండా మన తెలుగు నేటివిటీకి సెట్ అయ్యే విధంగా కాస్త మార్పులు, చేర్పులు చేశారు. మొదటి సినిమాతో పెద్ద క్లిక్ కాకపోయినా.. పవన్ ఈ మూవీలో చేసిన రియల్ స్టంట్స్ కు ఫాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఆ తర్వాత సుస్వాగతం ,తొలిప్రేమ, తమ్ముడు, బద్రి ,ఖుషి…ఇలా యూత్ ఫుల్ మూవీస్ తో పవన్ తనకంటూ ప్రత్యేకమైన స్టార్ డమ్ క్రియేట్ చేసుకున్నాడు.


యూత్ లో ఫాన్ ఫాలోయింగ్ పెరిగిన తర్వాత…సొంత డైరెక్షన్ లో కూడా కొన్ని సినిమాలు తీశారు. పవన్ కెరియర్ మధ్యలో వచ్చిన ‘జానీ’, ‘గుడుంబా శంక‌ర్‌’ లాంటి మూవీస్ పెద్ద డిజాస్ట‌ర్‌లు గా మిగిలాయి. అయినా సరే గెలుపు.. ఓటమికి, సక్సెస్…ఫెయిల్యూర్ కి సంబంధం లేకుండా పవన్ ఇమేజ్ పెరుగుతూనే వచ్చింది. ఫ్లాప్స్ ఎదురవుతున్న మార్కెట్ వాల్యూ ఏ మాత్రం తగ్గని టాలీవుడ్ స్టార్ హీరో ఎవరు …అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే అని చెప్పవచ్చు.

ఈ 27 ఏళ్ల సుదీర్ఘ సీనీ ప్రస్థానంలో పవన్ ఇప్పటికీ 30 సినిమాల్లో నటించడం జరిగింది. సుమారు పది సంవత్సరాల విరామం తర్వాత ‘గ‌బ్బ‌ర్ సింగ్‌’తో తిరిగి మాంచి బ్లాక్ బ‌స్ట‌ర్‌ని సొంతం చేసుకున్నాడు పవన్. ఇక అప్పటినుంచి ఇప్పటివరకూ…అదే క్రేజ్ కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. హీరోయిజం కు కొత్త నిర్వచనం పవనిజం అని అనడం లో అతిశయోక్తి లేదు. ఇక క్రమంగా రాజకీయాల్లో కూడా అడుగుపెట్టిన పవన్ జనసేన పార్టీని స్థాపించి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడుతున్నాడు.

ఈ బుధ‌వారంతో ప‌వ‌నిజం కు 27 ఏళ్లు అంటూ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

‘ ఇప్పటివరకు ఆయన ఇంక్రెడిబుల్ జర్నీ 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ ఎప్పటికీ చెక్కుచెదరని అతని అచంచలమైన మ్యాజిక్ రాక్ సాలిడ్ గా ఉంటుంది. దీనికి సాక్షిగా ఉండడమే కాకుండా అటువంటి లెజెండరీ వ్యక్తితో ఎదుగుతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయనతో కలిసి ఒకే స్క్రీన్ ని పంచుకోవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నిజంగా అతను వన్ అండ్ ఓన్లీ ఓజీ’… అంటూ మేనమామపై తనకున్న ప్రేమను ఎమోషనల్ గా పోస్టులో పంచుకున్నాడు సాయి ధరమ్ తేజ .

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×