Anil Ravipudi: ప్రతీ ఏడాది సంక్రాంతికి ఎన్నో సినిమాలు విడుదల అవుతుంటాయి. అసలు సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. చాలావరకు సంక్రాంతికి ఎన్నో సినిమాలు విడుదలయినా ప్రేక్షకులకు నచ్చితే అన్నీ హిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అలాగే ఈసారి కూడా సంక్రాంతికి మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. అందులో అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఒకటి. ముఖ్యంగా ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చేసి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ సినిమాను ఇంకా ప్రమోట్ చేస్తూనే ఉన్న అనిల్ రావిపూడి.. తాజాగా దీని రీమేక్ ప్లాన్స్ గురించి బయటపెట్టాడు.
అప్పుడే ఊహలు
ఫ్యామిలీస్ అందరికీ నచ్చేలా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అందుకే ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ విషయంలో కూడా ఈ మూవీ దూసుకుపోతోంది. అయినా ఇప్పటికీ ప్రమోషన్స్‌కు మాత్రం బ్రేక్ ఇవ్వడం లేదు. ఇప్పటికీ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటూనే ఉన్నాడు. ఆ ప్రమోషన్స్‌లో భాగంగానే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు అనే ప్రశ్న అనిల్‌కు మొదలయ్యింది. దీనికి సమాధానంగా సల్మాన్ ఖాన్ పేరు చెప్పాడు ఈ దర్శకుడు. దీంతో అనిల్ రావిపూడి, సల్మాన్ ఖాన్ (Salman Khan) కాంబినేషన్‌లో సినిమా ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు అప్పుడే ఊహించుకోవడం మొదలుపెట్టేశారు.
నిజంగానే చేస్తాడా?
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఈ రేంజ్‌లో హిట్ అవ్వడానికి వెంకటేశే ముఖ్య కారణం. ఆయన హీరోగా నటించే ప్రతీ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంటుంది. అదే ఆయన నిజంగానే ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఒక సినిమా చేస్తే అది ఏ రేంజ్‌లో వారిని ఆదరిస్తుందో చెప్పడానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ను ఉదాహరణగా తీసుకోవచ్చు. అయితే అలాగే బాలీవుడ్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే సత్తా సల్మాన్ ఖాన్‌కు ఉందని, ఒకవేళ ఈ మూవీని హిందీలో రీమేక్ చేయాల్సి వస్తే సల్మానే కరెక్ట్ అని అనిల్ రావిపూడి (Anil Ravipudi) చెప్పుకొచ్చాడు. ఇది విన్న తర్వాత నిజంగానే ‘సంక్రాంతికి వస్తున్నాం’ను హిందీలో రీమేక్ చేసే ప్లాన్స్‌లో అనిల్ రావిపూడి ఉన్నాడా అనే అనుమానాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి.
Also Read: పారితోషకంలో వెంకీనే మించిన డైరెక్టర్.. ఎన్ని కోట్లంటే?
ఇద్దరి మధ్య పోలికలు
‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) హిందీ రీమేక్‌పై అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ప్రేక్షకులు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కామెడీ టైమింగ్‌లో వెంకటేశ్ కంటే సల్మాన్ ఖాన్ చాలా వెనకబడి ఉన్నాడని ఒక నెటిజన్ అన్నారు. వెంకటేశ్ లాగా సల్మాన్ ఖాన్ నేచురల్‌గా చేయలేడని అన్నారు. కానీ బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం సల్మాన్ ఖాన్ ఈ రీమేక్ చేయడం కరెక్టే అని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న ‘సికిందర్’పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. మరి ఈ మూవీ తనకు ఎంతవరకు హిట్ అందిస్తుందో చూడాలి.