BigTV English

Telugu Heroes : ఈ ముగ్గురు ఫెయిల్యూర్ హీరోలకు జూలై వరం అవుతుందా..? వీళ్ల గతి మారుస్తుందా..?

Telugu Heroes : ఈ ముగ్గురు ఫెయిల్యూర్ హీరోలకు జూలై వరం అవుతుందా..? వీళ్ల గతి మారుస్తుందా..?

Telugu Heroes:వేసవికాలం వచ్చిందంటే.. సినిమాలు ఎప్పుడు వస్తాయా అని మూవీ లవర్స్ ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది పెద్ద హీరో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే అందరూ వాటి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, రామ్ చరణ్ గేమ్ చేంజెర్ సినిమాలు జనవరి నెలలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. తాజాగా ఏప్రిల్ నెలలో కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి, ఒదేలా 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇవి అనుకున్నంత స్థాయిలో సక్సెస్ ని అందుకోలేదు. ఇక మే నెలలో హిట్ 3, హరిహర వీరమల్లు, రాజా ది సాబ్, సినిమాలు సందడి చేయనున్నాయి. ఇక జూన్, జూలై నెలలో వరసగా రిలీజ్ కాబోతున్నాయి. ముగ్గురు టాప్ హీరోల సినిమాలు వారం, రెండు వారాల వ్యవధిలోనే రానుండడంతో అభిమానులలో ఆసక్తి నెలకొంది. ఆ ముగ్గురు హీరోలు ఇప్పటికే రిలీజ్ అయిన చిత్రాలు ఆడక తీవ్ర నిరాశతో ఉన్నారు. ఈ సినిమాలు వారి కెరీర్ కి ఎంతో ముఖ్యం. ఆ సినిమాలు ఏంటి ఆ హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..


విశ్వంభర..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా తరువాత వచ్చిన భోళా శంకర సినిమాలు ఆశించినంత స్థాయిలో సక్సెస్ ని అందుకోలేదు. ఎన్నో ఆశలతో వచ్చిన ఈ రెండు సినిమాలు బోల్తాపడడంతో చిరంజీవి ఆశలన్నీ రాబోయే విశ్వంభర మీదే పెట్టుకున్నాడు. బింబి సారా తో హిట్ అందుకున్న దర్శకుడు వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పై టాలీవుడ్ లో పెద్ద చర్చే జరుగుతుంది. ఈ సినిమాలో త్రిష కథానాయకగా నటిస్తున్నారు. స్టాలిన్ తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా జులై నెలలో రానుంది. ఈ సినిమా చిరంజీవి కి ఎంతో ముఖ్యం. ఈ సినిమా నుంచి ట్రైలర్, పాటలు రిలీజ్ అయితే కానీ ఒక అంచనాకి రాలేము. ఇప్పటివరకు సినిమా టీజర్ చూస్తే విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. జూలై నెల చిరంజీవికి వరం అవుతుందో లేదో చూడాలి.


మాస్ జాతర..

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ గత ఏడాది ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఆశించినంత స్థాయిలో సక్సెస్ ని అందుకోలేదు. దానికి ముందు 2023 లో వాల్తేరు వీరయ్య సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఆ సినిమా ఆశించినంత స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు రవితేజ ఆశలన్నీ విడుదల కాబోతున్న మాస్ జాతర పైనే ఉన్నాయి. భాను భోగ వరపు దర్శకత్వంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పాట రిలీజ్ చేశారు. దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి వాయిస్ ను రీ క్రియేట్ చేసి మాస్ జాతర సినిమాలో పాటను రూపొందించారు. అభిమానుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. జూలై నెలలో రిలీజ్ కానున్న రవితేజ కి వరంగా మారనుందో లేదో చూడాలి.

తమ్ముడు..

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఈ సంవత్సరం రాబిన్ హుడ్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఆ మూవీ ఆశించినంత స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు నితిన్ ఆశలన్నీ తమ్ముడు సినిమా పైనే పెట్టుకున్నారు. చాలా రోజులుగా నితిన్ సినిమా సూపర్ హిట్ అవ్వలేదు. సాయిరాం వేణు దర్శకత్వంలో తమ్ముడు సినిమా రానుంది. జులై నెలలో ఈ సినిమాను థియేటర్లోకి తీసుకురానున్నారు. ఈ సినిమా నితిన్ కి కీలకమని చెప్పొచ్చు. ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్ రిలీజ్ అయితే సినిమాపై ఒక అంచనాకి రావచ్చు అంటున్నారు నిపుణులు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. జులై నెలలో రిలీజ్ అవుతున్న ఈ మూడు సినిమాలు ముగ్గురు హీరోలకు వరం అవుతాయో, వీళ్ళ గతిని మారుస్తాయో లేదో చూడాలి.

Faria Abdullah : ట్రోమా లేదు ఏం లేదు… కామెడీ కోసం చెప్పా అంతే.. కవర్ చేసుకున్న చిట్టి

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×