Big Stories

IPL 2024 RCB Vs KKR Highlights: నేడు ఛాలెంజర్స్ వర్సెస్ నైట్ రైడర్స్..

Today's IPL Match RCB vs KKR

- Advertisement -

IPL 2024: RCB Vs KKR Prediction: ఐపీఎల్ మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఇంతవరకు వెలుగులోకి రాని ఆటగాళ్లు ఒకొక్కరు ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. రాజస్తాన్ రాయల్స్ నుంచి రియాగ్ పరాన్ సత్తా చాటాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి అభిషేక్ శర్మ వెలుగులోకి వచ్చాడు. ఇప్పటికి 10 ఐపీఎల్ మ్యాచ్ లు జరిగాయి. రాబోవు రోజుల్లో ఇంకెంత మంది వెలుగులు ప్రసరిస్తారో చూడాలి.

- Advertisement -

నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య మొత్తం 32 మ్యాచ్ లు జరిగాయి. వీటిలో ఆర్సీబీ 14 గెలిస్తే, కేకేఆర్ 18 సార్లు విజయం సాధించింది.

ఐపీఎల్ 2024 కొత్త సీజన్ లో ఆర్సీబీ ఒక మ్యాచ్ ఓడి, ఒక మ్యాచ్ గెలిచి మూడో మ్యాచ్ కు సిద్ధమవుతోంది. కోల్ కతా ఒక మ్యాచ్ ఆడి విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ పై విరాట్ కొహ్లీ 77 పరుగులు చేసి మ్యాచ్ ని గెలిపించాడు. అదే కోల్ కతాలో చూస్తే ఆల్ రౌండర్ ఆండ్రూ రసెల్ 64 పరుగులతో విధ్వంసం చేసి సన్ రైజర్స్ పై గెలిపించాడు. వీరిద్దరూ రెండు వైపులా ప్రమాదకర ప్లేయర్లులా కనిపిస్తున్నారు.

Also Read: ఆఫ్ కట్టర్స్ వేయాలనే వ్యూహంతో వచ్చాం: కమిన్స్

బెంగళూరు స్టేడియం బ్యాటర్లకు అనుకూలిస్తుంది. టాస్ కీలకంగా మారనుంది. అంతేకాదు 200 పైన పరుగులు చేస్తేనే మ్యాచ్ ని కాపాడుకునే వీలుంటుందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. జట్టులో బలాబలాలని చూస్తే కోల్ కతాకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో వీరు ఆడవచ్చు: ఫాఫ్ డు ప్లెసిస్ (సి), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్), మయాంక్ డాగర్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో వీరు ఆడవచ్చు: ఫిల్ సాల్ట్ (WK), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (c), నితీష్ రాణా, రమణదీప్ సింగ్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News