BigTV English

Radhika-Rajinikanth: హేమ కమిటీ రిపోర్ట్‌పై రజినీకాంత్ వ్యాఖ్యలకు.. స్పందించిన రాధిక శరత్ కుమార్

Radhika-Rajinikanth: హేమ కమిటీ రిపోర్ట్‌పై రజినీకాంత్ వ్యాఖ్యలకు.. స్పందించిన రాధిక శరత్ కుమార్

Radhika about Rajinikanth silence on Hema committe Report: ప్రస్తుతం అన్ని బాషల సినిమా ఇండ్రస్ట్రీలలో హేమ కమిటీ రిపోర్ట్ గురించి చర్చ జరుగుతోంది. మలయాళ చిత్ర పరిశ్రమంలోని లైంగిక వేధింపులపై కేరళ్ ప్రభుత్వం ఇచ్చిన హేమ కమిటీ రిపోర్ట్‌పై అగ్రతారలు స్పందిస్తున్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో రజినీకాంత్ మాట్లాడుతున్నప్పుడు కొంద‌రు విలేక‌రులు.. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులను అరిక‌ట్టేందుకు కేరళ ప్రభుత్వం హేమా క‌మిటీని వేసిన‌ట్లు.. తమిళ సినిమా కోసం ఏమైన కమిటీని వేస్తారా? అని అడగ్గా.. నాకు నాకు హేమ కమిటీ రిపోర్ట్ అంటే ఏంటో తెలీదు క్షమించండి. దీనిపై త‌ర్వాత మాట్లాడుతాను అంటూ రజినీకాంత్ అన్నారు. అగ్ర నటుడు రజినీకాంత్ ఆ స‌మాధానం చెప్పడంతో పెద్ద చర్చకు దారి తీసింది. ర‌జ‌నీకాంత్‌కి నిజంగానే హేమ క‌మిటీ రిపోర్ట్ విష‌యం తెలియ‌దా? లేక దాని గురించి మాట్లాడ‌క‌పోవ‌డానికి ఏదైనా కార‌ణం ఉందా అన్న అనుమానాలు మొద‌లయ్యాయి. స‌రిగ్గా అలాంటి స‌మ‌యంలో రజినీకాంత్ వ్యాఖ్యలపై కోలీవుడ్ సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ స్పందించారు.


అగ్ర నటులు మౌనం వీడాలి..

రాధిక శరత్ కుమార్ అగ్ర నటీనటులు హేమ కమిటీ నివేదికపై మౌనంగా ఉండటాన్ని ఖండించింది. హేమ కమిటీ గురించి రాధిక మాట్లాడుతూ.. ఈ కమిటీ గురించి రజనికాంత్‌కు ఏమైనా తెలిసి ఉంటే ఖచ్చితంగా మాట్లాడేవారు. తెలియదు కాబట్టే ఆయన ఏం మాట్లాడలేదు. అయితే, ఈ విషయం తెలుసుకోకపోవడం, దాని మాట్లాడకపోవడం ప్రజలకు తప్పుగా అర్థం అయ్యే అవకాశం ఉంది. అగ్ర తారలు దీనిపై మౌనం వీడి మాట్లాడితేనే.. మహిళా నటులకు మానసిక ధైర్యంతోపాటు వేధింపులకు గురైన నటీమణులకు న్యాయం దక్కుతుందన్న ఆశ కలుగుతుంది. ప్రజలు సైతం దీని గురించి మాట్లాడాలని రాధిక అన్నారు.

కోలివుడ్‌లో మహిళా నటులు చాలామంది రాజకీయ ప్రస్థానం కలిగి సమాజం కోసం కష్టపడుతున్నారు. సమాజంలో భాగమైన తోటి నటీమణుల బాధను అర్థం చేసుకుని వాళ్లకు మద్దతు ఇవ్వాలని రాధిక కోరారు. ఈ వేధింపులు కేవలం మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు అన్ని చిత్ర పరిశ్రమలో ఉన్నాయని, కారవాన్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు.


Also Read: క్యాస్టింగ్ కౌచ్ పై స్వీటీ కూడా స్పందించేసింది.. సమంతకు మద్దతుగా

హేమ కమిటీ రిపోర్డ్ అంటే ఏమిటి?

2017లో నటి భావనపై లైంగిక వేధింపులుకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును అనుసరించి మలయాళ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, కమిట్‌మెంట్, వంటి లైంగిక వేధింపుల ఆరోపణలను పరిశోధించడానికి రిపోర్ట్ ఇవ్వాలని కేరళ ప్రభుత్వం కొందరు సభ్యులతో జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను రిపోర్ట్‌‌లో.. డైరెక్టర్, నిర్మాత, హీరో, నటుడు సైతం మహిళలను లైంగికంగా ఎలా వేధిస్తున్నారో ఉండటం చూసి కేరళ ప్రభుత్వం షాకైంది. వెంటనే మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై వేధింపులకు గాను, మానవ హక్కుల ఉల్లంఘన సంఘటనను వెల్లడించిన జస్టిస్‌ కె హేమ కమిటీ అందించిన నివేదిక ప్రకారం ఒక సిట్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపాలని ఆదేశించింది. అప్పటి నుంచి ఎంతోమంది అందాల ముద్దుగుమ్మలు తాము ఎదుర్కొన్న బాధలను పబ్లిక్‌‌‌గా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ హేమ కమిటీ గురించి అగ్ర నటులు సైతం మాట్లాడేందకు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు.

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×