Ashu Reddy : టాలీవుడ్ జూనియర్ సమంతగా యాంకర్ అషు రెడ్డి అందరికి సుపరచితమే.. హీరోయిన్ మెటీరియల్.. అయిన ఆమె సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా రాలేదు. కొన్ని సినిమాల్లో నటించింది. అయితే అవి ఆమె కెరీర్ ను ముందుకు తీసుకెళ్లలేక పోయాయి. ఆ తర్వాత మళ్లీ బుల్లితెరపై మెరిసింది. యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు చేస్తూ వస్తుంది. ఈ మధ్య బుల్లితెరపై పలు షోలలో సందడి చేస్తుంది. తన అందంతో సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తుంది. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ నిత్యం ట్రెండ్ అవుతుంది. ఇక ఆమెకు సోషల్ మీడియాలో హీరోయిన్ కన్నా ఎక్కువే ఫాలోయింగ్ ఉంది. ఆ క్రేజ్ తో బిగ్ బాస్ షోకి వెళ్లి చాన్స్ వచ్చింది. అక్కడ కూడా తన ఆట, మాటల తీరుతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నది.. అయితే అషుకు దైవ చింతన కూడా ఎక్కువే.. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలపై నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి..
అషు రెడ్డి ప్రత్యేక పూజలు..
ఫ్యాషన్ ఐకాన్ గా ఉండే ఈ అమ్మడుకు దైవ చింతన కూడా ఎక్కువే.. దేవాలయాలను సందర్శిస్తూ అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా మరోసారి ఆలయాల సందర్శన చేసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ వైరల్ అవుతున్నాయి. భారతదేశంలోని ప్రముఖ దేవాలయం అయిన కామాఖ్య దేవాలయాన్ని సందర్శించింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అయితే ఆమెతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు కూడా ఉండడంతో గట్టిగా మరోసారి హాట్ టాపిక్ గా మారింది అషు రెడ్డి.. గతంలో ఆయనతో కలిసి పూజలు చేసిన ఈమె ఇప్పుడు ఆయన తనని కలిసి అక్కడ మరోసారి ప్రత్యేక పూజలు చేయడంతో మరోసారి ఈమె పై ట్రోల్స్ మొదలయ్యాయి..
సెలబ్రిటీలకు జాతకాలు చెబుతూ వారికి ఏమైనా దోషాలు ఉన్నట్లయితే వారికి సంబంధించిన పూజలు నిర్వహించడం లాంటివి చేస్తూ ఉంటాడు. సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ప్రతిసారి వేణు స్వామి ఏదో ఒక గొడవలో చిక్కుకుంటూనే ఉన్నారు.. అలాంటి ఆయనతో కలిసి అషు రెడ్డి రహస్య పూజలు చేస్తుందా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. వేణు స్వామి, అషు రెడ్డి మరికొంతమంది సీరియల్స్ నటీమణులు పూజలను నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి..
Also Read :తన కూతురి విషయంలో దిద్దుకోలేని తప్పు చేసిన జగపతి బాబు..?
అషు కెరీర్ విషయానికొస్తే..
డబ్ స్మాష్ లతో బాగా ఫెమస్ అయిన వారిలో ఈమె కూడా ఒకరు.. అలా తన క్రేజ్ ను పెంచుకుంది. ఆ తర్వాత యూట్యూబ్ యాంకర్ గా సెలెబ్రిటలతో పలు ఇంటర్వ్యూలు చేసి బాగా ఫేమస్ అయింది. అలాగే కొన్నేళ్లపాటు యాంకర్‌గానూ రాణించిన ఈ భామ రామ్ గోపాల్ వర్మతో రచ్చ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే సందడి మాములుగా ఉండదు. కేక పెట్టించే అందాలతో కుర్రకారుని తనవైపుకి తిప్పుకుంటుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా అషు రెడ్డి తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. అవేంటో ఒక లుక్ వేసుకోండి..
?igsh=bm5sbXZmcWwxYm5n