BigTV English

Prabhas: వారికి క్షమాపణలు చెప్పిన ప్రభాస్.. వీడియో వైరల్

Prabhas: వారికి క్షమాపణలు చెప్పిన ప్రభాస్.. వీడియో వైరల్

Prabhas: తెలుగువారి సత్తాను పాన్ ఇండియా రేంజ్ వరకు తీసుకెళ్లిన డైరెక్టర్ రాజమౌళి. మన సినిమాలు ఇక్కడ మాత్రమే ఆడితే సరిపోదు.. విదేశాల్లో కూడా ఆడాలి అని.. జక్కన్న  తన సినిమాలను జపాన్ లో రిలీజ్ చేయడం మొదలుపెట్టాడు. అలా తెలుగు హీరోలకు  కూడా జపాన్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా డార్లింగ్ ప్రభాస్ కు ఇంకాస్త  ఎక్కువగానే ఉంది.


జపాన్ లో రిలీజ్ అయిన మొట్ట మొదటి సినిమా బాహుబలి. ఆ తరువాత చాలా సినిమాలు జపాన్ లో రిలీజ్ అయ్యాయి.  తాజాగా ఆ లిస్ట్ లోనే కల్కి 2898AD కూడా చేరబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే హీరోహీరోయిన్స్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898AD.  వైజయంతీ  మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించిన ఈ సినిమా జూన్ లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కు కేంద్రం షాక్.. ‘సీజ్ ది షిప్’ కుదరదని స్పష్టం


మొదటి షో నుంచి కూడా హిట్ టాక్ తెచ్చుకొని రికార్డ్ కలక్షన్స్ రాబట్టింది. ఇక కేవలం థియేటర్ లోనే కాకుండా ఓటీటీలో కూడా కల్కి దుమ్మురేపింది. ఇప్పుడు జపాన్ లో  దుమ్మురేపడానికి సిద్దమయ్యింది.జనవరి 3న జపాన్ లో కల్కి రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు మేకర్స్. ఎక్కడ రిలీజ్ అయినా.. ప్రమోషన్స్ మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్లు చేస్తున్నారు.

ఇప్పటికే  డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక్కడే జపాన్ లో కల్కి ప్రమోషన్స్ కోసం కష్టపడుతున్నాడు. మా బాహుబలి ఎప్పుడెప్పుడు జపాన్ వస్తాడా.. ? అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే వారందరికీ ఒక బ్యాడ్  న్యూస్.  కొన్ని కారణాల వలన ప్రభాస్ జపాన్ వెళ్లడం లేదు. ఈ విషయాన్నీ ప్రభాస్ నే ఒక వీడియో ద్వారా తెలుపుతూ జపాన్ అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. జాపనీస్ లో మాట్లాడుతూ ప్రభాస్  ఒక వీడియో రిలీజ్ చేశాడు.

Rajamouli: జక్కన్న డైరెక్షన్లో సినిమా చేసినా.. స్టార్ స్టేటస్ అందుకోలేకపోయిన హీరోలు వీళ్లే..!

“థాంక్యూ  సో మచ్. నా మీద, నా సినిమాల మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కానీ, మీ అందరికి నేను సారీ చెప్తున్నాను.ఎప్పటి నుంచో నేను కూడా జపాన్ కి రావాలి అనుకుంటున్నాను. కానీ. నా కాలికి గాయం కావడం వలన రాలేకపోతున్నాను. జపాన్ లో నా సినిమా కల్కిని రిలీజ్ చేస్తున్న వారికి ధన్యవాదాలు. జనవరి 3 న కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది. చూసి ఆనందించండి..  త్వరలోనే నేను జపాన్ వస్తాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఈ మధ్యనే ప్రభాస్ కాలికి గాయం అయిన విషయం తెల్సిందే. అది చిన్న గాయమే అయినా.. ఫ్యాన్స్ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం డార్లింగ్.. రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీని తరువాత పౌజీ సెట్ లో అడుగుపెట్టనున్నాడు. మరి ఇండియాలో రచ్చ రేపిన ఈ సినిమా జపాన్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

Big Stories

×